శ్రీ శ్రీ శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానం, సింహాచలం. జగన్నాథ స్వామి వారికి వైభవంగా పట్టువస్త్రాల సమర్పణ: భక్తిశ్రద్ధలతో సమర్పించిన ఆలయ ఈవో జల్లేపల్లి వెంకట్రావు దంపతులు
. K.V.SHARMA EDITOR
సింహాచలం:తేది: 20 జూలై 2026సింహాచల నాథుని తరఫున, టర్న్‌వర్ సత్రంలో పూజలందుకుంటున్న జగన్నాథ స్వామి వారికి సింహాచలం దేవస్థానం నుండి పట్టువస్త్రాలను సమర్పించారు.సింహాచలం దేవస్థానం ఆలయ
ఈవో శ్రీ జల్లేపల్లి వెంకట్రావు దంపతులు స్వామి వారి పట్టువస్త్రాలు, మంగళకరమైన పుష్పాలు, ఫలాలను భక్తిశ్రద్ధలతోసమర్పించారు.
దేవస్థానం ప్రధాన అర్చకులు శ్రీనివాసాచార్యులు, ఆధ్వర్యంలో, వేద పండితుల మంత్రోచ్ఛారణలు, నాదస్వర మంగళ ధ్వనుల నడుమ ఈ పట్టువస్త్రాలు సింహాచలం నుండి అత్యంత వైభవంగా బయలుదేరింది.
సహాయ కార్య నిర్వహణాధికారి కె. తిరుమలేశ్వరరావు, పర్యవేక్షణ అధికారి కె. వెంకటేశ్వరావుల పర్యవేక్షణలో, టర్న్‌వర్ సత్రానికి చేరుకుంది. అక్కడ జిల్లా అసిస్టెంట్ కమిషనర్ శ్రీమతి డి. అన్నపూర్ణ చేతుల మీదుగా జగన్నాథ స్వామి వారికి ఈ పట్టువస్త్రాలను, పల పుష్పాలను అత్యంత భక్తి ప్రపత్తులతో సమర్పించారు.

Comments
Post a Comment