Skip to main content

విశాఖ ఉత్తర నియోజకవర్గంలో ముగిసిన రిలే నిరాహార దీక్షలు..* *శ్రీ కె. కె రాజు గారు ఆధ్వర్యంలో మూడు రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేపట్టిన విద్యార్థులు, యువత, నాయకులు...*


సత్యం జంక్షన్ వద్ద DSC లో జరిగిన అక్రమాలు పై లోకేష్ రాజీనామా చేయాలనీ డిమాండ్ చేస్తు మానవహారం నిర్వహించిన వైసీపీ శ్రేణులు...* 

 విద్యార్థి, నిరుద్యోగుల సమస్యలతో పాటు డీఎస్సీ అక్రమాలపై వైసీపీ జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గ సమన్వయకర్త *శ్రీ కె.కె రాజు గారు* ఆధ్వర్యంలో సత్యం జంక్షన్ వద్ద ప్రారంభమైన రిలే నిరాహార దీక్షలు శనివారం మూడో రోజుకు చేరుకున్నాయి


ఈ రోజు 47,48,49,50 51,52,53,54,55, వార్డు నాయకుల చేపట్టిన  రిలే నిరాహార దీక్షలును శ్రీ కె. కె రాజు గారు ప్రారంభించారు...

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డీఎస్సీ అక్రమాలతో పాటు నిరుద్యోగ భృతి, ఫీజురీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రూ.9500 కోట్లు చెల్లించాలన్న డిమాండ్‌తో రాష్ట్ర వ్యాప్తంగా రిలే నిరాహార దీక్షలు చేస్తుంటే ప్రభుత్వం ఉలిక్కిపడుతోందని చెప్పారు. శాంతియుతంగా నిరసనలు తెలుపుతుంటే  కొన్ని ప్రాంతాల్లో అధికార పార్టీ నేతలు దౌర్జన్యాలకు దిగుతున్నారని అన్నారు . ఈ ప్రభుత్వంలో ప్రశ్నించడమే నేరం అనే విధంగా అరెస్టులు, అక్రమ కేసులుపెడుతున్నారని, ఇలాంటి వాటికి వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీ భయపడదు అని అన్నారు అధికార, పోలీస్‌ బలంతో తమ ఉద్యమాన్ని అణచివేయాలని చూస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.అధికార పార్టీ నేతలు చెప్పినట్లు పోలీసులు నడుచుకోవద్దని కోరారు. అక్రమ అరెస్టులు, కేసులు పెడితే తిరుగుబాటు వస్తుందని హెచ్చరించారు.


ఈరోజు దీక్ష చేపట్టిన అల్లుశంకర్ రావు, రేయ్యివెంకటరమణ,వావిలపల్లి ప్రసాద్ భర్కట్ ఆలీ, గుజ్జు వెంకట్ రెడ్డి, సుకుమార్,డోప్ప శ్రీను,ఐ.రవికుమార్, వేణు ధమయంతి,ఎరం శెట్టి శ్రీను,కె వి బాబా షేక్ బాబ్జి, పి. ఈశ్వరి, చందు,కోరిబిల్లి చందు, తాటిపూడి రత్నం,సొండి సురేష్, శివరాం,విమల్ లకు నిమ్మరసం ఇచ్చి  కె. కె. రాజు గారు.మూడవ రోజు దీక్ష విరమీoప చేశారు.

అనంతరం సత్యం జంక్షన్ వద్ద DSC లో జరిగిన అక్రమాలు పై లోకేష్ రాజీనామా చేయాలనీ డిమాండ్ చేస్తు విద్యార్థులు, యువత,వైసీపీ శ్రేణులు తో కలిసి భారీగా మానవహారం చేపట్టారు.


ఈ కార్యక్రమంలో నిరుద్యోగులు,విద్యార్థులు,మేధావులు మరియు మాజీ డిప్యూటీ మేయర్ కటుమూరి సతీష్, నియోజకవర్గ పరిశీలకులు ,బాణాల శ్రీనివాసరావు, పెడాడ రమణి కుమారి,ప్రచార విభాగం జోన్ -1 ప్రెసిడెంట్ రవిరాజు,మాజీ కార్పొరేటర్లు అనిల్ కుమార్ రాజు, పద్మరెడ్డి,కె వి ఎన్ శశికళ,పామెటీ బాబ్జి,వార్డు అధ్యక్షులు బొడేటి కిరణ్,  రాష్ట్ర, జోనల్,జిల్లా,నియోజకవర్గ నాయకులు దేముడుబాబు మాస్టర్,కిరణ్ రాజు, తాడిజగన్నాధరెడ్డి,దుప్పలపూడి శ్రీనివాస్ అంబటి శైలేష్ యం.సునీల్, బయవరపు రాధా ,తిరుమలరావు,  నియోజకవర్గ అనుబంధ సంఘాల అధ్యక్షులు,వార్డు పరిశీలకులు మరియు 47,48,49,50,51,53,54,55  వార్డుల సీనియర్ నాయకులు, జిల్లా నాయకులు,వార్డు వైస్ ప్రెసిడెంట్,మహిళలు, సచివాలయం అధ్యక్షులు, బూత్ కన్వీనర్లు,మహిళలు, కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

*శ్రీ సత్యసాయి సేవా సంస్థలు – విశాఖపట్నం జిల్లా* *ప్రేమ సేవగా తలవంచిన వేళ — గిరి ప్రదక్షిణ భక్తుల అలసిన పాదాలకు ఉపశమనం కల్పించిన శ్రీ సత్యసాయి సేవాదళ్- గిరి ప్రదక్షిణ మార్గంలో వేలాది మంది భక్తులకు ప్రేమతో, నిస్వార్థంగా సేవలందించిన విశాఖ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థలు*

