గాజువాక :విశాఖ సందేశం :68 వ వార్డు మింది గ్రామంలో ప్రైమరీ స్కూల్లో ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (APWJF) జనరల్ సెక్రటరీ జి. శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించి, జెండాకు వందనం చేశారు. అనంతరం విద్యార్థులను ఉద్దేశించి శ్రీనివాసరావు మాట్లాడుతూ, దేశ స్వాతంత్ర్యం కోసం ఎంతోమంది మహనీయులు చేసిన త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని అన్నారు. విద్యార్థులు క్రమశిక్షణ, పట్టుదల, కష్టపడి చదివి దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
విద్యార్థులు దేశభక్తి గీతాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి ఆకట్టుకున్నారు. పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా పాఠశాల ప్రాంగణం జాతీయ జెండాలతో అలంకరించగా, ఈ సందర్భంగా ఆటపాటల్లో పాల్గొని,గెలుపొందిన విద్యార్థులు అందరికీ బహుమతులు గ్రామ పెద్దలు చేతి మీదగా బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో 68వ వార్డ్ సీనియర్ టిడిపి నాయకులు ఈటి. శ్రీనివాసరావు, అరుణోదయ కళా సమితి అధ్యక్ష, కార్యదర్శులు రెడ్డిపల్లి నానాజీ, వరి వెంకట్రావు, జనసేన నాయకులు రాజారావు,జయలక్ష్మి 68 వ వార్డు వైయస్సార్ పార్టీ మైనార్టీ సెల్ అధ్యక్షులు చిన్న హుస్సేన్,ఇతర నాయకులు మంగరాజు, నర్సింగరావు,ప్రైమరీ స్కూల్ ప్రధాన ఉపాధ్యాయురాలు అనంతలక్ష్మి, ఉపాధ్యాయులు సత్యనారాయణ, రమేష్,పరదేశి తదితరులు పాల్గొన్నారు..


Comments
Post a Comment