Skip to main content

స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ - SIR కార్యక్రమం ప్రక్రియ వేగవంతం చేయండి. • బి ఎల్ వో లు ,సూపర్వైజర్లు ప్రతి గృహం నుండి క్షుణ్ణంగా పరిశీలించి వివరాలు శత శాతం సేకరించాలి. • ఈ ఆర్ ఒ లు, ఎ ఈ ఆర్ ఒ లు నిశిత పర్యవేక్షణ జరపాలి. -జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్.

                        K.V.SHARMA EDITOR 


విశాఖపట్నం, జూలై 5: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ - SIR కార్యక్రమం ప్రక్రియ వేగవంతం చేయాలని, ప్రతి గృహం నుండి ఓటర్ల వివరాలకు సంబంధించిన ఫారంలను క్షుణ్ణంగా పరిశీలించి శతశాతం వివరాలు సేకరించి కార్యక్రమాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని,ఈ ఆర్ ఒ లు, ఎ ఈ ఆర్ ఒ లు నిశిత పర్యవేక్షణ జరపాలను అధికారులకు జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ ఆదేశించారు. ఆదివారం ఆయన జీవీఎంసీ అదనపు కమిషనర్ పీఎం సత్యవేణి, యు సి డి -ప్రాజెక్ట్ డైరెక్టర్ బివి రమణ, ఈఆర్వో సునీత, ఈ డి టి యామిని లతో కలిసి తూర్పు జోన్ లో ఎంవీవీ అండ్ ఎం కె రాయల్ గార్డెన్స్ లో పోలింగ్ స్టేషన్ 209 పరిధిలో "సర్" కార్యక్రమం ప్రక్రియను పరిశీలించారు. 


ఈ కార్యక్రమంలో కమిషనర్ ముందుగా బి ఎల్ ఓ లు, సూపర్వైజర్  పనితీరును పరిశీలించారు. బి ఎల్ వో లు, సూపర్వైజర్లను వారు చేసే సర్ ప్రోగ్రాం ప్రక్రియను అడిగి తెలుసుకొని త్వరితగతిన పూర్తి చేయాలని వారికి ఆదేశించారు. ఈ ఆర్ ఒ లు, ఎ ఈ ఆర్ ఒ లు  పర్యవేక్షణ జరిపి ప్రతి ఇంటిని బి ఎల్ వో లు వివరాలు సేకరించేలా నిశిత పరిశీలన చేయాలని అన్నారు. సర్ ప్రక్రియ వేగవంతం చేసేందుకు ఆర్పీలు, ఏపీడీలు, సి ఓ లు భాగస్వామ్యంతో నిర్ణీత కాలంలో సర్ కార్యక్రమం పూర్తి చేసేందుకు ప్రత్యేక పర్యవేక్షణ జరపాలని యుసిడి ప్రాజెక్టు డైరెక్టర్ బి.వి. రమణకు కమిషనర్ ఆదేశించారు. జీవీఎంసీ పరిధిలో చేపట్టిన సర్ ప్రక్రియలో ఏ గృహాన్ని విడిచిపెట్టకుండా క్షుణ్ణంగా పూర్తి సమాచారంతో ఫారాలను సేకరించి ప్రక్రియలో ఎటువంటి లోటుపాట్లు లేకుండా త్వరితగతిన పూర్తిచేసేలా చర్యలు చేపట్టాలని జీవీఎంసీ అదనపు కమిషనర్ పీఎం సత్యవేణి కి కమిషనర్ ఆదేశించారు. 


అనంతరం ఎం వి వి ఎం కె రాయల్ గార్డెన్స అపార్ట్మెంట్ అసోసియేషన్ ప్రతినిధులతో కమిషనర్ మాట్లాడుతూ దేశంలో సర్ ప్రక్రియ చాలా ప్రధానమైనదని,ఓటరు జాబితా సవరణ ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యంత కీలకమైన ప్రక్రియ అని, అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు కావడం, వివరాలలో మార్పులు, చేర్పులు, తొలగింపులు వంటి అంశాలను సకాలంలో పూర్తి చేసుకునేలా నిర్వాసితులకు విస్తృత అవగాహన కల్పించేందుకు సహకరించాలని కమిషనర్ వారికి సూచించారు.


ఈ కార్యక్రమంలో యు సి డి ఏ పి డి రాము, బి ఎల్ వోలు, సూపర్వైజర్లు తదితరులు పాల్గొన్నారు.

పౌర సంబంధాల అధికారి జీవీఎంసీ

Comments