జీవీఎంసీ అభివృద్ధి పనులను ప్రణాళికాబద్ధంగా వేగవంతం చేయాలి. *2025–26 అభివృద్ధి పనులు, 2026–27 ప్రాధాన్యత పనులు, కొనసాగుతున్న, ప్రతిపాదిత ప్రాజెక్టులపై సమగ్ర సమీక్ష. *రోడ్లు, జంక్షన్లు, ఫుట్‌పాత్‌లు, డ్రైన్లు తదితర మౌలిక సదుపాయాల అభివృద్ధికి మాస్టర్ ప్లాన్‌కు అనుగుణంగా ప్రణాళికలు. *పెండింగ్ పనుల్లో జాప్యానికి కారణాలను పరిష్కరించి నిర్ణీత గడువులో పూర్తి చేయాలి.
విశాఖపట్నం, ఆగస్టు 19: జీవీఎంసీ పరిధిలో ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించే లక్ష్యంతో చేపడుతున్న అభివృద్ధి పనులు, ప్రాజెక్టులను ప్రణాళికాబద్ధంగా వేగవంతం చేసి నిర్ణీత కాలవ్యవధిలో పూర్తి చేయాలని విశాఖ జిల్లా కలెక్టర్, జీవీఎంసీ ప్రత్యేక అధికారి ఎం. అభిషిక్త్ కిషోర్ అధికారులను ఆదేశించారు.
బుధవారం జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలోని ప్రత్యేక అధికారి ఛాంబర్‌లో జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్, ఇంజనీరింగ్ విభాగం ఉన్నతాధికారులతో కలిసి అభివృద్ధి పనులపై ఆయన సమగ్ర సమీక్ష నిర్వహించారు. 2025–26 ఆర్థిక సంవత్సరంలో చేపట్టిన అభివృద్ధి పనులు, 2026–27లో ప్రాధాన్యతగా చేపట్టిన పనులు, ప్రస్తుతం కొనసాగుతున్న పనులు, చేపట్టాల్సిన, ప్రతిపాదిత పనులు, వివిధ ప్రాజెక్టులతో పాటు రాబోయే పార్టనర్‌షిప్ సమ్మిట్ నేపథ్యంలో ప్రతిపాదించిన అభివృద్ధి పనులపై క్షుణ్ణంగా సమీక్షించారు.
ఈ సందర్భంగా జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివిధ కేటగిరీలకు సంబంధించిన అభివృద్ధి పనులు, ప్రాజెక్టుల ప్రస్తుత స్థితి, ఇప్పటివరకు సాధించిన పురోగతి, చేపట్టాల్సిన తదుపరి కార్యాచరణను ప్రత్యేక అధికారికి వివరించారు. జీవీఎంసీ నిధులతో పాటు 15వ ఆర్థిక సంఘం నిధులు, ఇతర పథకాలు, ప్రాజెక్టుల కింద చేపడుతున్న పనుల పురోగతిపై ప్రత్యేక అధికారి వివరాలు అడిగి తెలుసుకున్నారు.ప్రధానంగా రోడ్లు, జంక్షన్లు, ఫుట్‌పాత్‌లు, డ్రైన్లు, పార్కులు, స్మశాన వాటికలు, సెంట్రల్ మీడియన్లు, ఆధునిక పబ్లిక్ టాయిలెట్లు, చెరువుల సుందరీకరణ, వీధి దీపాలు, స్మార్ట్ స్ట్రీట్ వెండింగ్ మార్కెట్లు, వర్కింగ్ ఉమెన్స్ హాస్టళ్లు, స్టేడియంలు, తాగునీటి సదుపాయాలు, సర్వీస్ రోడ్ల అభివృద్ధి, జోనల్ కార్యాలయాల నిర్మాణం తదితర పనులపై సమీక్షించారు. అలాగే అర్బన్ ఛాలెంజ్ ఫండ్ (UCF), అమృత్ 2.0, ప్రాజెక్ట్ సారథి కింద చేపడుతున్న పనులతో పాటు రాబోయే పార్టనర్‌షిప్ సమ్మిట్‌కు సంబంధించి ప్రతిపాదించిన పనుల పురోగతిని పరిశీలించారు.
నగరంలో ప్రస్తుతం ఉన్న జంక్షన్లు, అభివృద్ధి చేస్తున్న జంక్షన్లు, ఇంకా అభివృద్ధి చేయాల్సిన జంక్షన్ల వివరాలను ప్రత్యేక అధికారి అడిగి తెలుసుకున్నారు. వాటి అభివృద్ధి, నిర్వహణకు స్పష్టమైన కార్యాచరణ రూపొందించి, ప్రాధాన్యత పనులను త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని సూచించారు. నగర భవిష్యత్ అవసరాలు, పెరుగుతున్న జనాభా, రాకపోకలను దృష్టిలో ఉంచుకుని మాస్టర్ ప్లాన్‌కు అనుగుణంగా రోడ్లు, జంక్షన్లు, ఫుట్‌పాత్‌లు, కాలువలు, పార్కులు తదితర మౌలిక సదుపాయాల అభివృద్ధికి దీర్ఘకాలిక ప్రణాళిక సిద్ధం చేయాలని ఆదేశించారు. బీచ్ ప్రాంతంలోని పార్కులను మరింత ఆకర్షణీయంగా అభివృద్ధి చేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు.
కొన్ని అభివృద్ధి పనులు నిర్ణీత గడువులో పూర్తి కాకపోవడంపై ప్రత్యేక అధికారి అసంతృప్తి వ్యక్తం చేశారు. జాప్యానికి గల కారణాలను గుర్తించి, సంబంధిత విభాగాలు సమన్వయంతో క్షేత్రస్థాయి సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. కొనసాగుతున్న పనుల్లో నాణ్యతకు ప్రాధాన్యం ఇస్తూ, నిర్దేశించిన కాలపరిమితిలో పూర్తి చేసేందుకు నిరంతరం పర్యవేక్షించాలని అధికారులకు స్పష్టం చేశారు. ప్రతిపాదిత పనులకు ముందుగానే సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేసి, అన్ని అవసరమైన మౌలిక సదుపాయాలను పరిగణనలోకి తీసుకుని కార్యాచరణ చేపట్టాలని ఆదేశించారు.తదుపరి సమీక్షా సమావేశానికి జీవీఎంసీ పరిధిలో చేపడుతున్న ప్రతి ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలతో అధికారులు సిద్ధంగా హాజరు కావాలని ప్రత్యేక అధికారి ఆదేశించారు. ప్రతిపాదన దశ, పరిపాలనా అనుమతులు, టెండర్ ప్రక్రియ, వర్క్ ఆర్డర్, పనుల ప్రారంభం, ప్రస్తుత పురోగతి, ఇప్పటివరకు పూర్తయిన పనులు, మిగిలి ఉన్న పనులు, పూర్తి చేయాల్సిన గడువు తదితర వివరాలను ప్రాజెక్టుల వారీగా దశలవారీగా సిద్ధం చేసి తదుపరి సమావేశంలో సమర్పించాలని ఆదేశించారు.
ఈ సమీక్షలో జీవీఎంసీ అదనపు కమిషనర్లు, చీఫ్ సిటీ ప్లానర్ ప్రభాకర్ రావు, ఇంజనీరింగ్ విభాగం ఉన్నతాధికారులు, సంబంధిత అధికారులు, పీఎంయు ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
పౌర సంబంధాల అధికారి,జీవీఎంసీ
.jpeg)
.jpeg)
.jpeg)
Comments
Post a Comment