Skip to main content

శ్రీవాణి మాసపత్రిక సాహిత్య ప్రస్థానంలో 500వ మైలురాయి- ఆగస్టు 8న ఘన వేడుకలు"

శ్రీ కొమరగిరి కృష్ణమోహనరావు గారి ఆధ్వర్యంలో ప్రారంభించబడిన 'శ్రీవాణి' మాసపత్రిక సాహిత్య ప్రస్థానం ఆగస్టు 2026 నాటికి 500వ మైలురాయిని చేరుకుంటున్న సందర్భంగా ప్రత్యేక వేడుకలు నిర్వహించబడుచున్నవి. శ్రీ కొమరగిరి కృష్ణమోహనరావు 1985 జనవరిలో ఆధ్యాత్మిక, సాంస్కృతిక సాహిత్య ప్రస్థానాన్ని ప్రారంభించారు. పాఠకులు, అభిమానులు, శ్రేయోభిలాషుల విశేష ఆదరణతో 'శ్రీవాణి' తన సాహిత్య ప్రస్థానాన్ని నిరంతరం కొనసాగిస్తూ 500వ సంచిక అనే చారిత్రాత్మక మైలురాయిని చేరుకుంటోంది.

ఈ సందర్భంగా 2026 ఆగస్టు 8వ తేదీ శనివారం, విజయవాడలోని తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో ప్రత్యేక వేడుకలు నిర్వహించనున్నారు. కార్యక్రమంలో 'శ్రీవాణి' సాహిత్య ప్రస్థానంపై వీడియో ప్రదర్శన, అలాగే శ్రీ కొమరగిరి కృష్ణమోహనరావు జీవన సాహిత్య ప్రస్థానంపై లఘుచిత్ర ప్రదర్శన నిర్వహించనున్నారు. సభా. కార్యక్రమం ఉదయం 10.36 గంటలకు ప్రారంభమవుతుంది.

ప్రముఖ అతిథులు

ఈ వేడుకలకు పలువురు ప్రముఖులు హాజరై తమ సందేశాలను అందించనున్నారు. వారిలో

మాన్యశ్రీ జస్టిస్ శ్రీ ఎన్.వి. రమణ, సుప్రీంకోర్టు పూర్వ ప్రధాన న్యాయమూర్తి, మాస్యశ్రీ ఆర్.కె. రత్నాకర్, మేనేజింగ్ ట్రస్టీ, శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్

మాన్యశ్రీ కంభంపాటి హరిబాబు, గౌరవ గవర్నర్, ఒడిశా

మాస్యశ్రీ కేశినేని శివనాథ్ (చిన్ని), పార్లమెంట్ సభ్యులు, విజయవాడ

మాస్యశ్రీ కొల్లు రవీంద్ర, గౌ మంత్రివర్యులు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం

ఇతర ప్రముఖులు, సాహితీవేత్తలు, శ్రీవాణి అభిమానులు మరియు శ్రేయోభిలాషులు పాల్గొననున్నారు. ఈ చారిత్రాత్మక 600వ మైలురాయి వేడుకల్లో సాహితీ అభిమానులు, పాఠకులు, శ్రీవాణి అభిమానులు మరియు శ్రేయోభిలాషులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయవలెను. సధా కార్యక్రమానంతరం విందు ఏర్పాటు చేయబడినది.

కొమరగిరి శ్యామ్ ప్రసాద్, సంపాదకులు, శ్రీవాణి పత్రిక

 +91 98481 53523

Comments

Popular posts from this blog

*శ్రీ సత్యసాయి సేవా సంస్థలు – విశాఖపట్నం జిల్లా* *ప్రేమ సేవగా తలవంచిన వేళ — గిరి ప్రదక్షిణ భక్తుల అలసిన పాదాలకు ఉపశమనం కల్పించిన శ్రీ సత్యసాయి సేవాదళ్- గిరి ప్రదక్షిణ మార్గంలో వేలాది మంది భక్తులకు ప్రేమతో, నిస్వార్థంగా సేవలందించిన విశాఖ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థలు*

విశాఖపట్నం :29 జులై 2026: పవిత్రమైన గురుపూర్ణిమ సందర్భంగా సింహాచల క్షేత్ర ఆరాధ్యదైవం, కోట్లాది మంది భక్తుల ఇలవేల్పు శ్రీ శ్రీ శ్రీ వరాహ లక్ష్మీనృసింహ స్వామివారి గిరి ప్రదక్షిణలో పాల్గొన్న లక్షలాది మంది భక్తులకు విశాఖ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థలు విస్తృతమైన సేవా కార్యక్రమాలను ప్రేమతో, భక్తిశ్రద్ధలతో నిర్వహించాయి. విశాఖ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థల సింహాచలం సమితి, గోపాలపట్నం భజన మండలి ఆధ్వర్యంలో గిరి ప్రదక్షిణకు విచ్చేసిన భక్తులకు 28 జులై 2026 ఉదయం నుంచే సేవా కార్యక్రమాలు ప్రారంభమై, రాత్రంతా కొనసాగి 29 జులై 2026 ఉదయం 7 గంటల వరకు నిర్వహించబడ్డాయి. *అలసిన భక్తుల పాదాలకు ప్రేమతో ఉపశమనం — ప్రత్యేక సేవ* గిరి ప్రదక్షిణలో ఎంతో దూరం నడిచి అలసిపోయిన భక్తుల పాదాలకు ఉపశమనం కల్పించేందుకు శ్రీ సత్యసాయి సేవా సంస్థలు చేపట్టిన ప్రత్యేక పాద మర్దన సేవ అందరి హృదయాలను స్పృశించింది. భక్తుల అలసిన పాదాలకు ఉపశమనం కలిగించేందుకు నువ్వుల నూనెలో ప్రత్యేక వనమూలికలను మరిగించి తయారుచేసిన నూనెను శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ప్రత్యేకంగా సిద్ధం చేయించాయి. శ్రీ సత్యసాయి మహిళా మరియు పురుష సేవాదళ్ సభ్యులు స్వయంగా భక్...