భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి శత వర్ష జన్మదినోత్సవ వేడుకల్లో భాగంగా ‘సేవా పుష్పం’ — 8 మంది నిరాశ్రయ నారాయణులకు మొబైల్ ఆర్త జన సేవ
విశాఖపట్నం,విశాఖ సందేశం వర్తవాహని :ఆగస్టు 9, 2026:భగవాన్ శ్రీ సత్యసాయి బాబా దివ్య అనుగ్రహ ఆశీస్సులతో, స్వామివారి శతవర్ష జన్మదిన వేడుకల్లో భాగంగా విశాఖపట్నం జిల్లా చేపట్టిన పార్థి యాత్రలో ఒక చిన్న సేవా పుష్పంగా మొబైల్ అర్తజన సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు.
సింహాచలం, కే.వి.కే. సమితి యువత ఆధ్వర్యంలో పెందుర్తి పరిధిలోని చిన్న ముషీడివాడ – వేపగుంట జంక్షన్ ప్రాంతంలో ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా రోడ్డుపక్కన జీవనం సాగిస్తున్న 8 మంది నిరాశ్రయ నారాయణులకు శ్రీ సత్య సాయి యూత్ వారిని శుభ్రపరిచి , షేవింగ్ చేయించి, స్నానం చేయించి, నూతన వస్త్రాలను తొడిగి , అనంతరం టిఫిన్ అందించారు. ఆప్యాయతతో కూడిన ఈ సేవ ద్వారా వారి పట్ల గౌరవం, మానవత్వం, ప్రేమను చాటిచెప్పారు.
భగవాన్ శ్రీ సత్యసాయి బాబా బోధించిన “మానవ సేవే మాధవ సేవ” అనే సందేశాన్ని ఆచరణలో పెట్టే దిశగా ఈ కార్యక్రమాన్ని శ్రీ సత్య సాయి యువత నిర్వహించారు.
ఈ సేవా కార్యక్రమంలో శ్రీ సత్యసాయి సేవా సంస్థల విశాఖ జిల్లా ఎడ్యుకేషన్ ఇన్‌చార్జ్ శ్రీ బగ్గం సతీష్ కూడా పాల్గొన్నారు . అలాగే సింహాచలం యూత్‌కు చెందిన 5 మంది, కే.వి.కే. సమితి యూత్‌కు చెందిన 7 మంది యూత్ ఉత్సాహంగా పాల్గొని తమ సేవలను అందించారు.
భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి శతవర్ష జన్మదిన వేడుకల సందర్భంగా నిర్వహించిన ఈ సేవా కార్యక్రమం ద్వారా ప్రేమ, కరుణ, సేవ, మానవత్వం అనే భగవాన్ సందేశాలను సమాజంలో మరింతగా విస్తరించేందుకు శ్రీ సత్య సాయి యువత తమ వంతు కృషి చేశారు.
“సేవ చేసే అవకాశం కల్పించిన భగవాన్ శ్రీ సత్యసాయి బాబాకు హృదయపూర్వక కృతజ్ఞతలు” అని శ్రీ సత్య సాయి యువత తెలిపారు.





Comments
Post a Comment