Skip to main content

అధిక సామ‌ర్ధ్యం క‌లిగిన నూత‌న మెటీరిల్స్‌ను రూప‌క‌ల్ప‌న చేయాలి -ఆచార్య ఎం.ఎన్. శాస్త్రి ఎండోమెంట్ లెక్చర్‌లో ఎమెరిటస్ ప్రొఫెస‌ర్‌ ఆచార్య టి.పి. రాధాకృష్ణన్ విశిష్ట ఉపన్యాసం ఆంధ్ర విశ్వవిద్యాలయం, ఆగస్టు 5: ఆంధ్ర విశ్వవిద్యాలయం రసాయన శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ఆచార్య ఎం.ఎన్. శాస్త్రి ఎండోమెంట్ లెక్చర్ బుధవారం న్యూ సెమినార్ హాల్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ విశ్వవిద్యాలయం ఎమెరిటస్ ప్రొఫెసర్ ఆచార్య టి.పి. రాధాకృష్ణన్ ప్రధాన వక్తగా పాల్గొని మాలిక్యుల‌స్ టు మెటీరియ‌ల్స్‌- ది ఎమ‌ర్జెన్స్ అండ్ ఇవ‌ల్యూష‌న్ మాలిక్యుల‌ర్ మెటీరియ‌ల్స్ ( "Molecules-to-Materials: The Emergence and Evolution of Molecular Materialsష‌) అంశంపై విశిష్ట ఉపన్యాసం అందించారు. ఈ సందర్భంగా ఆచార్య టి.పి. రాధాకృష్ణన్ మాట్లాడుతూ మానవ నాగరికత అభివృద్ధి పదార్థాల పరిణామంతో ముడిపడి ఉందని పేర్కొన్నారు. రాతియుగం, రాగియుగం, ఇనుపయుగం నుంచి నేటి సిలికాన్ యుగం, కార్బన్ యుగం వరకు ప్రతి దశలోనూ కొత్త పదార్థాల ఆవిష్కరణలే సాంకేతిక విప్లవాలకు పునాది అయ్యాయని వివరించారు. సాంప్రదాయ పదార్థాలు అధిక ఉష్ణోగ్రతలు, పీడనాల సహాయంతో తయారవుతుంటే, మాలిక్యులర్ మెటీరియల్స్ మాత్రం నిర్దిష్ట సేంద్రీయ అణువులు బలహీన అంతర అణు బంధాల (Non-covalent Interactions) ద్వారా స్వీయ సమీకరణ (Self-Assembly) ప్రక్రియలో ఏర్పడతాయని చెప్పారు. ఈ విధానం ద్వారా అవసరానికి అనుగుణంగా కొత్త పదార్థాలను రూపకల్పన చేయడం, వాటి లక్షణాలను సులభంగా నియంత్రించడం సాధ్యమవుతుందని వివరించారు. ద్రవ స్ఫటికాలు (లిక్విడ్ క్రిస్టల్స్) మాలిక్యులర్ మెటీరియల్స్ అభివృద్ధిలో కీలక మైలురాయిగా నిలిచాయని పేర్కొన్న ఆయన, ఒకప్పుడు ప్రయోగశాలలకే పరిమితమైన ఈ పరిశోధనలు నేడు ఎల్‌సీడీ డిస్‌ప్లేలు, ఆధునిక సెన్సార్ సాంకేతికతలకు పునాది అయ్యాయని చెప్పారు. లిక్విడ్ క్రిస్టల్స్ అభివృద్ధిలో భారత శాస్త్రవేత్త ప్రొఫెసర్ ఎస్. చంద్రశేఖర్ చేసిన సేవలను ప్రత్యేకంగా ప్రస్తావించారు. లేజర్ సాంకేతికత, లిక్విడ్ క్రిస్ట‌ల్స్ త‌దిత‌ర అంశాల‌ను వివ‌రించారు. రసాయన శాస్త్రం, భౌతిక శాస్త్రం, పదార్థ విజ్ఞానం వంటి విభిన్న శాస్త్ర శాఖల సమన్వయంతో మాలిక్యులర్ మెటీరియల్స్ రంగం వేగంగా అభివృద్ధి చెందుతోందని తెలిపారు. భవిష్యత్‌లో పర్యావరణహిత, అధిక సామర్థ్యం కలిగిన నూతన పదార్థాల రూపకల్పనలో ఈ రంగం అత్యంత కీలకమవుతుందని చెప్పారు. యువ శాస్త్రవేత్తలు ఈ రంగంలో మరింత పరిశోధనలు చేపట్టి దేశ శాస్త్రాభివృద్ధికి తోడ్పడాలని అన్నారు. ఈ సందర్భంగా ఆంధ్ర విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య జి.పి. రాజశేఖర్ మాట్లాడుతూ శాస్త్రానికి సరిహద్దులు లేవన్నారు. ప్రపంచంలో ఎక్కడ ఉన్నా నిబద్ధత, పట్టుదలతో పరిశోధనలు కొనసాగిస్తే అత్యున్నత స్థాయికి చేరుకోవచ్చని పేర్కొన్నారు. యువ పరిశోధకులు ఆచార్య రాధాకృష్ణన్ వంటి వారిని ఆదర్శంగా తీసుకుని శాస‌స్త్రీయ ప‌రిశోధ‌న‌ల‌లో ముందుకు సాగాలని అన్నారు. ఆచార్య రాధాకృష్ణన్ శిష్యుల్లో పలువురు దేశంలోని ప్రముఖ పరిశోధనా సంస్థలకు డైరెక్టర్లుగా, ఉన్నత శాస్త్రవేత్తలుగా సేవలందిస్తున్నారని, అలాంటి విశిష్ట‌ శాస్త్రవేత్తను ఆంధ్ర విశ్వవిద్యాలయానికి ఆహ్వానించడం విశ్వవిద్యాలయానికి గర్వకారణమని అన్నారు. సెంట్ర‌ల్ యూనివ‌ర్సిటీ ఆఫ్ హైద‌రాబాద్ లో ప‌నిచేస్తున్న స‌మ‌యంలో ఆచార్య రాధాకృష్ణ‌న్‌తో త‌న‌కున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. ఆచార్య ఎం.ఎన్. శాస్త్రి ఎండోమెంట్ లెక్చర్‌ను నిరంతరాయంగా నిర్వహిస్తున్న శాస్త్రిగారి కుటుంబ సభ్యులకు, ఆయ‌న శిష్యుల‌కు, రసాయన శాస్త్ర విభాగ అధ్యాపకుల‌ను అభినందించారు. విభాగాధిప‌తి ఆచార్య బి.వి.వి శైల‌జ ఆచార్య ఎం.ఎన్ శాస్త్రి జీవితం, ప‌రిశోధ‌న‌లు, ప్ర‌త్యేత‌క‌ల‌ను వివ‌రించారు. కార్యక్రమంలో మాజీ ఉపకుల‌ప‌తి ఆచార్య జి.నాగేశ్వ‌ర రావు, ప్ర‌సాద రావు, విశ్రాంత ఆచార్యులు అధ్యాపకులు, పరిశోధకులు, విద్యార్థులు, శాస్త్రవేత్తలు పాల్గొన్నారు.


