విశాఖపట్నం విశాఖ సందేశం వార్తలు :టౌన్ కొత్త రోడ్ లో కొలువైన శ్రీశ్రీశ్రీ జగన్నాథ స్వామి రథోత్సవానికి విస్తృత ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ సూరాడ రాజకుమార్, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ టి రాజగోపాల్ రెడ్డి తెలిపారు. సోమవారం ఆలయంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ ఈ నెల 15వ తేదీ సాయంత్రం ప్రతిష్టాంత సుభద్రాదేవి శాంతి కళ్యాణం నిర్వహిస్తామని, ఈనెల 16న తొలి రథయాత్ర జరుగుతుందని సాయంత్రం ఐదు గంటలకు స్థానిక ఎమ్మెల్యే సిహెచ్ వంశీకృష్ణ శ్రీనివాస్ ఈ రథయాత్రను ప్రారంభిస్తారని తెలిపారు. శ్రీశ్రీశ్రీ జగన్నాథ స్వామి వారి ఆలయం నుండి టర్నర్ సత్రం వరకు వేదమంత్రాలు,మంగళ వాయిద్యాలు,సాంస్కృతి కార్యక్రమాలు,వేద పారాయణం గీత పారాయణంతో రథయాత్ర అత్యంత వైభవంగా నిర్వహిస్తామని తెలిపారు.17వ తేదీ నుండి టర్నర్ సత్రం కళ్యాణ మండపంలో శ్రీ స్వామివారు దశావతారాలలో దర్శనమిస్తారని తెలిపారు. శ్రీ జగన్నాథ స్వామి 17న మత్స్యావతారం, 18న కూర్మావతారం,19న వరాహావతారం, 20న నృసింహావతారం, 21న వామనావతారం, 22న పరశురామావతారం, 23న రామామావతారం, 24న బలరామ మరియు కృష్ణావతారం, 25న శేషపాన్పు అవతారంలో భక్తులకు దర్శనమిస్తారని తెలిపారు.26వ తేదీ ఉదయం శ్రీ స్వామి వారు రథంపై కొలువై సాయంత్రం 5 గంటలకు టర్నర్ సత్రం నుండి శ్రీ జగన్నాథ స్వామి వారి ఆలయానికి తిరుగుప్రయాణమవుతారని తెలిపారు.తిరుగు రథయాత్ర కూడా భక్తుల కోలాహలం మధ్య ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు.గత ఏడాది రథయాత్రకు 40లక్షల రూపాయలు ఖర్చుకాగా 75 లక్షల రూపాయలు ఆదాయం వచ్చిందని, ఈ ఏడాది ఖర్చు 40 లక్షల రూపాయల వరకు ఉంటుందని,80 లక్షల రూపాయలు ఆదాయం లభిస్తుందని అంచనావేస్తున్నట్లు
ఈఓ రాజ గోపాల్ రెడ్డి తెలిపారు.ఉత్సవాలు సందర్భంగా ప్రతిరోజు మధ్యాహ్నం భక్తులకు అన్నదానం, సాయంత్రం సాంస్కృతిక ప్రదర్శనలు ఏర్పాటుచేసినట్లు తెలిపారు.భక్తుల సౌకర్యార్థం 20, 50 , 200 రూపాయల టికెట్లను ప్రవేశ పెట్టామని తెలిపారు.ఆగస్టు 6న మహా అన్నదానం నిర్వహిస్తామని తెలిపారు.అనంతరం శ్రీశ్రీశ్రీ జగన్నాధ స్వామి కి చైర్మన్ సూరాడ రాజ్ కుమార్, ఈఓ రాజగోపాల్ రెడ్డి దేవస్థానం తరపున పట్టు వస్త్రాలు సమర్పించారు. మీడియా సమావేశంలో ధర్మకర్తలు బుదిరెడ్ల సత్యనారాయణ,రాయ రాము, సారిపల్లి జ్యోతి, ఉప్పలపు ఆదిలక్ష్మి, పుక్కల కళ్యాణి, మానేపల్లి రమణి, నాగమల్లి భాస్కరరావు, బోనగిరి విజయదుర్గ, మంతా రాజశేఖర శర్మ, మంత్రి శాలివాహన్,ఎక్స్ ఆఫీషియో సభ్యుడు,ప్రధాన అర్చకుడు పాణంగిపల్లి జగన్నాథాచార్యులు, ఆలయ అర్చకుడు యేడిద సురేష్ బాబు తదితరులు పాల్గొన్నారు

Comments
Post a Comment