Skip to main content

శ్రీ శ్రీ శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామివారి దేవస్థానం సింహాచలం. ​విజయనగరం వసతి గృహంలో ఎమ్మెల్యే, సింహాచలం ఈఓ తనిఖీ

.               K.V.SHARMA EDITOR 
 సింహాచలం, జూలై 19: విజయనగరంలోని శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి దేవస్థానం విద్యార్థుల వసతి గృహాన్ని (హాస్టల్) విజయనగరం ఎమ్మెల్యే అదితి గజపతి రాజు, సింహాచలం దేవస్థానం ఈఓ జల్లేపల్లి వెంకట్రావు సంయుక్తంగా పరిశీలించారు. భవిష్యత్తు అభివృద్ధి పనులు, కొత్త నిర్మాణాల పురోగతిపై దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఈఈ) రాంబాబు, ఏఈఓల బృందంతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు.


ఈ సందర్భంగా విద్యార్థుల భోజన వసతి, నాణ్యతా ప్రమాణాలు, వంటశాల నిర్వహణపై ఎమ్మెల్యేతో కలిసి ఈఓ సుదీర్ఘంగా చర్చించారు. నిత్యం 400 నుంచి 500 మంది విద్యార్థులు భోజనం చేస్తున్న ఈ వసతి గృహంలో అత్యంత పరిశుభ్రమైన, హైజీనిక్ పద్ధతుల్లో వంటలు చేసే విధానాలను పరిశీలించారు.


హాస్టల్‌లో మోడ్రన్ కిచెన్ ఏర్పాటు, భోజన పాత్రల శుభ్రతకు డిష్‌వాషర్ యంత్రాల బిగింపు, వాష్‌రూమ్‌ల మరమ్మతులకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలని ఎమ్మెల్యే సూచించారు.


ఈఓ వెంకట్రావు స్థానిక సిబ్బందితో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. విద్యార్థుల సంక్షేమ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.


అనంతరం ఎంఆర్ కాలేజ్ ప్రిన్సిపాల్, మ్యూజిక్ కాలేజ్, సంస్కృత కాలేజ్ ప్రిన్సిపాళ్లతో ఎమ్మెల్యే, ఈఓ ప్రత్యేకంగా సమావేశమై పలు అంశాలపై చర్చించారు. ఈ తనిఖీలో దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బండారు రాంబాబు, ఏఇఓ పిల్లా శ్రీనివాస్, పర్యవేక్షణ అధికారి ఇన్చార్జ్ మూల వాసు ఇంజనీరింగ్ సిబ్బంది పాల్గొన్నారు.

Comments