Skip to main content

పారిశుధ్యం, ప‌రిశుభ్ర‌త‌కు ప్రాధాన్య‌త ఇవ్వాలి -విధి నిర్వ‌హ‌ణ‌లో నిర్ల‌క్షం త‌గ‌దు - వైద్య‌శాల‌ను ఆక‌స్మికంగా త‌నిఖీ చేసిన వీసీ ఆచార్య జి.పి రాజ‌శేఖ‌ర్

.                      K.V.SHARMA EDITOR 
ఆంధ్ర‌విశ్వ‌విద్యాల‌యం, జూలై 10:విశ్వ‌విద్యాల‌యంలో పారిశుధ్య నిర్వ‌హ‌ణ‌, ప‌రిస‌రాల ప‌రిశుభ్ర‌త‌కు ప్రాధాన్య‌త ఇవ్వాల‌ని ఏయూ వీసీ ఆచార్య జి.పి రాజ‌శేఖ‌ర్ సూచించారు. శుక్ర‌వారం ఉద‌యం ఆయ‌న ఆక‌స్మికంగా ఏయూ సౌత్ క్యాంప‌స్ వైద్య‌శాల‌ను త‌నిఖి చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న వైద్య‌శాల‌లో ప‌లు విభాగాల‌ను ప్ర‌త్య‌క్షంగా ప‌రిశీలించారు. వైద్య‌శాల ప్రాంగ‌ణంలో ఉన్న వ్య‌ర్ధాలు, క‌లుపు మెక్క‌లు వెంట‌నే తొల‌గించి శుభ్రం చేయాల‌ని సూచించారు. అనంత‌రం ఫిజియో థెర‌ఫి కేంద్రం, ర‌క్త‌ప‌రీక్ష‌ల విభాగాల‌ను ప‌రిశీలించి ప‌రిశుభ్ర‌త లోపించ‌డంపై అసంతృప్తి వ్య‌క్తం చేశారు. 


సిబ్బంది హాజ‌రు ప‌ట్టిక‌ల‌ను ప‌రిశీలించి, విధుల్లో అల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రిస్తున్న పారిశుధ్య సిబ్బందిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సూచించారు. ప్ర‌తీ రోజు ఒక ప్ర‌ణాళిక సిద్దం చేసి వైద్య‌శాల‌లో ప్ర‌తీ విభాగాన్ని ప‌రిశుభ్రంగా ఉంచే బాధ్య‌త‌ల‌ను సంబంధిత సిబ్బందికి అప్ప‌గించాల‌న్నారు. అదే వింగా వార్డులో ఉన్న దుప్ప‌ట్లు, దిండ్లు వంటివి మార్చాల‌ని, అవ‌స‌ర‌మైతే కొత్త‌వి కొనుగోలు చేయాల‌ని సూచించారు. వైద్య‌శాల‌కు అవ‌స‌ర‌మైన అన్ని స‌దుపాయాలు క‌ల్పించ‌డానికి తాము సిద్దంగా ఉన్నామ‌ని, అవ‌స‌ర‌మైన వాటికి వెంట‌నే కొనుగోలు చేస్తామ‌న్నారు.


సిబ్బంది అందుబాటులో ఉంటూ విద్యార్థుల‌కు, ఉద్యోగుల‌కు పూర్తిస్తాయిలో సేవ‌లు అందించాల‌న్నారు. అనంత‌రం  విధుల్లో ఉన్న వైద్యుల‌తో, ప్ర‌ధాన వైద్యాధికారి డాక్ట‌ర్ రామేశ్వ‌ర్‌తో మాట్లాడారు. వైద్య‌శాల‌లో జ‌ర‌గుతున్నఆధునీక‌ర‌ణ‌ ప‌నుల‌ను సైతం ప్ర‌త్య‌క్షంగా ప‌రిశీలించి, త‌గిన సూచ‌న‌లు చేశారు. ప‌నులు వేగ‌వంతం చేయాల‌ని సిబ్బందికి సూచించారు.

Comments