Skip to main content

వ్యాసరచన మరియు వక్తృత్వ పోటీలు నిర్వహణ

.                   K.V.SHARMA EDITOR 
ఆంధ్ర‌విశ్వ‌విద్యాల‌యం: జూలై 7:భారత ప్రభుత్వ ఆరోగ్య మరియు కుటుంబ మంత్రిత్వ శాఖ ద్వారా స్టాటస్టిక్స్ విభాగం ఆంధ్ర విశ్వవిద్యాలయం నందు నెలకొల్పబడిన జనాభా పరిశోధన కేంద్రం (పాపులేషన్ రీసెర్చ్ సెంటర్) ఆధ్వర్యంలో ప్రపంచ జనాభా దినోత్సవం - 2026 పురస్కరించుకొని విశ్వవిద్యాలయం మరియు అనుబంధ కళాశాల విద్యార్థులకు వ్యాసరచన మరియు వక్తృత్వ పోటీలు నిర్వహించడం జరిగింది.


ఈ పోటీలలో వివిధ కళాశాలలుకు చెందిన సుమారు 150 మంది విద్యార్థులు పాల్గొనగా వివిధ విభాగాలకు చెందిన విదేశీ విద్యార్థులు కూడా ఈ పోటీల్లో చురుగ్గా పాల్గొనడం గమనార్హం. ఈ వ్యాసరచన మరియు వక్తృత్వ పోటీలకు ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆర్ట్స్ మరియు లా కళాశాలలకు చెందిన సహాయ ఆచార్యులు డాక్టర్ కే. పల్లవి, డాక్టర్ బి. లక్ష్మయ్య మరియు డాక్టర్ బి. సుబ్బయ్య తదితరులు న్యాయ నిర్ణీతలుగా వ్యవహరించారు.

ఈ కార్యక్రమంలో జనాభా పరిశోధన కేంద్రం డైరెక్టర్ మరియు స్టాటస్టిక్స్ విభాగాధిపతి ఆచార్య బి. మునిస్వామి, పరిశోధన కేంద్రం రీసెర్చ్ ఇన్వెస్టిగేటర్ డాక్టర్ యడ్ల రమణ, మరియు స్టాటిస్టిక్స్ విభాగ ఆచార్యులు, పరిశోధకులు, విద్యార్థులు, బోధ నేతల సిబ్బంది పాల్గొనడం జరిగింది.

Comments