ఆంధ్ర విశ్వవిద్యాలయం, ఆగస్టు 5:ఆంధ్ర విశ్వవిద్యాలయం రసాయన శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో  ఆచార్య ఎం.ఎన్. శాస్త్రి ఎండోమెంట్ లెక్చర్ బుధవారం న్యూ సెమినార్ హాల్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ విశ్వవిద్యాలయం ఎమెరిటస్ ప్రొఫెసర్ ఆచార్య టి.పి. రాధాకృష్ణన్ ప్రధాన వక్తగా పాల్గొని మాలిక్యుల‌స్ టు మెటీరియ‌ల్స్‌- ది ఎమ‌ర్జెన్స్ అండ్ ఇవ‌ల్యూష‌న్ మాలిక్యుల‌ర్ మెటీరియ‌ల్స్ ( "Molecules-to-Materials: The Emergence and Evolution of Molecular Materialsష‌) అంశంపై విశిష్ట ఉపన్యాసం అందించారు. 

ఈ సందర్భంగా  ఆచార్య టి.పి. రాధాకృష్ణన్ మాట్లాడుతూ మానవ నాగరికత అభివృద్ధి పదార్థాల పరిణామంతో ముడిపడి ఉందని పేర్కొన్నారు. రాతియుగం, రాగియుగం, ఇనుపయుగం నుంచి నేటి సిలికాన్ యుగం, కార్బన్ యుగం వరకు ప్రతి దశలోనూ కొత్త పదార్థాల ఆవిష్కరణలే సాంకేతిక విప్లవాలకు పునాది అయ్యాయని వివరించారు.


సాంప్రదాయ పదార్థాలు అధిక ఉష్ణోగ్రతలు, పీడనాల సహాయంతో తయారవుతుంటే, మాలిక్యులర్ మెటీరియల్స్ మాత్రం నిర్దిష్ట సేంద్రీయ అణువులు బలహీన అంతర అణు బంధాల (Non-covalent Interactions) ద్వారా స్వీయ సమీకరణ (Self-Assembly) ప్రక్రియలో ఏర్పడతాయని చెప్పారు. ఈ విధానం ద్వారా అవసరానికి అనుగుణంగా కొత్త పదార్థాలను రూపకల్పన చేయడం, వాటి లక్షణాలను సులభంగా నియంత్రించడం సాధ్యమవుతుందని వివరించారు.

