అన్ని వర్గాల అభివృద్ధి విశాఖ లక్ష్యం కావాలి - చిన్న తరహా పరిశ్రమలను ప్రోత్సహించడమే ప్రభుత్వ లక్ష్యం - కలెక్టర్ అభిషిక్త్ కిశోర్
K.V.SHARMA EDITOR
అన్ని రంగాల అభివృద్ధే విశాఖ లక్ష్యం కావాలనికలెక్టర్ అభిషిక్త్ కిశోర్ పిలుపునిచ్చారు.
ఏపీ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫెడరేషన్ సమావేశాన్ని శనివారం సాయంత్రం పాత జైలు రోడ్డులోని ఓ హోటల్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ఏపీ చాంబర్స్ బిజినెస్ ఎక్స్పో బ్రోచర్ ను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ అభిషిక్త్ కిశోర్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్
చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫెడరేషన్ విశాఖ జోన్ ఆధ్వర్యంలో విశాఖ లో మొదటిసారిగా బిజినెస్ ఎక్స్పో చిన్న తరహా మధ్యతరహా పరిశ్రమలు అభివృద్ధి లక్ష్యంగా నిర్వహించడం అభినందనీయమన్నారు. విశాఖ అంటేనే అనేక అవకాశాలకు ఉపాధికి కేంద్రంగా నిలుస్తుంది అన్నారు. విశాఖపట్నం అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు.
సెప్టెంబర్ 11,12,13 తేదీలలో నిర్వహించనున్న కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ తిలకించి సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
దేశానికి వస్తున్న పెట్టుబడులలో 25 శాతం పెట్టుబడులు ఏపీ కి వస్తున్నాయని తెలిపారు.
వీటిలో అధిక పెట్టుబడులు ఉమ్మడి విశాఖ కు వస్తున్నా అని పేర్కొన్నారు.
విశాఖ కు దిగ్గజ సంస్థ గూగుల్ వచ్చిందని
రాష్ట్ర ప్రభుత్వం విశాఖ లో ప్రతి సంవత్సరం భాగస్వామ్య సదస్సు నిర్వహిస్తుందని చెప్పారు.
విశాఖ ఎకనామిక్ రీజియన్ పై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారుని తెలియజేశారు.
విశాఖ ఎకనామిక్ రీజియన్ లో 50 వరకు ప్రాజెక్టులు వస్తున్నాయని
తెలియజేశారు.
విశాఖ లో బే సిటీ కాన్సెప్ట్ తీసుకువస్తున్నారు. ఏపీ చాంబర్స్ కామర్స్ ఆఫ్ ఇండస్ట్రీ విశాఖపట్నం జోన్ చైర్మన్ పి శోభన ప్రకాష్ మాట్లాడుతూ
ఏపీ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫెడరేషన్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 11,12,13 తేదీలలో బిజినెస్ ఎక్స్పో నిర్వహిస్తున్నారు తెలిపారు. రాష్ట్ర కార్యదర్శి సుబ్బారావు గుప్తా మాట్లాడుతూ
గతంలో విజయవాడలో బిజినెస్ ఎక్స్పో విజయవంతంగా నిర్వహించడం జరిగిందని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ఏపీ చాంబర్స్ కామర్స్ ఇండస్ట్రీస్ వైస్ చైర్మన్ లు పవన్ కార్తీక్, శివకుమార్, ఉమెన్స్ వింగ్ చైర్మన్ డాక్టర్ శ్రీవల్లి, సభ్యులు గీతా శ్రీకాంత్, వాణి బాల తదితరులు పాల్గొన్నారు.




Comments
Post a Comment