Skip to main content

సత్య సాయి విద్యా విహార్- విశాఖపట్నం* (శ్రీ సత్యసాయి స్టేట్ ట్రస్ట్, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ఆధ్వర్యంలో) బాహ్య స్వాతంత్ర్యం నుంచి అంతర స్వాతంత్ర్యం వైపు విశాఖపట్నం :స్పిరిట్ ఆఫ్ ఇండిపెండెన్స్- ఆగస్టు 15, 16 తేదీల్లో శ్రీ సత్యసాయి విద్యావిహార్‌లో రెండు రోజుల ప్రదర్శన–సాంస్కృతిక కార్యక్రమాలు

విశాఖపట్నంభగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో, శ్రీ సత్యసాయి స్టేట్ ట్రస్ట్, ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న శ్రీ సత్యసాయి విద్యావిహార్, విశాఖపట్నం, విద్యా రంగంలో, విద్యతో పాటు ఇతర కార్యక్రమాల్లో, అలాగే విలువలతో కూడిన సమగ్ర విద్యను అందించడంలో విశిష్టతను కొనసాగిస్తోంది.

భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి శత వర్ష జన్మదినోత్సవ వేడుకల్లో భాగంగా మరియు స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో భాగంగా శ్రీ సత్యసాయి నేషనల్ కౌన్సిల్ ఫర్ స్కూల్స్, ఇండియా మార్గదర్శకాలకు అనుగుణంగా, “స్పిరిట్ ఆఫ్ ఇండిపెండెన్స్ – స్వాతంత్ర్య స్ఫూర్తి” అనే ఇతివృత్తంతో ఆగస్టు 15, 16 తేదీల్లో పాఠశాల ప్రాంగణంలో ద్విదిన ప్రదర్శన–సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.


ఆగస్టు 15న జరిగే ప్రారంభ కార్యక్రమానికి గౌరవ అతిథిగా శ్రీ ఎం. శ్రీభరత్ గారు, గౌరవనీయ పార్లమెంట్ సభ్యులు, విశాఖపట్నం మరియు గీతం డీమ్డ్ టు బీ యూనివర్సిటీ అధ్యక్షులు హాజరుకానున్నారు. 16 ఆగష్టు న జరిగే 

వాలెడిక్టరీ కార్యక్రమానికి డా. జితేంద్ర శర్మ గారు, మేనేజింగ్ డైరెక్టర్ మరియు ఫౌండర్ సీఈఓ, ఆంధ్రప్రదేశ్ మెడ్‌టెక్ జోన్ (AMTZ) గౌరవ అతిథిగా హాజరుకానున్నారు.

శ్రీ సత్యసాయి నేషనల్ కౌన్సిల్ ఫర్ స్కూల్స్, ఇండియా కన్వీనర్ శ్రీ త్రిభువన్ సచ్‌దేవ గారు రెండు రోజుల కార్యక్రమాలకు ప్రత్యేక అతిథిగా హాజరుకానున్నారు.

*ఎగ్జిబిషన్‌ను ఆగస్టు 15వ తేదీ శనివారం మధ్యాహ్నం 12:30 గంటల నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు*, అలాగే *ఆగస్టు 16వ తేదీ ఆదివారం ఉదయం 10:00 గంటల నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు* ఈ చిన్నారులు ఎంతో శ్రద్ధతో రూపొందించిన అద్భుతమైన ఎగ్జిబిషన్‌ను సందర్శించవచ్చు.

                      K.V.SHARMA EDITOR 

Comments

Popular posts from this blog

*శ్రీ సత్యసాయి సేవా సంస్థలు – విశాఖపట్నం జిల్లా* *ప్రేమ సేవగా తలవంచిన వేళ — గిరి ప్రదక్షిణ భక్తుల అలసిన పాదాలకు ఉపశమనం కల్పించిన శ్రీ సత్యసాయి సేవాదళ్- గిరి ప్రదక్షిణ మార్గంలో వేలాది మంది భక్తులకు ప్రేమతో, నిస్వార్థంగా సేవలందించిన విశాఖ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థలు*

