భర్త మరణ వార్త వినగానే భార్య సొమ్మసిల్లి పడి మృతి చెందింది.*.
*మరణంలోనూ భార్యాభర్తల బంధం వీడలేదు..*
దువ్వూరు టీచర్స్ కాలనీకి చెందిన ఇరగం రెడ్డి వెంకట్రాంరెడ్డి వయసు 79 అనారోగ్యంతో హైదరాబాద్లోని ప్రైవేట్ హాస్పిటల్ లో మృతి చెందాడు..
ఆయనకు ముగ్గురు కుమారులు ఉద్యోగరీత్యా హైదరాబాదులో స్థిరపడ్డారు..
భర్త మరణ వార్త విని భార్య నారాయణమ్మ వయసు 68 సొమ్మసిల్లి ఇంటి వద్ద పడిపోయింది..
హుటాహుటిన ఆసుపత్రికి తరలించడంతో అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు..
ఒకే రోజు తల్లిదండ్రి చనిపోవడంతో కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది..
ఈ ఘటనతో దువ్వూరు గ్రామంలో విషాదం చోటుచేసుకుంది..
హైదరాబాదు నుండి స్వగ్రామం దువ్వూరుకు మృతదేహాలను తీ
తరలించారు నేడు అంత్యక్రియలు జరపనున్నట్లు కుమారులు తెలిపారు.

Comments
Post a Comment