సింహాద్రి నాథుడు అత్యంత మహిమాన్వితుడు* *అందరి సహకారంతో* *ప్రధాన ఉత్సవాలు విజయవంతం* *మొక్కుబడి సమర్పించుకున్న గంట్ల*
సింహాచలం.. ఆగస్టు 5 ప్రపంచంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న సింహాచలం శ్రీ వరహాలక్ష్మీ నృసింహ స్వామి అత్యంత మహిమాన్వితులని సింహాచలం దేవస్థానం ధర్మకర్తల మండలి మాజీ సభ్యులు.. ప్రత్యేక ఆహ్వానితులు ..జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి ఆంధ్ర ప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టులు ఫెడరేషన్ రాష్ట్ర నాయకులు గంట్ల శ్రీనుబాబు పేర్కొన్నారు.. బుధవారం ఉదయం అప్పన్న కేశఖండనశాలలో తలనీలాలు సమర్పించి ఆయన మొక్కు చెల్లించుకున్నారు.. అనంతరం ఆలయానికి
పశ్చిమాభిముఖంగా ఉన్న పవిత్ర గంగ దారలో పుణ్య స్నానం ఆచరించారు.. తదుపరి ఆ దేవదేవుడు. సిరిలొలికించే
సింహాద్రినాధుని దర్శించుకుని తరించారు.. ఆలయ అర్చక స్వాములు ఆశీస్సులు స్వీకరించారు.. ఈ సందర్భంగా ఆలయం బయట గంట్ల శ్రీను బాబు మాట్లాడుతూ సింహాచలం గ్రామంలో జన్మించడం తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నట్లు చెప్పారు.. అందువల్లే ప్రతి ఏటా
సింహాద్రి నాధుడు చందనోత్సవానికి తలనీలాలు సమర్పించి మొక్కుబడి తీర్చుకోవడం జరుగుతుందన్నారు.. ఈ ఏడాది నిజరూప దర్శనం.. చందనోత్సవం..
గిరిప్రదక్షిణ తో పాటు ఉత్సవాలన్నీ అందరి సహకారంతో పూర్తి విజయవంతం కావడం ఎంతో సంతోష దాయకమన్నారు.. సింహాద్రి నాథుడి భక్తుడిగా.. దాతగా .. గ్రామస్తుడిగా ఉంటూ
అన్ని ఉత్సవాల్లో పాల్గొనే అవకాశం రావడం స్వామివారి కరుణాకటాక్షాలు అన్నారు.. చిన్ననాటి నుంచి గ్రామస్తులంతా స్వామిఉత్సవాల్లో పాల్గొనడం జరుగుతుందన్నారు.. లోకంలో అందరి పైన స్వామి ఆశీస్సులు ఉండాలని ఎప్పుడూ కోరుకోవడం జరుగుతుందన్నారు..
K.V.SHARMA EDITOR



Comments
Post a Comment