Skip to main content

జాతీయ జెండా రూపకర్త శ్రీ పింగళి. వెంకయ్య గారి 150వ జయంతి సందర్భంగా 150 మీటర్ల( 450 అడుగులు) భారీ జాతీయ జెండా ర్యాలీ...


స్వామి వివేకానంద స్వచ్ఛంద సేవా సంస్థ నందు భారత జాతీయ జెండా రూపకర్త శ్రీ పింగళి. వెంకయ్య గారి 150 వ జయంతి కార్యక్రమాన్ని 150 మీటర్ల( 450 అడుగులు) జెండా ర్యాలీతో ఘనంగా నిర్వహించారు. 

వివేకానంద సంస్థ గౌరవ అధ్యక్షులు డాక్టర్.C.M.A. జహీర్ అహ్మద్ , రౌండ్ టేబుల్ సంస్థ మాజీ చైర్మన్ మక్సుద్ అహ్మద్  ఆధ్వర్యంలో 150 మీటర్ల భారీ జాతీయ జెండాను వివేకానంద సంస్థ నుండి రాణీ బొమ్మ వరకు జెండా ర్యాలీని ప్రదర్శించారు. ఈ సందర్భంగా డాక్టర్ మాట్లాడుతూ, మన దేశానికి ప్రత్యేక జండా  ఉండాలని ధ్యేయంగా, 

జాతీయ జెండాను రూపొందించిన మహోన్నత  వ్యక్తి పింగళి వెంకయ్య. ఆయన జయంతిని చేసుకోవడం స్ఫూర్తిదాయకం, కోట్లాది మంది భారతీయుల్ని ఒకే తాటిపైకి తెచ్చిన బహుముఖ ప్రజ్ఞశాలి. ఆయన గుర్తుగా 150 మీటర్ల భారీ జెండా ర్యాలీ వివేకానంద సంస్థ వారు నిర్వహించడం చాలా ఆదర్శనీయం. 

పింగళి వెంకయ్య  కుటుంబ సభ్యులను గుర్తించి ఆర్థికంగా రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని, పింగళి వెంకయ్య విగ్రహాన్ని అసెంబ్లీలో ప్రతిష్టించాలని, పింగళి వెంకయ్య గారి జయంతిని జాతీయ పండుగగా నిర్వహించాలని ఈ సందర్భంగా డాక్టర్ గారు కోరారు. 

ఈ ర్యాలీ కార్యక్రమంలో వివేకానంద సంస్థ అధ్యక్షులు అప్పారావు, వివేకానంద సంస్థ సీనియర్ సభ్యులుT. సాయి బలరాం, ప్రముఖ సంఘ సేవకులు T. కృష్ణ ,సంస్థ సభ్యులు, మరియు మహిళా సభ్యులు అధిక సంఖ్యలో ట్యూషన్ విద్యార్థులు పాల్గొన్నారు

Comments

Popular posts from this blog

*శ్రీ సత్యసాయి సేవా సంస్థలు – విశాఖపట్నం జిల్లా* *ప్రేమ సేవగా తలవంచిన వేళ — గిరి ప్రదక్షిణ భక్తుల అలసిన పాదాలకు ఉపశమనం కల్పించిన శ్రీ సత్యసాయి సేవాదళ్- గిరి ప్రదక్షిణ మార్గంలో వేలాది మంది భక్తులకు ప్రేమతో, నిస్వార్థంగా సేవలందించిన విశాఖ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థలు*

విశాఖపట్నం :29 జులై 2026: పవిత్రమైన గురుపూర్ణిమ సందర్భంగా సింహాచల క్షేత్ర ఆరాధ్యదైవం, కోట్లాది మంది భక్తుల ఇలవేల్పు శ్రీ శ్రీ శ్రీ వరాహ లక్ష్మీనృసింహ స్వామివారి గిరి ప్రదక్షిణలో పాల్గొన్న లక్షలాది మంది భక్తులకు విశాఖ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థలు విస్తృతమైన సేవా కార్యక్రమాలను ప్రేమతో, భక్తిశ్రద్ధలతో నిర్వహించాయి. విశాఖ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థల సింహాచలం సమితి, గోపాలపట్నం భజన మండలి ఆధ్వర్యంలో గిరి ప్రదక్షిణకు విచ్చేసిన భక్తులకు 28 జులై 2026 ఉదయం నుంచే సేవా కార్యక్రమాలు ప్రారంభమై, రాత్రంతా కొనసాగి 29 జులై 2026 ఉదయం 7 గంటల వరకు నిర్వహించబడ్డాయి. *అలసిన భక్తుల పాదాలకు ప్రేమతో ఉపశమనం — ప్రత్యేక సేవ* గిరి ప్రదక్షిణలో ఎంతో దూరం నడిచి అలసిపోయిన భక్తుల పాదాలకు ఉపశమనం కల్పించేందుకు శ్రీ సత్యసాయి సేవా సంస్థలు చేపట్టిన ప్రత్యేక పాద మర్దన సేవ అందరి హృదయాలను స్పృశించింది. భక్తుల అలసిన పాదాలకు ఉపశమనం కలిగించేందుకు నువ్వుల నూనెలో ప్రత్యేక వనమూలికలను మరిగించి తయారుచేసిన నూనెను శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ప్రత్యేకంగా సిద్ధం చేయించాయి. శ్రీ సత్యసాయి మహిళా మరియు పురుష సేవాదళ్ సభ్యులు స్వయంగా భక్...