. K.V.SHARMA EDITOR
ఆంధ్ర విశ్వవిద్యాలయం, ఆగస్టు 4:హాస్టల్లో విద్యార్థులకు మెస్ లలో వినియోగించే ఆహార పదార్థాల నాణ్యత ప్రతిరోజు పర్యవేక్షించాలని ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య జి.పి రాజశేఖర్ అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం ఆయన చీఫ్ వార్డెన్లు ఇతర అధికారులతో హాస్టల్స్ నిర్వహణపై సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా వీసీ ఆచార్య జి.పి.రాజశేఖర్ మాట్లాడుతూ హాస్టల్ కమిటీలకు సంబంధించిన విధులను స్పష్టంగా తెలియజేయాలని, వారు ప్రతిరోజు పర్యవేక్షణ జరిపే విధంగా చీఫ్ వార్డెన్స్ శ్రద్ధ వహించాలని సూచించారు. ప్రతిరోజు మెస్ లలో ఉండే ఆహార పదార్థాల నాణ్యత, స్టోర్ లలో నిల్వచేసిన కూరగాయలు, ఇతర వస్తువుల నాణ్యతను తరచు తనిఖీ చేయాలని తద్వారా నాణ్యతలో రాజీ లేకుండా చూడాలని సూచించారు. విద్యార్థులు ప్రతిరోజు ఇద్దరు చొప్పున ఒక మెస్ లో భోజన నాణ్యతను పర్యవేక్షించడం, తనిఖీ చేసే బాధ్యతలను స్వీకరించాలని తెలిపారు. వీరికి ఆ రోజుకు సంబంధించిన అటెండెన్స్ సైతం ఇచ్చే విధంగా చర్యలు చేపడతామని చెప్పారు.
విద్యార్థులు కోరిన విధంగా వైఫై సదుపాయం, సీసీ కెమెరాలు ఏర్పాటు ప్రక్రియ వేగవంతం చేయాలని మౌలిక వసతుల కల్పన విభాగానికి ఆదేశించారు. రేపు డీన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్వయంగా హాస్టల్స్ ను పరిశీలించి అక్కడ అవసరమైన మరమ్మత్తులు సంబంధించి ఒక నివేదిక సిద్ధం చేయాలని, అవసరమైన పనులను త్వరితగతిన చేపట్టాలని స్పష్టం చేశారు. అదేవిధంగా ఆచార్యులతో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వెల్ బీయింగ్ కమిటీలు ప్రతి వారం హాస్టల్ మెస్ లను సందర్శించడం అక్కడ విద్యార్థులతో మాట్లాడి భోజన నాణ్యతను పరిశీలించాలని తెలిపారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించే విధంగా సమిష్టిగా పని చేయాలని అధికారులకు సూచించారు.

మెస్ లో తయారు చేసే భోజనంలో లోపాలు కనిపిస్తే దానికి సంబంధిత సిబ్బంది బాధ్యత వహించాల్సి ఉంటుంది. భోజన తయారీకి వినియోగించే ఆహార పదార్థాలలో నాణ్యత లోపిస్తే వాటిని సరఫరా చేసే సంబంధిత ఏజెన్సీ పై చర్యలు తీసుకోబడతాయి.
విద్యార్థులు కోరిన విధంగా వైఫై సదుపాయం, సీసీ కెమెరాలు ఏర్పాటు ప్రక్రియ వేగవంతం చేయాలని మౌలిక వసతుల కల్పన విభాగానికి ఆదేశించారు. రేపు డీన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్వయంగా హాస్టల్స్ ను పరిశీలించి అక్కడ అవసరమైన మరమ్మత్తులు సంబంధించి ఒక నివేదిక సిద్ధం చేయాలని, అవసరమైన పనులను త్వరితగతిన చేపట్టాలని స్పష్టం చేశారు. అదేవిధంగా ఆచార్యులతో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వెల్ బీయింగ్ కమిటీలు ప్రతి వారం హాస్టల్ మెస్ లను సందర్శించడం అక్కడ విద్యార్థులతో మాట్లాడి భోజన నాణ్యతను పరిశీలించాలని తెలిపారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించే విధంగా సమిష్టిగా పని చేయాలని అధికారులకు సూచించారు.
సమావేశంలో రెక్టార్ ఆచార్య పులిపాటి కింగ్, రిజిస్ట్రా ఆచార్య కె. రాంబాబు, చీఫ్ వార్డెన్లు, స్టూడెంట్ వెల్ఫేర్ డీన్, అసోసియేటెడ్ డీన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డీన్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Comments
Post a Comment