విశాఖపట్నం :29 జులై 2026: పవిత్రమైన గురుపూర్ణిమ సందర్భంగా సింహాచల క్షేత్ర ఆరాధ్యదైవం, కోట్లాది మంది భక్తుల ఇలవేల్పు శ్రీ శ్రీ శ్రీ వరాహ లక్ష్మీనృసింహ స్వామివారి గిరి ప్రదక్షిణలో పాల్గొన్న లక్షలాది మంది భక్తులకు విశాఖ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థలు విస్తృతమైన సేవా కార్యక్రమాలను ప్రేమతో, భక్తిశ్రద్ధలతో నిర్వహించాయి. విశాఖ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థల సింహాచలం సమితి, గోపాలపట్నం భజన మండలి ఆధ్వర్యంలో గిరి ప్రదక్షిణకు విచ్చేసిన భక్తులకు 28 జులై 2026 ఉదయం నుంచే సేవా కార్యక్రమాలు ప్రారంభమై, రాత్రంతా కొనసాగి 29 జులై 2026 ఉదయం 7 గంటల వరకు నిర్వహించబడ్డాయి. *అలసిన భక్తుల పాదాలకు ప్రేమతో ఉపశమనం — ప్రత్యేక సేవ* గిరి ప్రదక్షిణలో ఎంతో దూరం నడిచి అలసిపోయిన భక్తుల పాదాలకు ఉపశమనం కల్పించేందుకు శ్రీ సత్యసాయి సేవా సంస్థలు చేపట్టిన ప్రత్యేక పాద మర్దన సేవ అందరి హృదయాలను స్పృశించింది. భక్తుల అలసిన పాదాలకు ఉపశమనం కలిగించేందుకు నువ్వుల నూనెలో ప్రత్యేక వనమూలికలను మరిగించి తయారుచేసిన నూనెను శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ప్రత్యేకంగా సిద్ధం చేయించాయి. శ్రీ సత్యసాయి మహిళా మరియు పురుష సేవాదళ్ సభ్యులు స్వయంగా భక్...

శ్రీవాణి' 500వ సంచిక చారిత్రాత్మక వేడుకలకు విచ్చేసిన శ్రీ సత్య సాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ శ్రీ ఆర్. జె. రత్నాకర్ గారికి ఘన స్వాగతం

విజయవాడ:విశాఖ సందేశం వర్తవాహని: ఆగస్టు 7: నాలుగు దశాబ్దాలకు పైగా ఆధ్యాత్మిక, సాహిత్య సేవలను అందిస్తున్న ప్రముఖ మాసపత్రిక 'శ్రీవాణి' 500వ సంచిక ఆవిష్కరణ మహోత్సవంలో పాల్గొనడానికి విజయవాడకు విచ్చేసిన శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ శ్రీ ఆర్. జె. రత్నాకర్ గారికి విజయవాడ విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికారు. శ్రీ రత్నాకర్ గారికి శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఆర్. లక్ష్మణరావు, 'శ్రీవాణి' సంపాదకులు శ్రీ కొమరగిరి శ్యాంప్రసాద్, రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ చి.హెచ్.సురేంద్ర జిల్లా అధ్యక్షులు శ్రీ జి. విశ్వనాథం తదితర నిర్వాహకులు, సాయి భక్తులు పుష్పగుచ్ఛాలతో ఆత్మీయ స్వాగతం పలికారు. ఆగస్టు 8న విజయవాడ తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో జరగనున్న ఈ చారిత్రాత్మక 500వ సంచిక వేడుకలకు పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు.

భక్తి.. సాహిత్యం.. సేవ.. సమన్వయంగా ‘కవిం కవీనామ్‌’ — ఏలూరు జిల్లా భక్తుల పార్థి యాత్రలో హృదయాలను హత్తుకున్న ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు

ప్రశాంతి నిలయం:విశాఖ సందేశం వర్తవాహని:ఆగస్టు 9, 2026:ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు జిల్లా భక్తులు చేపట్టిన రెండు రోజుల పార్థి యాత్ర రెండవ రోజు, ఆగస్టు 9న, ప్రశాంతి నిలయంలో భక్తి, కృతజ్ఞత, సేవా భావాలతో నిండిన ఆధ్యాత్మిక వాతావరణంలో కొనసాగింది. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా పట్ల తమ అపారమైన ప్రేమ, భక్తి, కృతజ్ఞతలకు ప్రతీకగా భక్తులు శ్రీ సత్యసాయి అష్టోత్తర శతనామావళిని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. భగవాన్‌ పవిత్రమైన 108 నామాలను సామూహికంగా జపిస్తూ, స్వామివారి చిత్రపటానికి పవిత్ర అక్షతలను సమర్పించారు. ఈ కార్యక్రమం భక్తులను ఆధ్యాత్మిక భావనలో ముంచెత్తింది. రైతులకు అండగా ‘సేవ’*రెండవ రోజు ఉదయం గ్రామీణ కుటుంబాల సాధికారత లక్ష్యంగా చేపట్టిన ఒక అర్థవంతమైన సేవా కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఏలూరు జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థలలో సభ్యులైన 39 మంది ఆర్థికంగా వెనుకబడిన రైతులకు వ్యవసాయ కార్యకలాపాల్లో ఉపయోగపడే అధునాతన బ్యాటరీ ఆధారిత పవర్ స్ప్రేయర్లను భగవాన్ శ్రీ సత్యసాయి బాబా ప్రసాదంగా అందజేశారు. ఈ వ్యవసాయ పరికరాలను శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ శ్రీ ఆర్.జె. రత్నాకర్ అర్హులైన లబ్ధిదారులకు...