Skip to main content

వేగం, పార‌ద‌ర్శ‌క‌త‌తో సేవ‌లు అందించాలి ఇ- ఆఫీస్‌తో పార‌ద‌ర్శ‌కత పెరుగుతుంది ఫైళ్ల ప‌రిష్కారంలో వేగం పెంచాలి విభాగాల్లోద‌ర‌ఖాస్తులు స్వీక‌రించి, అధికారుల‌కు నివేదించాలి ఏయూ వీసీ ఆచార్య జి.పి రాజ‌శేఖ‌ర్

                    K.V.SHARMA EDITOR 


ఆంధ్ర‌విశ్వ‌విద్యాల‌యం, జూలై 4: వేగం, పార‌ద‌ర్శ‌క‌త‌, స‌మ‌ర్ధ‌త‌, నిస్పాక్షికత‌తో కూడిన సేవ‌లు అందించ‌డం వ‌ల‌న విశ్వ‌విద్యాల‌య ప‌నితీరులో మార్పును సాధించ‌డం, స‌త్ఫ‌లితాల‌ను పొంద‌డం సాధ్య‌ప‌డుతుంద‌ని ఏయూ వీసీ ఆచార్య జి.పి రాజ‌శేఖ‌ర్ అన్నారు. శ‌నివారం సాయంత్రం ఏయూ అకౌంట్స్ విభాగాల‌కు చెందిన సిబ్బందితో అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్‌లెన్స్‌& వ‌ర్క్ క‌ల్చ‌ర్ అనే అంశంపై నిర్వ‌హించిన వ‌ర్క్‌షాప్‌ను ఉద్దేశించి ఆయ‌న ప్ర‌సంగించారు. ఈ సంద‌ర్బంగా ఆయ‌న మాట్లాడుతూ  బాధ్య‌తాయుతంగా, క్ర‌మ‌శిక్ష‌ణాయుతంగా, ఫ‌లితాలు ఆధారితంగా, నిర్ధిష్ట‌మైన ల‌క్ష్యంతో ప‌నిచేయాల‌ని సూచించారు. వేగ‌వంత‌మైన సేవ‌లు అందించే విధంగా విభాగాలు ప‌నిచేయాల్సిన ఆవ‌శ్య‌క‌త‌ను తెలియ‌జేశారు. విభాగాల‌ను పున‌ర్వ‌వ‌స్థీక‌ర‌ణ చేయాల‌నే ఆలోచ‌న జ‌రుగుతోంద‌న్నారు. ఉద్యోగుల స‌మ‌య‌పాల‌న‌, హాజ‌రుపై తాము నిరంత‌ర ప‌ర్య‌వేక్ష‌ణ చేయాల‌నే ఆలోచ‌న లేద‌ని, వృత్తిప‌ట్ల నిబ‌ద్ద‌త‌తో న‌డ‌చుకోవాల‌న్నారు.


ముఖ్యంగా ఫైల్స్ వ‌చ్చిన సంద‌ర్భంలో వెయిటింగ్ టైంను త‌గ్గించాల‌న్నారు. అకౌంటింగ్ విభాగాల‌లో ఫైల్ ప్రోస‌స్ విధానం మెరుగుప‌ర‌చ‌డం, ఆల‌స్యాన్ని నియంత్రించ‌డం, ప్ర‌త్యేక‌మైన చెక్‌లిస్ట్‌ను సిద్దం చేసుకుని వాటిని స‌రిచూసుకోవాల‌ని సూచించారు. ప‌రీక్ష‌లు ప‌టిష్టంగా నిర్వ‌హించ‌డంత పాటు, స‌కాలంలో ఫ‌లితాల‌ను అందించాల్సిన ప్రాధాన్య‌త తెలియ‌జేశారు. లీగ‌ల్ అంశాల‌కు, ఆర్‌టిఐ ద‌ర‌ఖాస్తుల‌కు వేగంగా స‌మాధానాలు ఇవ్వ‌డం, ఆల‌స్యాన్ని నియంత్రించ‌డం ఎంతో ప్ర‌ధాన‌మ‌న్నారు.


ప్ర‌తీ విభాగంలో త్వ‌ర‌లో ఒక డేటా ఎంట్రీ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామ‌న్నారు. విభాగానికి చెందిన స‌మ‌స్త స‌మాచారాన్ని అందించే విధంగా దానిని తీర్చిదిద్ద‌డం జ‌రుగుతుంద‌న్నారు. విశ్వ‌విద్యాల‌యానికి సంబంధించిన ప్ర‌భుత్వం జారీ చేసే జి.ఓల‌ను బ‌ధ్ర‌ప‌ర‌చ‌డం, శ‌త‌శాతం ఇ- ఆఫీసు విధానం అమ‌లు చేయ‌డం ఎంతో అవ‌స‌ర‌మ‌న్నారు. త‌ద్వ‌రా రికార్డులు శాస్వ‌తంగా బ‌ధ్ర‌ప‌ర‌చ‌డం జ‌రుగుతుంద‌న్నారు. ప్ర‌తీ ఫైలు కేవ‌లం 4 నుంచి 5 రోజుల్లో ప‌రిష్కారం అయ్యే విధంగా సిబ్బంది ప‌నిచేయాల‌ని సూచించారు. ఆల‌స్యం జ‌రిగితే త‌గిన వివ‌ర‌ణ సైతం ఇవ్వ‌వ‌ల‌సి ఉంటుంద‌న్నారు.

 గ్రీవెన్స్‌లో వ‌చ్చే ప్ర‌తీద‌ర‌ఖాస్తును స్వీక‌రించ‌డం, దానికి ఉన్న‌తాధికారుల దృష్టికి తీసుకువెళ్లాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. సానుకూల దృక్ప‌ధంతో ప‌నిచేయ‌డం అల‌వాటు చేసుకోవాల‌న్నారు. 

కార్య‌క్ర‌మంలో రిజిస్ట్రార్ ఆచార్య కె.రాంబాబు, అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. అనంత‌రం అకౌంట్స్ విభాగానికి చెందిన సిబ్బంది తమ వ‌ర్క్‌ఫ్లో, ప‌నితీరు త‌దిత‌ర అంశాల‌ను వివ‌రించారు

Comments