Skip to main content

నీటి ఎద్దడిపై జీవీఎంసీ యుద్ధప్రాతిపదికన ప్రత్యేక చర్యలు. "డయల్-ఏ-ట్యాంకర్" సేవలకు నగర ప్రజల నుంచి విశేష స్పందన. *మొదటి రోజే 245 ట్యాంకర్ బుకింగ్‌లు నమోదు. *త్వరలో ఆన్‌లైన్ బుకింగ్ – ప్రత్యేక మొబైల్ యాప్ అందుబాటులోకి. *FIFO విధానంలో ట్యాంకర్ల కేటాయింపు... పూర్తి పారదర్శకతకు పెద్దపీట. *11 ప్రాంతాల్లో ప్రత్యేక పర్యవేక్షణ... క్షేత్రస్థాయిలో ఇంజినీరింగ్ అధికారుల నిరంతర పర్యవేక్షణ. – జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్.

 


విశాఖపట్నం, ఆగస్టు 6: నగరంలోని కొన్ని ప్రాంతాల్లో నెలకొన్న తాగునీటి ఎద్దడి పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొని ప్రజలకు నిరంతర తాగునీటి సరఫరా అందించేందుకు మహా విశాఖపట్నం నగర పాలక సంస్థ యుద్ధప్రాతిపదికన ప్రత్యేక చర్యలు చేపట్టిందని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ సందర్భంగా కమిషనర్ వివరిస్తూ ప్రజలకు అవసరమైన సమయంలో తాగునీటిని వేగంగా, పారదర్శకంగా, సులభంగా అందించాలనే లక్ష్యంతో జీవీఎంసీ నీటి సరఫరా విభాగం ఈ రోజు నుంచి "డయల్-ఏ-ట్యాంకర్" (Dial-A-Tanker) సేవలను ప్రారంభించిందని తెలిపారు. ఈ సేవలకు నగర ప్రజల నుంచి మొదటి రోజే విశేష స్పందన లభించడం ఆనందదాయకమని పేర్కొన్నారు. ఈ రోజు అనకా గురువారం సాయంత్రం 7.00 గంటల వరకు జీవీఎంసీ సిటీ ఆపరేషన్ సెంటర్ (COC) లో సుమారు 245 వాటర్ ట్యాంకర్ బుకింగ్‌లు నమోదు అయ్యాయని తెలిపారు. నమోదైన బుకింగ్‌ల ఆధారంగా ప్రజలకు వీలైనంత త్వరగా తాగునీటిని అందించేందుకు ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తున్నట్లు వెల్లడించారు

" త్వరలో ఆన్‌లైన్ నీటి ట్యాంకర్ బుకింగ్ అందుబాటులో.

ప్రజలు కార్యాలయాలకు రావాల్సిన అవసరం లేకుండా తమ ఇళ్ల నుంచే మొబైల్ ఫోన్ లేదా కంప్యూటర్ ద్వారా వాటర్ ట్యాంకర్లను బుక్ చేసుకునేందుకు జీవీఎంసీ సిటిజన్ పోర్టల్‌లో ప్రత్యేక ఆన్‌లైన్ వాటర్ ట్యాంకర్ బుకింగ్ వ్యవస్థను ఒకటి లేదా రెండు రోజుల్లో అందుబాటులోకి తీసుకురానున్నట్లు కమిషనర్ తెలిపారు. ఈ సేవ ద్వారా ఆన్‌లైన్‌లో చెల్లింపులు చేయడం, బుకింగ్ రిఫరెన్స్ నంబర్ పొందడం, దరఖాస్తు స్థితిని తెలుసుకోవడం వంటి సౌకర్యాలు కల్పించనున్నట్లు తెలిపారు. 

" FIFO విధానంలో పూర్తి పారదర్శకత"

వాటర్ ట్యాంకర్ల కేటాయింపులో ఎలాంటి వివక్షకు తావులేకుండా, పూర్తి పారదర్శకతను పాటిస్తూ అన్ని బుకింగ్‌లను "ఫస్ట్ ఇన్ – ఫస్ట్ అవుట్ (FIFO)" విధానంలో అమలు చేయనున్నట్లు కమిషనర్ తెలిపారు. ముందుగా బుక్ చేసుకున్న వారికి ముందుగా ట్యాంకర్ కేటాయించే విధంగా వ్యవస్థ రూపొందించబడిందని, దీంతో ప్రతి వినియోగదారునికి సమాన ప్రాధాన్యత లభిస్తుందని పేర్కొన్నారు.

