ఆంధ్రవిశ్వవిద్యాలయం, జూలై 20:ఆంధ్రవిశ్వవిద్యాలయం ఆర్ట్స్, కామర్స్ కళాశాల చీఫ్ వార్డెన్‌గా ఆంగ్ల విభాగం ఆచార్యులు ఎన్.సాల్మన్ బెన్నీ నియమితులయ్యారు. సోమవారం ఆయన చీఫ్ వార్డెన్‌గా పదవీ బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆచార్య ఎన్.సాల్మన్ బెన్నీ మాట్లాడుతూ హాస్టల్స్ నిర్వహణలో విద్యార్థుల భాగస్వామ్యం, సిబ్బంది సహకారం స్వీకరిస్తూ సమర్ధవంతంగా నిర్వహిస్తామన్నారు. విద్యార్థులు తమ సమస్యలను కార్యాలయంలో తెలియజేయాలని, తాము పూర్తిస్తాయిలో అందుబాటులో ఉంటామన్నారు.ఈ సందర్భంగా ఆచార్య సాల్మన్ బెన్నిని ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య జాలాది రవి, కార్యాలయ సిబ్బంది, పలువురు ఆచార్యులు అభినందించారు.
*విద్యార్థులతో సమావేశం...*ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ ఇతర అధికారులతో కలిసి విద్యార్థులతో సమావేశమయ్యారు. హాస్టల్స్‌లో విద్యార్థులకు మెరుగైన వసతి, భోజనం అందించడానికి అవసరమైన చర్యలపై చర్చించారు.
నిరంతర పర్యవేక్షణతో సమస్యల రహితంగా హాస్టల్స్‌ను నిలపాలని ప్రిన్సిపాల్ సూచించారు. కార్యక్రమంలో ఆర్ట్స్ కళాశాల చీఫ్ వార్డెన్ ఆచార్య ఎన్.సాల్మన్ బెన్నీ, విద్యార్థి వ్యవహారాల డీన్ ఆచార్య ఎస్.హరనాథ్, అసిస్టెంట్ ప్రిన్సిపాల్ ఆచార్య వి.శ్రీమన్నారాయణ, పూర్వ చీఫ్ వార్డెన్ ఆచార్య రమేష్ తదితరులు పాల్గొన్నారు.



Comments
Post a Comment