Skip to main content

విశాఖపట్నం నుంచి కొత్త రైళ్ల కోసం ప్రతిపాదన: జీఎం సందీప్ మాథుర్

 


విశాఖపట్నం, ఆగస్టు 06: వచ్చే ఏడాది గోదావరి పుష్కరాలకు సిద్ధంగా ఉన్నామని దక్షిణ కోస్తా రైల్వే జోన్ జీఎం సందీప్ మాథుర్ స్పష్టం చేశారు. ఈ పుష్కరాలు నేపథ్యంలో మూడు రైల్వేస్టేషన్లు.. రాజమండ్రి, గోదావరి, కొవ్వూరు అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. గురువారం విశాఖపట్నంలో ఆయన మాట్లాడుతూ.. విశాఖ రైల్వేస్టేషన్‌ అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. ఈ రైల్వేస్టేషన్‌లో అదనంగా 6 నూతన రైల్వే ప్లాట్ ఫారమ్‌లు, 6 కొత్త రైల్వే లైన్లు వేయనున్నట్లు వివరించారు. నూతన ఎలక్ట్రానిక్ సిగ్నల్ వ్యవస్థ కూడా వస్తుందని అన్నారు. మరిన్ని కొత్త రైళ్లు విశాఖ నుంచి ప్రారంభిస్తామని చెప్పారు. బళ్లారి వైపు రైళ్లు పెంచుతున్నామని చెప్పారు.

తిరుపతికి ట్రాఫిక్ అధికంగా ఉందన్నారు. విజయవాడలో ఆటోమేటిక్ సిగ్నల్ వ్యవస్థను అభివృద్ధి చేస్తున్నామని పేర్కొన్నారు. మరిన్ని రైళ్లలో కవచ్‌ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అయితే విశాఖపట్నం నుంచి ఇప్పటికే అనేక కొత్త రైలు ప్రతిపాదన చేశామని ఆయన గుర్తు చేశారు. రైల్వే బోర్డు అంగీకరించిన తరవాత విశాఖ నుంచి పూర్తి షెడ్యూల్‌తో అవి నడుస్తాయని జీఎం సందీప్ మాథుర్ పేర్కొన్నారు.

కోటి పల్లి - నరసాపురం రైల్వే లైన్ కోసం ప్రభుత్వం నుంచి కొంత భూమి అవసరం అవుతుందని.. దీనిపై ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నామన్నారు. పలు వందేభారత్ రైళ్లు విశాఖపట్నం వస్తున్నాయని గుర్తు చేశారు. ఇప్పటికే గోదావరి ఉప నదులపై వంతెనల నిర్మాణాన్ని కొంత పూర్తి చేశామని వివరించారు. నరసాపురం- బెంగళూరు, తిరుపతి-విశాఖపట్నం మధ్య నడిచే రైళ్లను రెగ్యులర్ చేస్తున్నట్లు వివరించారు. విజయవాడ, గుంతకల్లు డివిజన్లతో చర్చలు జరిపామన్నారు. కృష్ణపట్నం పోర్ట్ ఉత్పతి పెరుగుతోందని వివరించారు. ఈ ఏడాది 108 మిలియన్ టన్నుల ఉత్పత్తి లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని దక్షిణ కోస్తా రైల్వే జోన్ జీఎం సందీప్ మాథుర్ వెల్లడించారు.

                 K.V.SHARMA EDITOR 

Comments

Popular posts from this blog

*శ్రీ సత్యసాయి సేవా సంస్థలు – విశాఖపట్నం జిల్లా* *ప్రేమ సేవగా తలవంచిన వేళ — గిరి ప్రదక్షిణ భక్తుల అలసిన పాదాలకు ఉపశమనం కల్పించిన శ్రీ సత్యసాయి సేవాదళ్- గిరి ప్రదక్షిణ మార్గంలో వేలాది మంది భక్తులకు ప్రేమతో, నిస్వార్థంగా సేవలందించిన విశాఖ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థలు*

విశాఖపట్నం :29 జులై 2026: పవిత్రమైన గురుపూర్ణిమ సందర్భంగా సింహాచల క్షేత్ర ఆరాధ్యదైవం, కోట్లాది మంది భక్తుల ఇలవేల్పు శ్రీ శ్రీ శ్రీ వరాహ లక్ష్మీనృసింహ స్వామివారి గిరి ప్రదక్షిణలో పాల్గొన్న లక్షలాది మంది భక్తులకు విశాఖ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థలు విస్తృతమైన సేవా కార్యక్రమాలను ప్రేమతో, భక్తిశ్రద్ధలతో నిర్వహించాయి. విశాఖ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థల సింహాచలం సమితి, గోపాలపట్నం భజన మండలి ఆధ్వర్యంలో గిరి ప్రదక్షిణకు విచ్చేసిన భక్తులకు 28 జులై 2026 ఉదయం నుంచే సేవా కార్యక్రమాలు ప్రారంభమై, రాత్రంతా కొనసాగి 29 జులై 2026 ఉదయం 7 గంటల వరకు నిర్వహించబడ్డాయి. *అలసిన భక్తుల పాదాలకు ప్రేమతో ఉపశమనం — ప్రత్యేక సేవ* గిరి ప్రదక్షిణలో ఎంతో దూరం నడిచి అలసిపోయిన భక్తుల పాదాలకు ఉపశమనం కల్పించేందుకు శ్రీ సత్యసాయి సేవా సంస్థలు చేపట్టిన ప్రత్యేక పాద మర్దన సేవ అందరి హృదయాలను స్పృశించింది. భక్తుల అలసిన పాదాలకు ఉపశమనం కలిగించేందుకు నువ్వుల నూనెలో ప్రత్యేక వనమూలికలను మరిగించి తయారుచేసిన నూనెను శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ప్రత్యేకంగా సిద్ధం చేయించాయి. శ్రీ సత్యసాయి మహిళా మరియు పురుష సేవాదళ్ సభ్యులు స్వయంగా భక్...