శ్రీ శ్రీ శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామివారి దేవస్థానం, సింహాచలం. సింహాచల శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామివారిని దర్శించుకున్న ఐఏఎస్ అధికారి శ్రీమతి ఎస్. ఎస్. శోభిక, దంపతులు.
సింహాచలం, 03 ఆగస్టు 2026: గిరిజన సహకార సంస్థ (GCC), విశాఖపట్నం వైస్ చైర్‌పర్సన్ & మేనేజింగ్ డైరెక్టర్ శ్రీమతి ఎస్. ఎస్. శోభిక, ఐఏఎస్ గారు కుటుంబ సభ్యులతో కలిసి నేడు శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామివారిని భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా ఆలయ సహాయ కార్యనిర్వహణాధికారి శ్రీ కె. తిరుమలేశ్వరావు వారికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం శ్రీమతి శోభిక దంపతులు మహిమాన్వితమైన కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకుని మొక్కులు చెల్లించుకున్నారు. తదుపరి స్వామివారి నిజరూప దర్శనం చేసుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.
దర్శనానంతరం ఆలయ వేద పండితులు వేదాశీర్వచనం అందజేయగా, ఆలయ అధికారులు శేషవస్త్రంతో సత్కరించి, శ్రీ స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.
K.V.SHARMA EDITOR



Comments
Post a Comment