ఆంధ్ర విశ్వవిద్యాలయ విద్యార్థులకు ఫార్ములా–1 రేసింగ్ కారు సమీపంగా వీక్షించే అరుదైన అవకాశం లభించనుంది. ఆంధ్రప్రదేశ్‌లో తొలిసారిగా ఆర్‌బీ14 (RB14) ఫార్ములా–1 రేసింగ్ కారు ఎక్స్‌పోను ఈ నెల 20న నిర్వహించనున్నారు.
ఆంధ్ర విశ్వవిద్యాలయం కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ (ఏ) ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె. వెంకట సుబ్బయ్య సోమవారం ఆర్‌బీ14 ఫార్ములా–1 రేసింగ్ కారు ఎక్స్‌పో పోస్టర్‌ను అధికారికంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఏయూ యునైటెడ్ స్టూడెంట్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.
ఏయూ యునైటెడ్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఈ ఎక్స్‌పో ఈ నెల 20న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఆంధ్ర విశ్వవిద్యాలయ బాస్కెట్‌బాల్ కోర్టులో జరగనుంది. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఫార్ములా–1 రేసింగ్ కారును అత్యంత సమీపం నుంచి వీక్షించడంతో పాటు, దాని ప్రత్యేకతలు మరియు రేసింగ్ ప్రపంచంలోని సాంకేతికతను ప్రత్యక్షంగా తెలుసుకోవచ్చు .
క్లబ్ నిర్వాహకులు అక‍్షయ్, యశ్వంత్, రవికాంత్‌లు ఈ కార్యక్రమానికి విశ్వవిద్యాలయ విద్యార్థులందరినీ ఆహ్వానించారు.
K.V.SHARMA EDITOR

Comments
Post a Comment