Skip to main content

మింది ఐడియల్ స్కూల్ విద్యార్ధి బోయుడాపు జ్ఞాన వసంత్ కు రాష్ట్ర ప్రభుత్వ షైనింగ్ స్టార్ అవార్డు ప్రధానం

.                 K.V.SHARMA EDITOR 
విశాఖపట్నం: విశాఖ సందేశం వర్తవాహని :స్థానికి 68 వార్దు  లో గల మింది ఐడియల్ స్కూల్ విద్యార్థి బొయిదాపు జ్ఞాన వసంత్  మార్చి 2026 పదవ తరగతి పబ్లిక్ పరీక్షలలో 400 మార్కులకు 378 మార్కులు సాధించినందుకు రాష్ట్ర విద్యాశాఖ షైనింగ్ స్టార్ అవార్డు బహుకరించిందని పాఠశాల ప్రిన్సిపాల్ అలజంగి  ఉదయకుమార్  ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నగరం లోని వుడా చిల్డ్రన్ ధియేటర్ లో  కన్నుల పండుగ గా జరిగిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆభిషిక్త కిషోర్ , ఎం ఎల్ ఏ లు రామకృష్ణ బాబు , విష్ణు కుమార్ రాజు , సంయుక్త సంచాలకులు  విజయకుమార్, శేఖర్ బాబు, జిల్లా విద్యాశాఖాధికారి ప్రేమ్ కుమార్ బాబు, సమగ్ర శిక్షణ ప్రోగ్రాం డైరెక్టర్ చంద్ర శేఖర్ విద్యార్థి బొయిదాపు జ్ఞాన వసంత్ తల్లిదండ్రులు బొయిదాపు సురేష్ , త్రివేణి లను  ఇరవై వేల రూపాయిల చెక్కు , ప్రశంసా పత్రం, మెమొంటో ఇచ్చి సత్కరించారు. 


విద్యార్థి జ్ఞాన వసంత్ మాట్లాడుతూ ఈ ప్రోత్సాహం ఇచ్చిన రాష్గ్త్ర ప్రభుత్వానికి కృతఙ్ఞతలు తెలియచేస్తూ కలెక్టర్ కావాలన్నది తన లక్ష్యం అని పేర్కొన్నాడు. జిల్లా వ్యాప్తంగా సుమారు 125 మంది అవార్డు గ్రహీతలు , మండల విద్యాశాఖాధికారులు , ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు ఈ కార్యక్రమంలో ఫాల్గొన్నారు. విద్యార్ధి జ్ఞాన వసంత్ వీనికిడి లోపం ఉన్నా ఇంతటి ప్రతిభ చూపడాన్ని కలెక్టర్ మెచ్చుకొని తగు వైద్య సహాయం అందించవలసిందిగా సిబ్బందికి ఉత్తర్వులు ఇచ్చారు. మింది గ్రామానికి ఇంతటి పేరు తెచ్చిన విద్యార్థిని గ్రామస్థులు కొనియాడారు

Comments