Skip to main content

విద్యుత్ బస్సులను నేరుగా ఆర్టీసీ సంస్థ ద్వారానే నిర్వహించాలి.. ఆర్ టి సి యూనియన్లు... జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం......

.               SRINIVAS SPL Correspondant 
అమలాపురం, విశాఖ సందేసం విద్యుత్ బస్సులను నేరుగా ఆర్టీసీ సంస్థ ద్వారానే నిర్వహించాలని కోరుతూ,డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ఆర్టీసీ కార్మికులు అందరి సంతకాలతో కూడిన విజ్ఞాపన పత్రం జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ కు ,జిల్లా జేఏసీ నాయకులు అందజేశారు.

విద్యుత్ బస్సుల పాలసీ పేరుతో ఆర్టీసీని ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టాలని చూస్తున్న ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ, రాష్ట్ర జేఏసీ పిలుపులో భాగంగా జిల్లాలోని అమలాపురం ,రాజోలు, రావులపాలెం, రామచంద్రాపురం డిపోలకు చెందిన కార్మికుల అందరి సంతకలతో కూడిన వినతి పత్రాన్ని జిల్లా ఆర్టీసీ జేఏసీ నాయకత్వం జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ అందజేయడం జరిగినది. 

 విద్యుత్ బస్సుల పాలసీ పేరుతో ఆర్టీసీ ఆస్తులను ప్రైవేటు వ్యక్తులకు లీజు కు ఇవ్వడం మానుకోవాలని , పినాకిల్ సంస్థ కొరకు రాష్ట్రంలో మూసివేసిన విద్యాధరపురం, నెల్లూరు 2, మంగళం డిపోలను వెంటనే తెరవాలని,

విద్యుత్ బస్సులను ఆర్టీసీ సంస్థ ద్వారానే నడపాలని, విద్యుత్ బస్సులను ఆర్టీసీ రెగ్యులర్ కార్మికుల తోనే నిర్వహించాలని,


కేంద్ర ప్రభుత్వం విద్యుత్ బస్సుల నిర్వహణకు ప్రతి ఏటా ఇచ్చే 650 కోట్ల రాయితీలను ఆర్టీసీ కే నేరుగా చెల్లించాలని, 

స్త్రీ శక్తి పథకం ద్వారా వస్తున్న ఇబ్బందులను పరిష్కరించాలని, వెంటనే 4000 బస్సులు కొనాలని, పదివేల మంది కార్మికులను రిక్రూట్మెంట్ చేయాలని, ఆర్టీసీ కార్మికులకు పాత మెడికల్ విధానాన్ని తిరిగి కొనసాగించాలని, కార్మికులకు రావాల్సిన జీతం తాలూకు బకాయిలు వెంటనే చెల్లించాలని, ఐఆర్ ప్రకటించాలని, 12వ పి ఆర్ సి కమిటీ వేయాలని చేసిన నాయకులు విజ్ఞప్తి చేశారు. నేషనల్ మజ్దూర్ యూనియన్ జిల్లా కార్యదర్శి పి రాంబాబు , ఎంప్లాయిస్ యూనియన్ జోనల్ కార్యదర్శి కే వి వి ఎస్ నారాయణ , యునైటెడ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కే రంగ ప్రసాద్ మరియు జిల్లాలోని నాలుగు డిపోల అన్ని యూనియన్ల కార్యదర్శి, ప్రెసిడెంట్ లు పి మణిరాజు జంగా నాగేశ్వరరావు , పివి రమణ , ఎస్ శ్రీనివాస్, జీ ప్రసాద్ రావు , డి మల్లికార్జున రావు గారు, వి వి వి ఎస్ నారాయణ, ఏ వి ఆర్ నాయుడు , నేషనల్ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి బి ఏసేబు  పాల్గొన్నారు. పెద్ద ఎత్తున నాలుగు డిపో నుండి కార్మికులు సంఘీభావంగా పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

*శ్రీ సత్యసాయి సేవా సంస్థలు – విశాఖపట్నం జిల్లా* *ప్రేమ సేవగా తలవంచిన వేళ — గిరి ప్రదక్షిణ భక్తుల అలసిన పాదాలకు ఉపశమనం కల్పించిన శ్రీ సత్యసాయి సేవాదళ్- గిరి ప్రదక్షిణ మార్గంలో వేలాది మంది భక్తులకు ప్రేమతో, నిస్వార్థంగా సేవలందించిన విశాఖ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థలు*

విశాఖపట్నం :29 జులై 2026: పవిత్రమైన గురుపూర్ణిమ సందర్భంగా సింహాచల క్షేత్ర ఆరాధ్యదైవం, కోట్లాది మంది భక్తుల ఇలవేల్పు శ్రీ శ్రీ శ్రీ వరాహ లక్ష్మీనృసింహ స్వామివారి గిరి ప్రదక్షిణలో పాల్గొన్న లక్షలాది మంది భక్తులకు విశాఖ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థలు విస్తృతమైన సేవా కార్యక్రమాలను ప్రేమతో, భక్తిశ్రద్ధలతో నిర్వహించాయి. విశాఖ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థల సింహాచలం సమితి, గోపాలపట్నం భజన మండలి ఆధ్వర్యంలో గిరి ప్రదక్షిణకు విచ్చేసిన భక్తులకు 28 జులై 2026 ఉదయం నుంచే సేవా కార్యక్రమాలు ప్రారంభమై, రాత్రంతా కొనసాగి 29 జులై 2026 ఉదయం 7 గంటల వరకు నిర్వహించబడ్డాయి. *అలసిన భక్తుల పాదాలకు ప్రేమతో ఉపశమనం — ప్రత్యేక సేవ* గిరి ప్రదక్షిణలో ఎంతో దూరం నడిచి అలసిపోయిన భక్తుల పాదాలకు ఉపశమనం కల్పించేందుకు శ్రీ సత్యసాయి సేవా సంస్థలు చేపట్టిన ప్రత్యేక పాద మర్దన సేవ అందరి హృదయాలను స్పృశించింది. భక్తుల అలసిన పాదాలకు ఉపశమనం కలిగించేందుకు నువ్వుల నూనెలో ప్రత్యేక వనమూలికలను మరిగించి తయారుచేసిన నూనెను శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ప్రత్యేకంగా సిద్ధం చేయించాయి. శ్రీ సత్యసాయి మహిళా మరియు పురుష సేవాదళ్ సభ్యులు స్వయంగా భక్...