Skip to main content

విశాఖపట్నం టౌన్ కొత్తరోడ్ లో వేంచేసియున్న శ్రీ జగన్నాథ స్వామి దేవస్థానం వారి రథయాత్ర మహోత్సవాలలో భాగంగా ఈరోజు స్వామి వారి సంప్రోక్షణ పీఠారోహణం మరియు హుండీల లెక్కింపు జరిగింది.


విశాఖపట్నం టౌన్ కొత్తరోడ్ లో వేంచేసియున్న శ్రీ జగన్నాథ స్వామి దేవస్థానం వారి రథయాత్ర మహోత్సవాలలో భాగంగా ఈరోజు స్వామి వారి సంప్రోక్షణ పీఠారోహణం మరియు హుండీల లెక్కింపు జరిగింది. సోమవారం ఉదయం 10:00 గంటలకు ప్రధాన ఉత్సవ అధికారి (CFO) టి అన్నపూర్ణ గారు, ఆలయ EO టి.రాజగోపాల్ రెడ్డి, విశాఖ జిల్లా తనిఖీదారు ఎం శ్రీధర్, ధర్మ కర్తల మండలి చైర్మన్ ఎస్ రాజ్ కుమార్ మరియు సభ్యులు బి సత్యనారాయణ, ఆర్ రాము, ఎస్ జ్యోతి, యు ఆదిలక్ష్మి, పి కళ్యాణి, ఎమ్ రమణి, ఎన్ భాస్కర్, బి విజయదుర్గ, మంత్రి శాలివాహన్ మరియు పోలీసు వారి సమక్షంలో హుండీలు తెరిచి లెక్కింపు చేయగా, రథయాత్ర పది రోజులకుగాను హుండీ ఆదాయం ₹24,62,145/- వచ్చినది. ఈ సంవత్సరం రథయాత్ర మహోత్సవాలలో హుండీల ఆదాయం క్రిందటి సంవత్సరం కంటే ₹5,19,575/- అధికంగా వచ్చినది. 

వచ్చే గురువారం అనగా 06-08-2026 న దేవస్థానం వద్దనే 5000 మందికి మహా అన్నదానం కార్యక్రమం జరుగుతుంది. 

శ్రీ స్వామి వారి రథయాత్ర మహోత్సవాలను ఘనంగా నిర్వహించడంలో పూర్తి సహాయ సహకారాలు అందించిన పోలీస్ శాఖ వారికి, రెవిన్యూ శాఖ వారికి, గ్రేటర్ విశాఖ నగరపాలక సంస్థ వారికి, హెల్త్ శాఖ వారికి, ఫైర్ డిపార్ట్మెంట్ వారికి, రోడ్లు భవనాల శాఖ వారికి, విద్యుత్ శాఖ వారికి, ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులందరికీ మా హృదయ పూర్వక ధన్యవాదములు. 

                ఇట్లు కార్యనిర్వహణాధికారి

                       టి రాజగోపాల్ రెడ్డి

Comments

Popular posts from this blog

*శ్రీ సత్యసాయి సేవా సంస్థలు – విశాఖపట్నం జిల్లా* *ప్రేమ సేవగా తలవంచిన వేళ — గిరి ప్రదక్షిణ భక్తుల అలసిన పాదాలకు ఉపశమనం కల్పించిన శ్రీ సత్యసాయి సేవాదళ్- గిరి ప్రదక్షిణ మార్గంలో వేలాది మంది భక్తులకు ప్రేమతో, నిస్వార్థంగా సేవలందించిన విశాఖ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థలు*

విశాఖపట్నం :29 జులై 2026: పవిత్రమైన గురుపూర్ణిమ సందర్భంగా సింహాచల క్షేత్ర ఆరాధ్యదైవం, కోట్లాది మంది భక్తుల ఇలవేల్పు శ్రీ శ్రీ శ్రీ వరాహ లక్ష్మీనృసింహ స్వామివారి గిరి ప్రదక్షిణలో పాల్గొన్న లక్షలాది మంది భక్తులకు విశాఖ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థలు విస్తృతమైన సేవా కార్యక్రమాలను ప్రేమతో, భక్తిశ్రద్ధలతో నిర్వహించాయి. విశాఖ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థల సింహాచలం సమితి, గోపాలపట్నం భజన మండలి ఆధ్వర్యంలో గిరి ప్రదక్షిణకు విచ్చేసిన భక్తులకు 28 జులై 2026 ఉదయం నుంచే సేవా కార్యక్రమాలు ప్రారంభమై, రాత్రంతా కొనసాగి 29 జులై 2026 ఉదయం 7 గంటల వరకు నిర్వహించబడ్డాయి. *అలసిన భక్తుల పాదాలకు ప్రేమతో ఉపశమనం — ప్రత్యేక సేవ* గిరి ప్రదక్షిణలో ఎంతో దూరం నడిచి అలసిపోయిన భక్తుల పాదాలకు ఉపశమనం కల్పించేందుకు శ్రీ సత్యసాయి సేవా సంస్థలు చేపట్టిన ప్రత్యేక పాద మర్దన సేవ అందరి హృదయాలను స్పృశించింది. భక్తుల అలసిన పాదాలకు ఉపశమనం కలిగించేందుకు నువ్వుల నూనెలో ప్రత్యేక వనమూలికలను మరిగించి తయారుచేసిన నూనెను శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ప్రత్యేకంగా సిద్ధం చేయించాయి. శ్రీ సత్యసాయి మహిళా మరియు పురుష సేవాదళ్ సభ్యులు స్వయంగా భక్...