ద్రవ స్ఫటికాలు (లిక్విడ్ క్రిస్టల్స్) మాలిక్యులర్ మెటీరియల్స్ అభివృద్ధిలో కీలక మైలురాయిగా నిలిచాయని పేర్కొన్న ఆయన, ఒకప్పుడు ప్రయోగశాలలకే పరిమితమైన ఈ పరిశోధనలు నేడు ఎల్‌సీడీ డిస్‌ప్లేలు, ఆధునిక సెన్సార్ సాంకేతికతలకు పునాది అయ్యాయని చెప్పారు.  లిక్విడ్ క్రిస్టల్స్ అభివృద్ధిలో భారత శాస్త్రవేత్త ప్రొఫెసర్ ఎస్. చంద్రశేఖర్ చేసిన సేవలను ప్రత్యేకంగా ప్రస్తావించారు. లేజర్ సాంకేతికత, లిక్విడ్ క్రిస్ట‌ల్స్ త‌దిత‌ర అంశాల‌ను వివ‌రించారు. రసాయన శాస్త్రం, భౌతిక శాస్త్రం, పదార్థ విజ్ఞానం వంటి విభిన్న శాస్త్ర శాఖల సమన్వయంతో మాలిక్యులర్ మెటీరియల్స్ రంగం వేగంగా అభివృద్ధి చెందుతోందని తెలిపారు. భవిష్యత్‌లో పర్యావరణహిత, అధిక సామర్థ్యం కలిగిన నూతన పదార్థాల రూపకల్పనలో ఈ రంగం అత్యంత కీలకమవుతుందని చెప్పారు. యువ శాస్త్రవేత్తలు ఈ రంగంలో మరింత పరిశోధనలు చేపట్టి దేశ శాస్త్రాభివృద్ధికి తోడ్పడాలని అన్నారు.


ఈ సందర్భంగా ఆంధ్ర విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య జి.పి. రాజశేఖర్ మాట్లాడుతూ శాస్త్రానికి సరిహద్దులు లేవన్నారు. ప్రపంచంలో ఎక్కడ ఉన్నా నిబద్ధత, పట్టుదలతో పరిశోధనలు కొనసాగిస్తే అత్యున్నత స్థాయికి చేరుకోవచ్చని పేర్కొన్నారు. యువ పరిశోధకులు ఆచార్య రాధాకృష్ణన్ వంటి వారిని ఆదర్శంగా తీసుకుని శాస‌స్త్రీయ ప‌రిశోధ‌న‌ల‌లో ముందుకు సాగాలని అన్నారు.

ఆచార్య రాధాకృష్ణన్ శిష్యుల్లో పలువురు దేశంలోని ప్రముఖ పరిశోధనా సంస్థలకు డైరెక్టర్లుగా, ఉన్నత శాస్త్రవేత్తలుగా సేవలందిస్తున్నారని, అలాంటి  విశిష్ట‌ శాస్త్రవేత్తను ఆంధ్ర విశ్వవిద్యాలయానికి ఆహ్వానించడం విశ్వవిద్యాలయానికి గర్వకారణమని అన్నారు. సెంట్ర‌ల్ యూనివ‌ర్సిటీ ఆఫ్ హైద‌రాబాద్ లో ప‌నిచేస్తున్న స‌మ‌యంలో ఆచార్య రాధాకృష్ణ‌న్‌తో త‌న‌కున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.

ఆచార్య ఎం.ఎన్. శాస్త్రి ఎండోమెంట్ లెక్చర్‌ను నిరంతరాయంగా నిర్వహిస్తున్న శాస్త్రిగారి కుటుంబ సభ్యులకు, ఆయ‌న శిష్యుల‌కు,  రసాయన శాస్త్ర విభాగ అధ్యాపకుల‌ను అభినందించారు.

విభాగాధిప‌తి ఆచార్య బి.వి.వి శైల‌జ ఆచా


ర్య ఎం.ఎన్ శాస్త్రి జీవితం, ప‌రిశోధ‌న‌లు, ప్ర‌త్యేత‌క‌ల‌ను వివ‌రించారు. కార్యక్రమంలో  మాజీ ఉపకుల‌ప‌తి ఆచార్య జి.నాగేశ్వ‌ర రావు, ప్ర‌సాద రావు, విశ్రాంత ఆచార్యులు అధ్యాపకులు, పరిశోధకులు, విద్యార్థులు, శాస్త్రవేత్తలు పాల్గొన్నారు.