విశాఖపట్నం :29 జులై 2026: పవిత్రమైన గురుపూర్ణిమ సందర్భంగా సింహాచల క్షేత్ర ఆరాధ్యదైవం, కోట్లాది మంది భక్తుల ఇలవేల్పు శ్రీ శ్రీ శ్రీ వరాహ లక్ష్మీనృసింహ స్వామివారి గిరి ప్రదక్షిణలో పాల్గొన్న లక్షలాది మంది భక్తులకు విశాఖ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థలు విస్తృతమైన సేవా కార్యక్రమాలను ప్రేమతో, భక్తిశ్రద్ధలతో నిర్వహించాయి. విశాఖ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థల సింహాచలం సమితి, గోపాలపట్నం భజన మండలి ఆధ్వర్యంలో గిరి ప్రదక్షిణకు విచ్చేసిన భక్తులకు 28 జులై 2026 ఉదయం నుంచే సేవా కార్యక్రమాలు ప్రారంభమై, రాత్రంతా కొనసాగి 29 జులై 2026 ఉదయం 7 గంటల వరకు నిర్వహించబడ్డాయి. *అలసిన భక్తుల పాదాలకు ప్రేమతో ఉపశమనం — ప్రత్యేక సేవ* గిరి ప్రదక్షిణలో ఎంతో దూరం నడిచి అలసిపోయిన భక్తుల పాదాలకు ఉపశమనం కల్పించేందుకు శ్రీ సత్యసాయి సేవా సంస్థలు చేపట్టిన ప్రత్యేక పాద మర్దన సేవ అందరి హృదయాలను స్పృశించింది. భక్తుల అలసిన పాదాలకు ఉపశమనం కలిగించేందుకు నువ్వుల నూనెలో ప్రత్యేక వనమూలికలను మరిగించి తయారుచేసిన నూనెను శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ప్రత్యేకంగా సిద్ధం చేయించాయి. శ్రీ సత్యసాయి మహిళా మరియు పురుష సేవాదళ్ సభ్యులు స్వయంగా భక్...

శ్రీవాణి' 500వ సంచిక చారిత్రాత్మక వేడుకలకు విచ్చేసిన శ్రీ సత్య సాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ శ్రీ ఆర్. జె. రత్నాకర్ గారికి ఘన స్వాగతం

విజయవాడ:విశాఖ సందేశం వర్తవాహని: ఆగస్టు 7: నాలుగు దశాబ్దాలకు పైగా ఆధ్యాత్మిక, సాహిత్య సేవలను అందిస్తున్న ప్రముఖ మాసపత్రిక 'శ్రీవాణి' 500వ సంచిక ఆవిష్కరణ మహోత్సవంలో పాల్గొనడానికి విజయవాడకు విచ్చేసిన శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ శ్రీ ఆర్. జె. రత్నాకర్ గారికి విజయవాడ విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికారు. శ్రీ రత్నాకర్ గారికి శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఆర్. లక్ష్మణరావు, 'శ్రీవాణి' సంపాదకులు శ్రీ కొమరగిరి శ్యాంప్రసాద్, రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ చి.హెచ్.సురేంద్ర జిల్లా అధ్యక్షులు శ్రీ జి. విశ్వనాథం తదితర నిర్వాహకులు, సాయి భక్తులు పుష్పగుచ్ఛాలతో ఆత్మీయ స్వాగతం పలికారు. ఆగస్టు 8న విజయవాడ తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో జరగనున్న ఈ చారిత్రాత్మక 500వ సంచిక వేడుకలకు పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు.

భక్తి.. సాహిత్యం.. సేవ.. సమన్వయంగా ‘కవిం కవీనామ్‌’ — ఏలూరు జిల్లా భక్తుల పార్థి యాత్రలో హృదయాలను హత్తుకున్న ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు

ప్రశాంతి నిలయం:విశాఖ సందేశం వర్తవాహని:ఆగస్టు 9, 2026:ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు జిల్లా భక్తులు చేపట్టిన రెండు రోజుల పార్థి యాత్ర రెండవ రోజు, ఆగస్టు 9న, ప్రశాంతి నిలయంలో భక్తి, కృతజ్ఞత, సేవా భావాలతో నిండిన ఆధ్యాత్మిక వాతావరణంలో కొనసాగింది. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా పట్ల తమ అపారమైన ప్రేమ, భక్తి, కృతజ్ఞతలకు ప్రతీకగా భక్తులు శ్రీ సత్యసాయి అష్టోత్తర శతనామావళిని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. భగవాన్‌ పవిత్రమైన 108 నామాలను సామూహికంగా జపిస్తూ, స్వామివారి చిత్రపటానికి పవిత్ర అక్షతలను సమర్పించారు. ఈ కార్యక్రమం భక్తులను ఆధ్యాత్మిక భావనలో ముంచెత్తింది. రైతులకు అండగా ‘సేవ’*రెండవ రోజు ఉదయం గ్రామీణ కుటుంబాల సాధికారత లక్ష్యంగా చేపట్టిన ఒక అర్థవంతమైన సేవా కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఏలూరు జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థలలో సభ్యులైన 39 మంది ఆర్థికంగా వెనుకబడిన రైతులకు వ్యవసాయ కార్యకలాపాల్లో ఉపయోగపడే అధునాతన బ్యాటరీ ఆధారిత పవర్ స్ప్రేయర్లను భగవాన్ శ్రీ సత్యసాయి బాబా ప్రసాదంగా అందజేశారు. ఈ వ్యవసాయ పరికరాలను శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ శ్రీ ఆర్.జె. రత్నాకర్ అర్హులైన లబ్ధిదారులకు...