ఈ రోజు అనగా తేది. 07.08.2026 డా.పి.జగదీశ్వర రావు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి వారి అధ్వర్యంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి వారి కార్యాలయంలో మాతృ మరణాల పై సబ్ డిస్ట్రిక్ట్ మెటర్నిటీ డెత్ సర్వేలేన్స్ మరియు రెస్పాన్స్ కమిటీ సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో డా.పి.జగదీశ్వర రావు వారు మాట్లాడుతూ జూన్ నెలలో బాలాజీనగర్ పట్టణ ఆరోగ్యకేంద్ర పరిదిలో 1, సొంట్యం ప్రాధమిక ఆరోగ్య కేంద్ర పరిదిలో 1 మాతృ మరణం, జులై నెలలో సాగర్ నగర్ పట్టణ ఆరోగ్య కేంద్ర పరిదిలో 1, పెదగంట్యాడ ప్రాధమిక ఆరోగ్య కేంద్ర పరిదిలో 1 మరియు కణితి ప్రాధమిక ఆరోగ్య కేంద్ర పరిదిలో 1 మాతృమరణంల పై సమీక్ష నిర్వహించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి వారు మాట్లాడుతూ మాతృమరణాలు ఇకముందు సంభవించకుండా చూసుకోవాల్సిన భాద్యత సంబందిత ఆరోగ్య కేంద్రం యొక్క మెడికల్ అధికారి పై ఆధారపడి ఉంటుందని మరియు సంబందిత ANM సమయానికి గర్భిణీ స్త్రీ కి అవసరమైన సేవలను గుర్తించి అందజేయాలని తెలియచేశారు. ఇకముందు మాతృమరణాలు జరిగితే చర్యలు తీసుకోబడతాయని, హై రిస్క్ గర్భిణీ లు ప్రసవానికి వచ్చినప్పుడు కాలయాపన చేయకుండా KGH కు గాని VGH కు గాని రిఫర్ చేయాలని ఆ విధంగా సురక్షిత కాన్పు జరిగేలా చూడాలని సూచించారు. ANM, ఆశా కార్యకర్తలు ఆడపిల్లలకు కౌమారదశ నుండి జరిగే మార్పులపై అవగాహన కల్పించాలని, గర్భిణీ స్త్రీలకు గర్బాధారణ నుండి అవగాహన కల్పించాలని సూచించారు. హైరిస్క్ గర్భిణీలను ముందుగానే గుర్తించి వారికి సమయానికి టీకాలు, పోషకాహారం మొ’’ ఆరోగ్య సేవలను అందేటట్లు చూడాలని తెలియచేశారు. హై రిస్క్ గర్భిణీ స్త్రీలకు బర్త్ ప్లానింగ్ సక్రమంగా చేయాలని మరియు ఆయా గర్భిణీ స్త్రీలకు ఆరోగ్య స్థితి పట్ల అవగాహన కల్పించాలని సూచించారు.
తదుపరి ఎం.టి.పి. కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం నందు గైనకాలజిస్టు లు పాల్గొన్నారు.
ఈ సమావేశoలో డా.లూసి, జిల్లా వ్యాది నిరోధక టీకాల అధికారి, డా.ఉషాప్రసాద్, సూపరింటెండెంట్, VGH, డా.లూసి, డి.ఐ.ఒ, డా.బి.ఉమావతి, DPMO-NHM, డా.ఉషాదేవి, గైనకాలజిస్ట్, KGH, డా.ఎం.శిరీష, ఏనాస్తీషియా, KGH, డా.శాంతిప్రియ, జనరల్ మెడిసిన్, KGH, డా.టివిఎస్ నాయుడు, బ్లడ్ బ్యాంకు, డా.ఎన్.వి.సమత, WHO, శ్రీమతి ఎం.సత్యవతి, DPHNO, ప్రాధమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారులు, పట్టణ ఆరోగ్య కేంద్ర వైద్యాధికారులు పాల్గొన్నారు.
జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి
విశాఖపట్నం
K.V.SHARMA EDITOR


Comments
Post a Comment