విశాఖపట్నం:విశాఖపట్నంవిశాఖసందేశంవర్తవాహని:ఆగస్టు15:విశాఖ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (VIMS)లో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించబడ్డాయి.
ఈ సందర్భంగా విమ్స్ డైరెక్టర్ డా. వి. మన్మధ రావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగాలు చేసిన మహనీయులను స్మరించుకున్నారు.ఈ సందర్భంగా డా. మన్మధ రావు మాట్లాడుతూ, స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాల ఫలితంగానే మనం నేడు స్వేచ్ఛా వాతావరణంలో జీవిస్తున్నామని పేర్కొన్నారు. దేశ అభివృద్ధికి ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలని, ముఖ్యంగా వైద్య రంగంలో సేవలందిస్తున్న సిబ్బంది ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడం ద్వారా దేశాభివృద్ధికి తోడ్పడాలని సూచించారు.
విమ్స్ ఆసుపత్రి వైద్యులు, నర్సింగ్ సిబ్బంది, పరిపాలనా అధికారులు మరియు ఉద్యోగులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జాతీయ పతాకానికి సెల్యూట్ చేసి జాతీయ గీతాన్ని ఆలపించారు. అనంతరం విశిష్ట సేవలు అందించిన సిబ్బందిని అభినందించి సత్కరించారు.
కార్యక్రమంలో డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాస్ కుమార్ మాట్లాడుతూ భారత దేశం ఎన్నో నూతన ఆవిష్కరణలకు నాంది పలికినది అని, పొరుగు దేశాలకు పెద్దన్నగా మరియు పటిష్టమైన విదేశాంగ విధానంతో ఇతర దేశాలలో ఔన్నత్యాన్ని కలిగి ఉందని, దేశ భక్తితో స్వతంత్ర సమర యోధుల స్ఫూర్తితో ప్రతీ ఒక్కరూ బాధ్యతతో తమ విధులను నిర్వర్తించినపుడు అన్ని సం అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతాయని తెలిపారు. హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్ డా. మనోజ్ కుమార్, నర్సింగ్ సూపరింటెండెంట్ శ్రీమతి సుగీత స్వర్ణలత, ఆఫీస్ సూపరింటెండెంట్ శ్రీ సత్యనారాయణ, ఆర్‌ఎంఓ డా. శిరీషతో పాటు విభాగాధిపతులు, వైద్యులు, నర్సింగ్ సిబ్బంది, పరిపాలనా సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు. అందరూ జాతీయ పతాకానికి వందనం చేసి దేశభక్తి భావాలను చాటుకున్నారు.స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆసుపత్రి ప్రాంగణాన్ని త్రివర్ణ పతాకాల రంగులతో అందంగా అలంకరించారు. ఈ వేడుకలు దేశభక్తి, సేవా భావం మరియు జాతీయ ఐక్యతకు ప్రతీకగా నిలిచాయని డైరెక్టర్ డా. వి. మన్మధ రావు పేర్కొన్నారు. ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించేందుకు విమ్స్ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని ఆయన తెలిపారు.
K.V.SHARMA EDITOR






Comments
Post a Comment