జాతీయ వర్క్‌షాప్ పోస్ట‌ర్ ఆవిష్క‌ర‌ణ‌……..ఆంధ్రా యూనివర్సిటీ కెమిస్ట్రీ విభాగం ఆధ్వర్యంలో ఈ నెల 18, 19 తేదీల్లో నిర్వహించనున్న రెండు రోజుల జాతీయ స‌ద‌స్సు " ADVANCED MATERIALS FOR OPTOELECTRONICS" పోస్టర్‌ను బుధవారం ఏయూ వీసీ ఆచార్య జి.పి రాజ‌శేఖ‌ర్,  హైదరాబాద్ విశ్వవిద్యాలయం ఎమెరిటస్ ప్రొఫెసర్ ఆచార్య టి.పి. రాధాకృష్ణన్ తో క‌లిసి ఆవిష్కరించారు. ఈ వర్క్‌షాప్‌ను ఇండియన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ (బెంగళూరు), ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ (న్యూఢిల్లీ), నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ (ప్రయాగ్‌రాజ్)ల సౌజన్యంతో నిర్వహిస్తున్నారు. కార్య‌క్ర‌మంలో విశ్రాంత ఉప‌కుల‌ప‌తులు ఆచార్య జి.నాగేశ్వ‌ర రావు, ఆచార్య ప్ర‌సాద రావు, విభాగ ఆచార్యులు త‌దిత‌రులు పాల్గొన్నారు.

మెటీరియల్ సైన్స్, నానో టెక్నాలజీ, ఇన్ ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఆప్టికల్ ఎలక్ట్రానిక్స్ వంటి అత్యాధునిక పరిశోధనలపై విద్యార్థులు, పరిశోధకులు, అధ్యాపకులకు  అవగాహన కల్పించడం ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యం.  ప్రముఖ సంస్థల నుండి ప్రముఖ శాస్త్రవేత్తలు, ఆచార్యులు, రిసోర్స్ ప‌ర్స‌న్స్‌ హాజరై  విశిష్ట ప్ర‌సంగాల‌ను అందిస్తారు.

                   K.V.SHARMA EDITOR 

Comments

Popular posts from this blog

*శ్రీ సత్యసాయి సేవా సంస్థలు – విశాఖపట్నం జిల్లా* *ప్రేమ సేవగా తలవంచిన వేళ — గిరి ప్రదక్షిణ భక్తుల అలసిన పాదాలకు ఉపశమనం కల్పించిన శ్రీ సత్యసాయి సేవాదళ్- గిరి ప్రదక్షిణ మార్గంలో వేలాది మంది భక్తులకు ప్రేమతో, నిస్వార్థంగా సేవలందించిన విశాఖ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థలు*

విశాఖపట్నం :29 జులై 2026: పవిత్రమైన గురుపూర్ణిమ సందర్భంగా సింహాచల క్షేత్ర ఆరాధ్యదైవం, కోట్లాది మంది భక్తుల ఇలవేల్పు శ్రీ శ్రీ శ్రీ వరాహ లక్ష్మీనృసింహ స్వామివారి గిరి ప్రదక్షిణలో పాల్గొన్న లక్షలాది మంది భక్తులకు విశాఖ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థలు విస్తృతమైన సేవా కార్యక్రమాలను ప్రేమతో, భక్తిశ్రద్ధలతో నిర్వహించాయి. విశాఖ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థల సింహాచలం సమితి, గోపాలపట్నం భజన మండలి ఆధ్వర్యంలో గిరి ప్రదక్షిణకు విచ్చేసిన భక్తులకు 28 జులై 2026 ఉదయం నుంచే సేవా కార్యక్రమాలు ప్రారంభమై, రాత్రంతా కొనసాగి 29 జులై 2026 ఉదయం 7 గంటల వరకు నిర్వహించబడ్డాయి. *అలసిన భక్తుల పాదాలకు ప్రేమతో ఉపశమనం — ప్రత్యేక సేవ* గిరి ప్రదక్షిణలో ఎంతో దూరం నడిచి అలసిపోయిన భక్తుల పాదాలకు ఉపశమనం కల్పించేందుకు శ్రీ సత్యసాయి సేవా సంస్థలు చేపట్టిన ప్రత్యేక పాద మర్దన సేవ అందరి హృదయాలను స్పృశించింది. భక్తుల అలసిన పాదాలకు ఉపశమనం కలిగించేందుకు నువ్వుల నూనెలో ప్రత్యేక వనమూలికలను మరిగించి తయారుచేసిన నూనెను శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ప్రత్యేకంగా సిద్ధం చేయించాయి. శ్రీ సత్యసాయి మహిళా మరియు పురుష సేవాదళ్ సభ్యులు స్వయంగా భక్...