జర్నలిస్టుల పిల్లలకు విద్యాప్రోత్సహకాలు* *2026లో 182 మందికి ఉపకార వేతనాలు* *విద్యతోనే అపార ఉపాధి అవకాశాలు* *ప్రతిభను ప్రోత్సహించడమే లక్ష్యం*... *జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల*
అక్కయ్యపాలెం జంక్షన్ ,ఆగస్టు 13*ప్రపంచ వ్యాప్తంగా విద్యతోనే అపార ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి (ఎన్ ఏజె), ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ రాష్ర్ట నాయకులు *గంట్ల శ్రీనుబాబు* *అన్నారు
. ఈ మేరకు శుక్రవారం అక్కయ్యపాలెంలోని తన కార్యాలయంలో 9 మంది జర్నలిస్టుల పిల్లలకు ఉపకార వేతనాలను గంట్ల శ్రీనుబాబు అందజేశారు. సిఏ
విద్యాభ్యాసం సాగిస్తున్న సిహెచ్ అమృత యాదవ్ , వైఎస్ ఎన్ ఎస్ లిఖిత్ (పదోతరగతి), సిహెచ్ మనోజ్ యాదవ్ (9వతరగతి), కె.జోషఫ్ రాజు(8వతరగతి) బి.హర్షిత్ రామ్ (4వతరగతి), కొల్లి జైస్వాల్ (ఎల్ కెజి), ఎస్.భవదీప్ (రెండోతరగతి), ఎస్. గుణదీప్ (యుకెజి), కొల్లి మహాన్ష్ (రెండోతరగతి) తదితరులకు ప్రశంసా పత్రం, నగదు, ఇతర ప్రోత్సాహక బహుమతులను అందజేశారు.
ఈ సందర్భంగా గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ గత 15 ఏళ్లుగా జర్నలిస్టుల పిల్లలకు క్రమం తప్పకుండా ఉపకార వేతనాలను అందజేస్తూ వస్తున్నామన్నారు. ఈ ఏడాది *జూన్ 28న* *152 మందిపిల్లలకు ఉపకార వేతనాలు అందజేశామన్నారు. ఆ తరువాత దశల వారీగా మరో 30 మంది పిల్లలకు కూడా విద్యా ప్రోత్సాహకాలను అందజేస్తూ రావడం జరిగిందన్నారు
. ఇందులో నలుగురు బీటెక్ విద్యార్ధులకు గత మూడేళ్లుగా తాను సొంతంగా ఫీజులు చెల్లిస్తున్నట్లు చెప్పారు. అలాగే వివిధ తరగతుల్లో విద్యాభ్యాసం సాగిస్తున్న వారిని తన పరిధి మేరకు ఆర్ధిక సాయం చేసి ప్రోత్సహిస్తున్నట్లు చెప్పారు. ఇందులో కులాలు, మతాలు, యూనియన్ లకు ప్రమేయం లేదన్నారు. గత కొన్నేళ్లుగా తాను ఈ కార్యక్రమాన్ని తన పరిధి మేరకు నిర్వహిస్తూ వస్తున్నట్లు గంట్ల శ్రీనుబాబు చెప్పారు.
ప్రతిభను ప్రోత్సహించడం, పిల్లల్లో ప్రతిభా పాటవాలను గుర్తించడమే దీని ప్రధాన లక్ష్యమన్నారు. ఇటువంటి విద్యాప్రోత్సాహకాల వల్ల వారిలో నూతన ఉత్సాహం కలగడంతో పాటు భవిష్యత్తులో ఎంతో మందికి స్పూర్తిగా నిలుస్తారన్నారు.
దేశ, విదేశాల్లో ఎక్కడ స్థిరపడిన వారికి తాము ఎప్పుడూ జ్ఞాపకంగా ఉంటామని అదే తనకు ఆత్మసంతృప్తి కలిగిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో పిల్లలతో పాటు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు*.







Comments
Post a Comment