Skip to main content

శ్రీ శ్రీ శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానం సింహాచలం. ​సింహాచలం గోశాలలో ఆధునిక గ్రాసం కట్టర్ ప్రారంభించిన ఆలయ కార్య నిర్వహణ అధికారి జల్లేపల్లి వెంకటరావు.


 సింహాచలం, జూలై 31: శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామివారి దేవస్థానానికి చెందిన కృష్ణాపురం గోశాలలో గోవులకు మేతను వేగంగా అందించేందుకు ఒక భక్తుడు అందించిన ఆధునిక గ్రాసం కట్టర్ యంత్రాన్ని శుక్రవారం ఆలయ కార్య నిర్వహణ అధికారి జల్లేపల్లి వెంకటరావు.  ప్రారంభించారు. 


గోశాల పర్యవేక్షణ అధికారి (ఇన్‌చార్జ్) మూలా వాసు పర్యవేక్షణ లో సుమారు రూ. 1.80 లక్షల విలువైన ఈ యంత్రానికి ఆలయ కార్యనిర్వహణాధికారి జల్లేపల్లి వెంకటరావు గోశాలలో ప్రత్యేక పూజలు నిర్వహించి, కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. అనంతరము గోవును పూజించి మేతను అందించారు


ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ.. సుమారు 100 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న కృష్ణాపురం గోశాలలో దాదాపు 280 దేశవాళీ గోవులను సంరక్షిస్తున్నామని తెలిపారు. గోవులకు అవసరమైన పచ్చిగ్రాసాన్ని ఇక్కడే సాగు చేస్తూ, వాటి ఆరోగ్యం, వసతిపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నట్లు పేర్కొన్నారు. 


భక్తుల సహకారంతో ఇలాంటి ఆధునిక పరికరాలు అందుబాటులోకి రావడం వల్ల గోసేవ మరింత సులభతరం అవుతుందని, విరాళాలు అందించిన భక్తులకు స్వామివారి కృపాకటాక్షాలు ఉంటాయని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గోశాల పర్యవేక్షణ అధికారి (ఇన్‌చార్జ్) మూలా వాసు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

*శ్రీ సత్యసాయి సేవా సంస్థలు – విశాఖపట్నం జిల్లా* *ప్రేమ సేవగా తలవంచిన వేళ — గిరి ప్రదక్షిణ భక్తుల అలసిన పాదాలకు ఉపశమనం కల్పించిన శ్రీ సత్యసాయి సేవాదళ్- గిరి ప్రదక్షిణ మార్గంలో వేలాది మంది భక్తులకు ప్రేమతో, నిస్వార్థంగా సేవలందించిన విశాఖ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థలు*

విశాఖపట్నం :29 జులై 2026: పవిత్రమైన గురుపూర్ణిమ సందర్భంగా సింహాచల క్షేత్ర ఆరాధ్యదైవం, కోట్లాది మంది భక్తుల ఇలవేల్పు శ్రీ శ్రీ శ్రీ వరాహ లక్ష్మీనృసింహ స్వామివారి గిరి ప్రదక్షిణలో పాల్గొన్న లక్షలాది మంది భక్తులకు విశాఖ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థలు విస్తృతమైన సేవా కార్యక్రమాలను ప్రేమతో, భక్తిశ్రద్ధలతో నిర్వహించాయి. విశాఖ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థల సింహాచలం సమితి, గోపాలపట్నం భజన మండలి ఆధ్వర్యంలో గిరి ప్రదక్షిణకు విచ్చేసిన భక్తులకు 28 జులై 2026 ఉదయం నుంచే సేవా కార్యక్రమాలు ప్రారంభమై, రాత్రంతా కొనసాగి 29 జులై 2026 ఉదయం 7 గంటల వరకు నిర్వహించబడ్డాయి. *అలసిన భక్తుల పాదాలకు ప్రేమతో ఉపశమనం — ప్రత్యేక సేవ* గిరి ప్రదక్షిణలో ఎంతో దూరం నడిచి అలసిపోయిన భక్తుల పాదాలకు ఉపశమనం కల్పించేందుకు శ్రీ సత్యసాయి సేవా సంస్థలు చేపట్టిన ప్రత్యేక పాద మర్దన సేవ అందరి హృదయాలను స్పృశించింది. భక్తుల అలసిన పాదాలకు ఉపశమనం కలిగించేందుకు నువ్వుల నూనెలో ప్రత్యేక వనమూలికలను మరిగించి తయారుచేసిన నూనెను శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ప్రత్యేకంగా సిద్ధం చేయించాయి. శ్రీ సత్యసాయి మహిళా మరియు పురుష సేవాదళ్ సభ్యులు స్వయంగా భక్...