సింహాచలం, జూలై 30, 2026:తిరుమల తిరుపతి దేవస్థానాల విజిలెన్స్ ఎస్పీ మురళీకృష్ణ, ఐపీఎస్ గురువారం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామివారిని దర్శించుకున్నారు.
ఆలయానికి విచ్చేసిన ఆయనకు దేవస్థానం సహాయ కార్యనిర్వహణాధికారి కె. తిరుమలేశ్వరరావు, పర్యవేక్షణాధికారి కె. వెంకటేశ్వరరావు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం సాంప్రదాయబద్ధంగా కప్పస్తంభ ఆలింగనం కార్యక్రమాన్ని నిర్వహించి, శ్రీ స్వామివారి దర్శనానికి తీసుకువెళ్లారు.
దర్శనం అనంతరం ఆలయ వేద పండితులు వేదాశీర్వచనం అందజేయగా, దేవస్థానం అధికారులు స్వామివారి ప్రసాదాలు, జ్ఞాపికగా స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు.

Comments
Post a Comment