విశాఖ మత్స్యకారుల కోసం* *గాలింపు చర్యలు ముమ్మరం చేశారు* *గల్లంతైన వారి* *కుటుంబాలకు* *బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు* *పీవీఎన్ మాధవ్ పరామర్శ*
D.S.Varma Sr Sub EDITOR
విశాఖపట్నం, జూలై 6 : విశాఖ ఫిషింగ్ హార్బర్ నుంచి చేపల వేటకు వెళ్లి మత్స్యకారులు గల్లంతు కావడం అత్యంత దురదృష్టకరమని, వారిని క్షేమంగా తీసుకురావడానికి అన్ని ప్రభుత్వ యంత్రాంగాలు సమన్వయంతో పనిచేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ కోరారు.
సోమవారం విశాఖ ఫిషింగ్ హార్బర్‌కు చేరుకున్న ఆయన గల్లంతైన మత్స్యకారుల కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి ధైర్యం చెప్పారు. ఈ క్లిష్ట సమయంలో ప్రభుత్వం, కేంద్ర సంస్థలు బాధిత కుటుంబాలకు అండగా ఉంటాయని భరోసా కల్పించారు.
అనంతరం మత్స్యశాఖ జాయింట్ డైరెక్టర్, నేవీ అధికారులు, జిల్లా కలెక్టర్‌తో ఘటనపై సమీక్ష నిర్వహించి గాలింపు చర్యల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. సముద్రంలో గల్లంతైన మత్స్యకారుల ఆచూకీ కోసం కోస్ట్ గార్డ్ నౌకలు, ఇతర రక్షణ బృందాలతో గాలింపును మరింత వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు.
వేటకు వెళ్ళే మత్స్యకారులు కు ప్రమాద భీమా తప్పనిసరి చేయాల్సిన అవసరం ఉంది
అదేవిధంగా లైఫ్ జాకెట్లు కు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చేయాలి ఆవిధంగా చేస్తే వారి ఆచూకీ తెలుసు కోవడానికి మార్గం సులభంగా ఉంటుంది
మెకనైజ్డ్ బోట్లు కు జిపిఎస్ అందుబాటులోకి తీసుకు రావడం తో రక్షణ చర్యలు పర్య వేక్షణ పెంచాలి .
మత్స్యకారులు వేటకు వెళ్ళే మెకనైజ్డ్ బోట్లు కోస్టు గార్డ్ కార్యాలయానికి జిపిఎస్ విధానం అనుసంధానం చేయాలని సూచించారు మాధవ్
ప్రతి క్షణం విలువైనదేనని, గాలింపు చర్యల్లో ఎలాంటి అలసత్వం లేకుండా యుద్ధ ప్రాతిపదికన కొనసాగించాలని ఆయన అధికారులను కోరారు. గల్లంతైన మత్స్యకారులు క్షేమంగా తిరిగి రావాలని ఆకాంక్షిస్తూ, వారి కుటుంబాలకు అన్ని విధాలా అండగా ఉంటామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు పరశురామరాజు, స్టేట్ బిల్డింగ్ కమిటీ మెంబర్ బొత్స సురేష్, తూర్పు నియోజకవర్గ ఇన్చార్జ్ రవిరాజ్ మరియు స్థానిక బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.



Comments
Post a Comment