. K.V.SHARMA EDITOR
విశాఖ సందేశం:16జూలై: హరే కృష్ణ మూవ్మెంట్ ఆధ్వర్యంలో గురువారం సంప్రదాయ పద్దతిలో శ్రీశ్రీశ్రీ జగన్నాధ రథయాత్ర నిర్వహించారు.
ఎంవీపీ కాలనీ ఐఐఏఎం కళాశాల నుంచి సాయంత్రం 4 గంటలకు ప్రారంభమైన ఈ యాత్ర ప్రారంభ కార్యక్రమంలో అతిధులు గా హాజరైన విశాఖపట్నం హరే కృష్ణ మూమెంట్ ప్రెసిడెంట్ నిష్కించిన భక్త దాస, విశాఖ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు,విశాఖ పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి, ఐఐఏఎం కళాశాల మేనేజ్మెంట్ సభ్యురాలు ఎస్ విజయ తదితరులు రథయాత్ర ప్రాముఖ్యతను తెలిపారు.
అనంతరం రథయాత్ర ప్రయాణించే మార్గంలో అతిథులు రోడ్డు శుభ్రం చేసి శ్రీ జగన్నాథ రథయాత్రకు స్వాగతం పలికారు. డబల్ రోడ్ నుంచి ఇసుక తోట హైవే, వెంకోజీపాలెం, క్యాన్సర్ హాస్పిటల్,బీచ్ రోడ్ అప్పుఘర్ నుంచి ఐఐఏఎం కళాశాల వద్ద యాత్ర ముగిసింది.
సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు సాగిన రథయాత్రలో సంకీర్తనలతో , నృత్యాలతో, కోలాటాలతో భక్తులు భక్తి భావంతో రథాన్ని లాగుతూ పారవశ్యం చెందారు. దారి పొడవున భక్తులు హారతులతో జగన్నాధునికి స్వాగతం పలికారు.రాత్రి 8 గంటలకు కంచరపాలెంకి చెందిన శ్రీ రాధా కృష్ణ డాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో సాంసృతిక కార్యక్రమాలు, బడే రాణి ఆధ్వర్యంలో భరతనాట్య కార్యక్రమం నిర్వహించారు.
రాత్రి 9 గంటలకు శ్రీ జగన్నాథస్వామికి మంగళ హారతి ఇచ్చారు.అనంతరం భక్తులకు మహా ప్రసాద వితరణ చేసారు.ఈ రథయాత్రలో వేలాదిమంది భక్తులు మంగళ వాయిద్యాలు,కోలాటాలు చేస్తూ వివిధ సంగీత వాయిద్యములతో నృత్యాలు చేస్తూ శ్రీ జగనాథుని సేవలో పాల్గొన్నారు.విశాఖపట్నం హరే కృష్ణ మూమెంట్ ప్రెసిడెంట్ నిష్కించిన భక్త దాస ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులు తన్మయత్వంతో శ్రీశ్రీశ్రీ జగన్నాధుని దర్శించుకుని పారవశ్యం చెందారు.

Comments
Post a Comment