" 11 ప్రాంతాల్లో ప్రత్యేక పర్యవేక్షణ"

ఈ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేసేందుకు నగరంలోని 11 ప్రాంతాల్లో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు (EEలు), డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు (DEEలు), అసిస్టెంట్ ఇంజనీర్లు (AEలు) క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యవేక్షిస్తూ అవసరమైన చర్యలు చేపడుతున్నారని తెలిపారు. ట్యాంకర్ల ద్వారా నీటిని నింపాల్సిన ప్రదేశాలు, సరఫరా చేయాల్సిన ప్రాంతాలను సిటీ ఆపరేషన్ సెంటర్ (COC) ద్వారా శాస్త్రీయంగా మ్యాపింగ్ చేసి, ప్రతి ట్యాంకర్‌ను నిర్దేశిత ప్రాంతానికే పంపించే విధంగా ప్రత్యేక వ్యవస్థను అమలు చేస్తున్నామని తెలిపారు. దీంతో ట్యాంకర్ల వినియోగంలో సమర్థత పెరగడంతో పాటు ప్రజలకు వేగవంతమైన సేవలు అందనున్నాయని పేర్కొన్నారు.

" ప్రజల సహకారమే ముఖ్యం"

తాగునీటి సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా జీవీఎంసీ అన్ని శాఖలు సమన్వయంతో నిరంతరం పనిచేస్తున్నాయని కమిషనర్ తెలిపారు. ప్రజలు "డయల్-ఏ-ట్యాంకర్" సేవలను సద్వినియోగం చేసుకోవడంతో పాటు తాగునీటిని పొదుపుగా వినియోగించి జీవీఎంసీకి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రజా అవసరాలకు అనుగుణంగా తాగునీటి సరఫరా వ్యవస్థను మరింత బలోపేతం చేయడంతో పాటు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి పారదర్శకమైన, వేగవంతమైన, ప్రజలకు మరింత చేరువయ్యే సేవలను అందించేందుకు జీవీఎంసీ కట్టుబడి ఉందని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ తెలిపారు.

                  K.V.SHARMA EDITOR





Comments

Popular posts from this blog

*శ్రీ సత్యసాయి సేవా సంస్థలు – విశాఖపట్నం జిల్లా* *ప్రేమ సేవగా తలవంచిన వేళ — గిరి ప్రదక్షిణ భక్తుల అలసిన పాదాలకు ఉపశమనం కల్పించిన శ్రీ సత్యసాయి సేవాదళ్- గిరి ప్రదక్షిణ మార్గంలో వేలాది మంది భక్తులకు ప్రేమతో, నిస్వార్థంగా సేవలందించిన విశాఖ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థలు*

విశాఖపట్నం :29 జులై 2026: పవిత్రమైన గురుపూర్ణిమ సందర్భంగా సింహాచల క్షేత్ర ఆరాధ్యదైవం, కోట్లాది మంది భక్తుల ఇలవేల్పు శ్రీ శ్రీ శ్రీ వరాహ లక్ష్మీనృసింహ స్వామివారి గిరి ప్రదక్షిణలో పాల్గొన్న లక్షలాది మంది భక్తులకు విశాఖ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థలు విస్తృతమైన సేవా కార్యక్రమాలను ప్రేమతో, భక్తిశ్రద్ధలతో నిర్వహించాయి. విశాఖ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థల సింహాచలం సమితి, గోపాలపట్నం భజన మండలి ఆధ్వర్యంలో గిరి ప్రదక్షిణకు విచ్చేసిన భక్తులకు 28 జులై 2026 ఉదయం నుంచే సేవా కార్యక్రమాలు ప్రారంభమై, రాత్రంతా కొనసాగి 29 జులై 2026 ఉదయం 7 గంటల వరకు నిర్వహించబడ్డాయి. *అలసిన భక్తుల పాదాలకు ప్రేమతో ఉపశమనం — ప్రత్యేక సేవ* గిరి ప్రదక్షిణలో ఎంతో దూరం నడిచి అలసిపోయిన భక్తుల పాదాలకు ఉపశమనం కల్పించేందుకు శ్రీ సత్యసాయి సేవా సంస్థలు చేపట్టిన ప్రత్యేక పాద మర్దన సేవ అందరి హృదయాలను స్పృశించింది. భక్తుల అలసిన పాదాలకు ఉపశమనం కలిగించేందుకు నువ్వుల నూనెలో ప్రత్యేక వనమూలికలను మరిగించి తయారుచేసిన నూనెను శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ప్రత్యేకంగా సిద్ధం చేయించాయి. శ్రీ సత్యసాయి మహిళా మరియు పురుష సేవాదళ్ సభ్యులు స్వయంగా భక్...