దేశంలో విలువలతో కూడిన నాణ్యమైన భారతీయ విద్యను సమాజంలోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా ఆగస్టు 8,9 తేదీలలో నోయిడా భావురావ్ దేవరస్ సరస్వతీ విద్యా మందిర్ లో నిర్వహించిన సమావేశంలో విశాఖకు చెందిన విద్యా భారతి ఆంధ్రప్రదేశ్ సహ ప్రముఖ్ ఎం దేవా త్రినాధ్ రావు పాల్గొన్నారు.
విశాఖపట్నం బివీకే విద్యాసంస్థల ప్రచార విభాగ ప్రముఖ్ గా సేవలందిస్తున్న దేవా త్రినాధ్ రావు ను ఆంధ్రప్రదేశ్ సహ ప్రముఖ్ గా నియమించడంతో త్రినాధ్ రావు కు స్నేహితులు,కుటుంబసభ్యులు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా సహ ప్రముఖ్ ఎం దేవా త్రినాధ్ రావు మాట్లాడుతూ సంస్థ కార్యకలాపాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్ళడానికి శాయశక్తులా ప్రయత్నిస్తానన్నారు

Comments
Post a Comment