Skip to main content

ఎంఓయూ అమ‌లుపై విభాగాధిప‌తుల‌తో స‌మావేశం

 

                 K.V.SHARMA EDITOR 
ఆంధ్ర‌విశ్వ‌విద్యాల‌యం, జూలై 21:ఆంధ్ర‌విశ్వ‌విద్యాల‌యం శ‌తాబ్ధి ఉత్స‌వాల‌లో భాగంగా  ఫ్లోరిడా యూనివ‌ర్సిటీతో ఏయూ చేసుకున్న‌ ప్ర‌తిష్టాత్మ‌క అవ‌గాహ‌న ఒప్పందం అమ‌లుపై విభాగాధిప‌తుల‌తో మంగ‌ళ‌వారం స‌మీక్ష కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. ఇంజ‌నీరింగ్ క‌ళాశాల సివిల్ ఇంజ‌నీరింగ్ విభాగం స‌మావేశ మందిరంలో నిర్వ‌హించిన స‌మావేశంలో విభాగాధిప‌తుల‌ను ఉద్దేశించి వీసీ ఆచార్య జి.పి రాజ‌శేఖ‌ర్ ప్ర‌సంగించారు. ఇంజ‌నీరింగ్‌, సైన్స్ కోర్సుల‌తో పాటు ఆర్ట్స్‌-హ్యూమానిటీస్‌కి సంబంధించిన విభాగాలు సైతం దీనిలో భాగం అవుతాయ‌న్నారు. సంయుక్తంగా ప్ర‌జెక్టుల నిర్వ‌హ‌ణ‌, బోధ‌న‌, ప‌రిశోధ‌న త‌దిర అంశాల‌లో విభాగాల వారీగా క‌ల‌సి ప‌నిచేయడానికి అనుకూలమైన అంశాల‌పై విభాగాధిప‌తులు దృష్టిసారించాల‌న్నారు. క్రిటిక‌ల్ మిన‌ర‌ల్స్‌పై ప్రాజెక్టును ప్ర‌తిపాద‌ను సిద్దం చేసి త్వ‌రలో కేంద్ర ప్ర‌భుత్వానికి పంప‌నున్న‌ట్లు తెలిపారు.


ఫ్లోరిడా విశ్వ‌విద్యాల‌యం నుంచి ఆచార్యులు ఏయూకు రావాల‌ని, వారు ఒక వారం నుంచి సెమిష్ట‌ర్ వ‌ర‌కు ఇక్క‌డ ఉండి విద్యార్థుల‌కు బోధ‌న జ‌ర‌పాల‌న్నారు. ఏయూలో 1100 మంది వ‌ర‌కు విదేశీ విద్యార్థులు ఉన్నార‌ని, ఇదే విధంగా ఫ్లోరిడా విశ్వ‌విద్యాల‌యం విద్యార్థుల‌ను ఏయూకు తీసుకువ‌చ్చే విధంగా కృషి జ‌ర‌గాల‌న్నారు. కార్య‌క్ర‌మంలో ఫ్లోరిడా విశ్వ‌విద్యాల‌యం అసోసియేట్ డైరెక్ట‌ర్‌ - గ్లోబ‌ల్ ప్రోగ్రాం గోపాల్ కాకాని, రిజిస్ట్రార్ ఆచార్య కె.రాంబాబు, ఆచార్య బాల ప్ర‌సాద్ త‌దిత‌రులు పాల్గొని ప్ర‌సంగించారు.

Comments