Skip to main content

విద్యార్థి సంఘ ప్ర‌తినిధుల వాఖ్యలను ఖండించిన ఆర్.ఎస్.యూ రాష్ట్ర సహాయ కార్యదర్శి నరేంద్ర..

.           SRINIVAS SPL Correspondant 
అమలాపురం, విశాఖ సందేసం.....విద్యార్థి సంఘ ప్ర‌తినిధులు చేసిన  వాఖ్యలను   ఆర్.ఎస్.యూ రాష్ట్ర సహాయ కార్యదర్శి కాంటేపల్లి నరేంద్ర తీవ్రంగా ఖండించారు. విద్యార్థుల కోసం విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని రెవల్యూషనరీ స్టూడెంట్ ఆర్గనైజేషన్ ఎల్లప్పుడూ  పోరాడుతుందని  నరేద్ర  అన్నారు. కొంతమంది వ్యక్తులు శనివారం వాగ్దేవి పాఠశాలలో  ప్రెస్ మీట్ లో మరొక విద్యార్థి సంఘంపై తప్పుడు వాక్యలు చేసారని వాటిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. పాఠశాల  భవనాలు అన్నీ కూడా పెంకులతో ఉన్నాయని వర్షాలు వస్తే అవి కూలిపోయే ప్రమాదం ఉందని విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని  ఆర్.ఎస్.యూ గళం ఎత్తిందని  నరేంద్ర   పేర్కొన్నారు.విద్యార్థుల భవిష్యత్తు పై నిరంతరం పోరాడుతుందని...శనివారం ప్రెస్ మీట్  పెట్టిన వ్యక్తులు  ఆర్.ఎస్.యూ రిజిస్ట్రేషన్ ను ప్రశ్నించడం హాస్యాస్పదమని పేర్కొన్నారు. విద్యార్థుల సమస్యలను ఎవరు తెలియజేసిన విద్యార్థులు తరఫున పోరాటం చేసేందుకు ఆర్.ఎస్.యూ ఎప్పుడు సిద్ధంగా ఉంటుందన్నారు. ఈ సందర్బంగా మీడియా ముఖంగా చూపించిన ఆర్.ఎస్.యూ రిజిస్ట్రేషన్ పత్రాలను  మీడియాకు  చూపించారు.

Comments