Skip to main content

రెస్క్యూ ఆపరేషన్ నిరంతరంగా కొనసాగుతోంది* * మత్స్యకార బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుంది * జిల్లా కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిశోర్

.                   K.V.SHARMA EDITOR 
విశాఖపట్నం, జులై 05:- సముద్రంలో గల్లంతైన మత్స్యకారుల ఆచూకీ కోసం నేవీ, కోస్ట్ గార్డ్, మెరైన్ పోలీస్ సంయుక్తంగా యుద్ధప్రాతిపదికన సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిశోర్ పేర్కొన్నారు. ఆదివారం ఉదయం విశాఖ ఫిషింగ్ హార్బర్‌లో గల్లంతైన మత్స్యకారుల కుటుంబ సభ్యులను కలెక్టర్ పరామర్శించి, వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని, గల్లంతైన వారిని గుర్తించే వరకు గాలింపు చర్యలు నిరంతరంగా కొనసాగుతాయని భరోసా ఇచ్చారు.

అనంతరం మీడియాతో మాట్లాడిన కలెక్టర్, సమాచారం అందిన వెంటనే జిల్లా యంత్రాంగం అప్రమత్తమై కోస్ట్ గార్డ్, నేవీ, మెరైన్ పోలీస్‌లతో కలిసి గాలింపు చర్యలు ప్రారంభించినట్లు గుర్తు చేశారు. జాయింట్ ఆపరేషన్స్ సెంటర్ సమన్వయంతో హెలికాప్టర్లు, నౌకలు, కోస్ట్ గార్డ్ షిప్‌లను వినియోగిస్తూ చివరిసారిగా అందిన సిగ్నల్స్, బోటు ప్రయాణించిన దిశ ఆధారంగా నడి సముద్రంలో ముమ్మర గాలింపు కొనసాగుతోందన్నారు.


బోటులోని ఏడుగురిలో బోటు యజమాని కారి చిన్నను ఒక వాణిజ్య నౌక సురక్షితంగా రక్షించిందని, మిగిలిన వారి ఆచూకీ కోసం అన్ని ప్రభుత్వ యంత్రాంగాలు సమన్వయంతో పనిచేస్తున్నాయని తెలిపారు. గల్లంతైన మత్స్యకారులను సురక్షితంగా గుర్తించే వరకు అందుబాటులో ఉన్న అన్ని వనరులతో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుందని, బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని జిల్లా కలెక్టర్ పునరుద్ఘాటించారు. బాధిత కుటుంబాల సభ్యులను నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవి పరామర్శించి ధైర్యం చెప్పారు.



Comments