Skip to main content

విశాఖ జిల్లా వైయస్సార్ పార్టీ కాంగ్రెస్ అధ్యక్షులును మర్యాదపూర్వం కలిసిన రాష్ట్ర కళింగ వైశ్య వైస్సార్ పార్టీ అధ్యక్షులు కోణార్క్ శ్రీనివాసరావు.

 


విశాఖ జిల్లా వైయస్సార్ పార్టీ  కళింగ వైశ్య అధ్యక్షులు తాళాసు  సాయిమోహన్ ఆధ్వర్యం లో  విశాఖ జిల్లాలో వున్న వివిధ విభాగాల వైస్సార్  కళింగ వైశ్య నాయకులు, వైస్సార్ పార్టీ కళింగ వైశ్య కుటుంబ సభ్యులు హాజరై విశాఖ జిల్లా వైస్సార్ పార్టీ అధ్యక్షులు కేకే రాజుని గౌరవపూర్వకం కలవడం జరిగింది.


ఈ సందర్బంగా కేకే రాజు మాట్లాడుతూ సమాజంలో వైశ్యలుకు ప్రత్యేక గౌరవం, స్థానం ఉందని వైశ్యులకు ప్రజలతో ఎక్కువ సంబంధాలు వ్యాపార రూపంలో వుంటాయని, ఏదైన శుభ కార్యక్రమాలకు వెళ్తే వైశ్యుడు ఎదురైతే మంచి జరుగుతుందని, మొదటి బొనీలు వెయ్యాలి అంటే వైశ్యలే శ్రేష్ఠమైన వారని, వైశ్యుల నడిపే కారుని కొనుకుంటే మంచి జరుగుతుందని కొందరు మొదటిసారి కొన్నప్పుడు వైశ్యుల నుంచే కొనుక్కునే సాంప్రదాయాలు మా మిత్ర బృందంలో ఆ ఆనవైతి ఉందని వైశ్యుల గొప్పతనాన్ని చాలా బాగా వివరించారు. ఇదే సందర్భంలో అక్కడికి వచ్చిన వైశ్య కుటుంబ సభ్యులందరికి వ్యక్తిగతంగా పేరు పేరున పరిచయం చేసుకొని వైశ్యులకు ఏ కష్టం వచ్చిన మీతో నేనుంటాని, వైస్సార్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.2029 లో వైస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి రావడం తథ్యం జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అవ్వడం కాయమని భవిష్యత్ ని తెలియజేసారు వైస్సార్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే కళింగ వైశ్యుల కుటుంబాలకు పార్టీ నమ్ముకున్న నాయకులకు ప్రాధాన్యత ఉంటుందని స్పష్టం చేసారు.


ఇదే కార్యక్రమం హాజరైన రాష్ట్ర వైస్సార్ కాంగ్రెస్ కళింగ వైశ్య విభాగ రాష్ట్ర అధ్యక్షులు కోణార్క్ శ్రీనివాసరావు మాట్లాడుతూ విశాఖ జిల్లా అధ్యక్షులు తాళాసు సాయిమోహన్ ఆధ్వర్యంలో కళింగ వైశ్యులు ఇంత పెద్ద స్థాయిలో హాజరవ్వడం అభినందనీయం పార్టీ బలోపేతనికి అందరం కష్టపడి పనిచేద్దాం 2029 లో జగన్మోహనరెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసి విషయంలో కళింగ వైశ్యుల పాత్ర ప్రధానమైనది ప్రతీ పేదవాడికి న్యాయం జరిగిలే కృషి చేద్దామని తెలియజేసారు.


ఈ కార్యక్రమంకి శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు తంగుడు జోగారావు, తంగుడు నాగేశ్వరావు, ఊన్న నాగరాజు, వైశ్యరాజు కేశవరావు గుడ్ల దామోదర్ విశాఖపట్నం జిల్లా వాణిజ్య విభాగ అధ్యక్షులు సకలాభక్తు ప్రసాదరావు, పొట్నూరుమధు మరియు విశాఖ జిల్లా లో వివిధ నియోజకవర్గం ఇంచార్జ్ లు, పార్టీ అభిమానులు హాజరయ్యారు.

Comments

Popular posts from this blog

*శ్రీ సత్యసాయి సేవా సంస్థలు – విశాఖపట్నం జిల్లా* *ప్రేమ సేవగా తలవంచిన వేళ — గిరి ప్రదక్షిణ భక్తుల అలసిన పాదాలకు ఉపశమనం కల్పించిన శ్రీ సత్యసాయి సేవాదళ్- గిరి ప్రదక్షిణ మార్గంలో వేలాది మంది భక్తులకు ప్రేమతో, నిస్వార్థంగా సేవలందించిన విశాఖ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థలు*

విశాఖపట్నం :29 జులై 2026: పవిత్రమైన గురుపూర్ణిమ సందర్భంగా సింహాచల క్షేత్ర ఆరాధ్యదైవం, కోట్లాది మంది భక్తుల ఇలవేల్పు శ్రీ శ్రీ శ్రీ వరాహ లక్ష్మీనృసింహ స్వామివారి గిరి ప్రదక్షిణలో పాల్గొన్న లక్షలాది మంది భక్తులకు విశాఖ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థలు విస్తృతమైన సేవా కార్యక్రమాలను ప్రేమతో, భక్తిశ్రద్ధలతో నిర్వహించాయి. విశాఖ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థల సింహాచలం సమితి, గోపాలపట్నం భజన మండలి ఆధ్వర్యంలో గిరి ప్రదక్షిణకు విచ్చేసిన భక్తులకు 28 జులై 2026 ఉదయం నుంచే సేవా కార్యక్రమాలు ప్రారంభమై, రాత్రంతా కొనసాగి 29 జులై 2026 ఉదయం 7 గంటల వరకు నిర్వహించబడ్డాయి. *అలసిన భక్తుల పాదాలకు ప్రేమతో ఉపశమనం — ప్రత్యేక సేవ* గిరి ప్రదక్షిణలో ఎంతో దూరం నడిచి అలసిపోయిన భక్తుల పాదాలకు ఉపశమనం కల్పించేందుకు శ్రీ సత్యసాయి సేవా సంస్థలు చేపట్టిన ప్రత్యేక పాద మర్దన సేవ అందరి హృదయాలను స్పృశించింది. భక్తుల అలసిన పాదాలకు ఉపశమనం కలిగించేందుకు నువ్వుల నూనెలో ప్రత్యేక వనమూలికలను మరిగించి తయారుచేసిన నూనెను శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ప్రత్యేకంగా సిద్ధం చేయించాయి. శ్రీ సత్యసాయి మహిళా మరియు పురుష సేవాదళ్ సభ్యులు స్వయంగా భక్...