ప్రింట్ మీడియా & ఎలక్ట్రానిక్ మీడియా ప్రకటన* *శ్రీమతిపాచిపెంట శాంతకుమారి ఆధ్వర్యంలో ఘనంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు* *జీవో–3కు చట్టబద్ధత కల్పించాలి – 1/70, 5వ షెడ్యూల్, PESA చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలి* *ఆదివాసీల భూమి, అడవి, నీరు, సంస్కృతి, హక్కులను పరిరక్షించాలి* * *– ధింసా కళాకారులకు గుర్తింపు కార్డులు, నెలవారీ పెన్షన్ ఇవ్వాలి*
అల్లూరి సీతారామరాజు జిల్లా, ఆగస్టు 9:అంతర్జాతీయ ఆదివాసీ ప్రపంచ దినోత్సవాన్ని పురస్కరించుకుని* *చాపరాయి జలపాతం వద్ద ఆదివాసీ కాంగ్రెస్ రాష్ట్ర అబ్జర్వర్, ఏపీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీమతి పాచిపెంట శాంతకుమారి* *ఆధ్వర్యంలో 32వ ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ధింసా* *కళాకారులతో కలిసి కేక్ కట్ చేసి, సంప్రదాయ ధింసా నృత్యాలతో వేడుకలను నిర్వహించారు*.
*ఈ సందర్భంగా శాంతకుమారి మాట్లాడుతూ.. ఆదివాసీల భూమి, అడవి, నీరు, సంస్కృతి*, *సంప్రదాయాలు, జీవన హక్కులను పరిరక్షించడం ప్రభుత్వాల బాధ్యత అని అన్నారు. రాజ్యాంగం కల్పించిన 5వ షెడ్యూల్, PESA, 1/70 చట్టాలను కేవలం కాగితాలకే పరిమితం చేయకుండా క్షేత్రస్థాయిలో పకడ్బందీగా అమలు చేయాలని డిమాండ్ చేశారు*.
*జీవో–3కు చట్టబద్ధత కల్పించాలి*
*గిరిజన నిరుద్యోగులు, ఉద్యోగులకు న్యాయం* *జరిగేలా జీవో నంబర్–3కు చట్టబద్ధత కల్పిస్తామని ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని శాంతకుమారి డిమాండ్ చేశారు*
*గిరిజన యువత భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని విద్య, ఉద్యోగ రంగాల్లో ప్రత్యేక రక్షణ కల్పించాలని కోరారు.* *“మాట తప్పవద్దు.. మడమ తిప్పవద్దు.. గిరిజనులను మోసం చేయవద్దు” అని రాష్ట్ర ప్రభుత్వానికి ఆమె సూచించారు.*
*జీవో 51, 13, 2లను* *ఉపసంహరించుకోవాలి*5వ షెడ్యూల్ పరిధిలో* *గిరిజనుల ప్రయోజనాలకు విరుద్ధంగా చేపట్టే హైడ్రో పవర్, పంప్డ్ స్టోరేజ్* *తదితర ప్రాజెక్టులను తక్షణమే నిలిపివేయాలని ఆమె డిమాండ్ చేశారు.*
*జీవో నంబర్లు 51, 13, 2కు సంబంధించిన ప్రాజెక్టులను ప్రభుత్వం పునఃసమీక్షించి, గిరిజనుల జీవన విధానం, అడవులు, పర్యావరణానికి నష్టం కలిగించే నిర్ణయాలను ఉపసంహరించుకోవాలని కోరారు. గ్రామసభల అభిప్రాయాలను, గిరిజనుల హక్కులను పక్కనపెట్టి ఎలాంటి ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్లకూడదని స్పష్టం చేశారు*.
*ధింసా కళాకారులకు గుర్తింపు, పెన్షన్ ఇవ్వాలి*
*ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలను* *తరతరాలకు అందిస్తున్న ధింసా కళాకారులకు ప్రభుత్వం ప్రత్యేక గుర్తింపు కార్డులు మంజూరు చేయాలని శాంతకుమారి కోరారు*
*కళాకారులకు ఆర్థిక భద్రత కల్పించేందుకు ఐటీడీఏ ద్వారా ప్రతినెలా పెన్షన్ మంజూరు చేయాలని కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేశారు. ఆదివాసీ కళలు,* *సంప్రదాయ నృత్యాలు కనుమరుగుకాకుండా ప్రత్యేక సాంస్కృతిక పరిరక్షణ కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు*.
*ఆదివాసీ యువతకు* *విద్య, ఉపాధి కల్పించాలి*
*గిరిజన ప్రాంతాల్లో* *నాణ్యమైన విద్య, ఉన్నత విద్య, నైపుణ్య శిక్షణ, ప్రభుత్వ ఉద్యోగాలు, స్థానిక ఉపాధి* **అవకాశాలను పెంచేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని శాంతకుమారి కోరారు*.
*అడవులు, భూములు,* *జలవనరులపై ఆధారపడి జీవిస్తున్న ఆదివాసీల జీవనోపాధిని కాపాడుతూ అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టాలని అన్నారు. ఆదివాసీల హక్కులను కాపాడకుండా జరిగే అభివృద్ధి నిజమైన అభివృద్ధి కాదని స్పష్టం చేశారు.*
*కాంగ్రెస్ పార్టీ పోరాటం కొనసాగుతుంది*
*ఆదివాసీల హక్కులు, రాజ్యాంగ రక్షణలు, భూమి–అడవి–నీటి హక్కులు, విద్య–ఉపాధి, సంస్కృతి పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ నిరంతరం ప్రజల పక్షాన పోరాడుతుందని శాంతకుమారి తెలిపారు.*
*జీవో–3కు చట్టబద్ధత కల్పించే వరకు, 1/70 చట్టాన్ని పకడ్బందీగా అమలు చేసే వరకు, 5వ షెడ్యూల్–PESA హక్కులను పరిరక్షించే వరకు, ఆదివాసీల భూములు–అడవులు–జలవనరులకు రక్షణ కల్పించే వరకు కాంగ్రెస్ పార్టీ పోరాటం కొనసాగుతుందని ఆమె స్పష్టం చేశారు.*
*“ఆదివాసీ హక్కుల పరిరక్షణే మా లక్ష్యం – ఆదివాసీ భవిష్యత్తు రక్షణే మా బాధ్యత” అని శాంతకుమారి పేర్కొన్నారు.*
*ఈ కార్యక్రమంలో ఏపీ కాంగ్రెస్ పార్టీ పీసీసీ డెలిగేట్ మెంబర్ పాచిపెంట చిన్నస్వామి, కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పాంగి గంగాధర్, ధింసా కళాకారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఆదివాసీలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.*



Comments
Post a Comment