ఆర్యవైశ్య యువజన సంఘం, విశాఖపట్నం నకు 2026-27 సంవత్సరమునకు సంబంధించి నూతన కార్యవర్గం ను ఎన్నుకునేందుకు ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు ఆ సంఘం తక్షణ మాజీ అధ్యక్షుడు శ్రీ దుర్గా సోమేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు.
ఆగస్టు 23వ తేదీ నాడు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద గల వాసవి భవన్ లో నిర్వహించనున్న ఆర్యవైశ్య యువజన సంఘం 50వ వార్షిక సర్వసభ్య సమావేశము మరియు 2026-27 నకు నూతన కార్యవర్గ ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సంఘ నిబంధనలకు అనుగుణంగా ఒక అధ్యక్షుడు, ఒక కార్యదర్శి, ఒక కోశాధికారితో పాటు ముగ్గురు ఉపాధ్యక్షులు, ముగ్గురు సహాయ కార్యదర్శులు, ఒక సంయుక్త కోశాధికారి మరియు 42 మంది కార్యవర్గ సభ్యులకు ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఆగష్ట్ 5 వతేది నుండి 11వ తేది వరకు సంఘం ఆఫీసులో నామినేషన్ల దాఖలు చేసుకోవచ్చని, 12వ తేది పరిశీలన, 13వ తేది ప్రకటన, ఉపసంహరణ 14 నుండి 16 వరకు, మరియు 16వ తేది ప్రకటన మరియు 23వ తేది ఆదివారం నాడు ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.
ఆర్యవైశ్య యువజన సంఘం అభివృద్ధికి తగిన సమయం వెచ్చించగలిగే సంఘ సభ్యులు పోటీలో పాల్గొనాలని తెలిపారు.

Comments
Post a Comment