జనతా వారధి కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేస్తున్న బీజేపీ జిల్లా అధ్యక్షులు MMN పరశు రామ రాజు*
D.S VARMA Sr Sub EDITOR
బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారి సారధ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి సోమవారం జరుగుతున్నటువంటి జనతా వారధి ప్రజలకు ప్రభుత్వానికి వారధి కార్యక్రమం లో భాగంగా బీజేపీ విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు MMN పరశు రామ రాజు మరియు బీజేపీ నాయకులతో కలిసి ఈ రోజు అనగా 06-07-2026 న విశాఖ జిల్లాలో గల పలు సమస్యల పై జిల్లా కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది.
ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు MMN పరశు రామ రాజు మాట్లాడుతూ రాష్ట్రంలో సెప్టిక్ ట్యాంకుల నుంచి సేకరిస్తున్న మానవ మలమూత్ర వ్యర్థాల (Fecal Sludge) అక్రమ డంపింగ్ నివారణ, FSTP/STP విస్తరణకు తక్షణ చర్యలు తీసుకోవలసిందిగా వినతి పత్రం అందజేశారు.
ఈ కార్యక్రమంలో జనతా వారధి కన్వీనర్ పొలిమేర శ్రీనివాస రావు, జనతా వారధి కో కన్వీనర్ మూలా వెంకటరావు, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి దాడి పురుషోత్తం రమేష్, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు అత్తిలి శంకర రావు తదితరులు పాల్గొన్నారు



Comments
Post a Comment