Skip to main content

అమలాపురంలో కాలువ, స్మశాన వాటిక స్థలాల ఆక్రమణపై తక్షణమే సర్వే నిర్వహించాలంటూ కలెక్టర్‌కు వి. సి. కె పార్టీ పిర్యాదు.....

.             SRINIVAS SPL Correspondant 
అమలాపురం, విశాఖ సందేసం...అమలాపురం ఈదరపల్లి బైపాస్ సమీపంలో అక్రమ నిర్మాణాలు, కుమ్మర కాలువ ఆక్రమణలు మరియు స్మశాన వాటిక స్థలాల కబ్జాలపై విముక్త చిరుతల కక్షి (VCK) పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మేరకు డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్‌కు వి. సి. కె పార్టీ రాష్ట్ర డిప్యూటీ జనరల్ సెక్రటరీ బొంతు రమణ పిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, క్షేత్రస్థాయిలో జరుగుతున్న అక్రమాలపై ప్రధాన అంశాలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు: 

​చేపల మార్కెట్ నుండి బైపాస్ రోడ్డు వరకు గతంలో ఉన్న 10 అడుగుల కాలిబాట స్థానంలో కుమ్మర కాలువను ఆక్రమించి కొత్త రోడ్డు నిర్మిస్తున్నారు. దీనివల్ల స్థానిక పేద రైతుల వరి చేలు, పట్టా భూములు దెబ్బతింటున్నాయి.

పురపాలక సంఘం ₹10 లక్షల గ్రాంటుతో నిర్మిస్తున్న హిందూ స్మశాన వాటిక కాంపౌండ్ గోడను పాత సరిహద్దుల కంటే ముందుకు జరిపి నిర్మిస్తున్నారని, భవిష్యత్తులో స్థల కొరత ఏర్పడే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు అధికారులతో కుమ్మక్కై 42 అడుగుల రోడ్డు నిర్మాణం పేరిట ప్రజా ఆస్తులను ఆక్రమించే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు డేవిడ్ అంబేద్కర్, జిల్లా సెక్రెటరీ కాశి సాయికుమార్, జిల్లా యూత్ అధ్యక్షుడు పాలమూరు సందీప్, బూల వినయ్ తదితరులు పాల్గొన్నారు.



Comments

Popular posts from this blog

*శ్రీ సత్యసాయి సేవా సంస్థలు – విశాఖపట్నం జిల్లా* *ప్రేమ సేవగా తలవంచిన వేళ — గిరి ప్రదక్షిణ భక్తుల అలసిన పాదాలకు ఉపశమనం కల్పించిన శ్రీ సత్యసాయి సేవాదళ్- గిరి ప్రదక్షిణ మార్గంలో వేలాది మంది భక్తులకు ప్రేమతో, నిస్వార్థంగా సేవలందించిన విశాఖ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థలు*

విశాఖపట్నం :29 జులై 2026: పవిత్రమైన గురుపూర్ణిమ సందర్భంగా సింహాచల క్షేత్ర ఆరాధ్యదైవం, కోట్లాది మంది భక్తుల ఇలవేల్పు శ్రీ శ్రీ శ్రీ వరాహ లక్ష్మీనృసింహ స్వామివారి గిరి ప్రదక్షిణలో పాల్గొన్న లక్షలాది మంది భక్తులకు విశాఖ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థలు విస్తృతమైన సేవా కార్యక్రమాలను ప్రేమతో, భక్తిశ్రద్ధలతో నిర్వహించాయి. విశాఖ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థల సింహాచలం సమితి, గోపాలపట్నం భజన మండలి ఆధ్వర్యంలో గిరి ప్రదక్షిణకు విచ్చేసిన భక్తులకు 28 జులై 2026 ఉదయం నుంచే సేవా కార్యక్రమాలు ప్రారంభమై, రాత్రంతా కొనసాగి 29 జులై 2026 ఉదయం 7 గంటల వరకు నిర్వహించబడ్డాయి. *అలసిన భక్తుల పాదాలకు ప్రేమతో ఉపశమనం — ప్రత్యేక సేవ* గిరి ప్రదక్షిణలో ఎంతో దూరం నడిచి అలసిపోయిన భక్తుల పాదాలకు ఉపశమనం కల్పించేందుకు శ్రీ సత్యసాయి సేవా సంస్థలు చేపట్టిన ప్రత్యేక పాద మర్దన సేవ అందరి హృదయాలను స్పృశించింది. భక్తుల అలసిన పాదాలకు ఉపశమనం కలిగించేందుకు నువ్వుల నూనెలో ప్రత్యేక వనమూలికలను మరిగించి తయారుచేసిన నూనెను శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ప్రత్యేకంగా సిద్ధం చేయించాయి. శ్రీ సత్యసాయి మహిళా మరియు పురుష సేవాదళ్ సభ్యులు స్వయంగా భక్...