విశాఖపట్నం వన్ టౌన్ ప్రాంతంలో పోలీస్ స్టేషన్ వద్ద గల ఆర్యవైశ్య యువజన సంఘం లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సంఘ మాజీ అధ్యక్షుల్లో సీనియర్ అధ్యక్షులు శ్రీ పట్నాల వెంకట రెడ్డి జాతీయ పతాక ఆవిష్కరణ చేసి అనంతరం మాట్లాడుతూ సభను ఉద్దేశించి మాట్లాడుతూ దేశానికి స్వాతంత్రం తెచ్చి పెట్టేందుకు కృషి చేసిన ఆ మహనీయుల త్యాగం మనం నిత్యం గుర్తుపెట్టుకొని దేశభక్తిని అలవర్చుకోవాలన్నారు.
స్వాతంత్రం సాధించి 80 సంవత్సరాల అనంతరం కూడా మన దేశం ఇరుగుపొరుగు దేశాల నుండి యుద్ధ పరిస్థితులు నెలకొనడం వల్ల భారత దేశ పౌరులు అందరు మన దేశ నాయకత్వానికి అండగా నిలవాలన్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతున్న ఈ క్రమంలో మనమందరము స్వదేశీ వస్తువులనే ఉపయోగించి దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే విధంగా కృషిచేసి అగ్ర రాజ్యాల పెత్తనానికి ధీటుగా జవాబు చెప్పాలన్నారు.
ఆర్యవైశ్య యువజన సంఘం మాజీ అధ్యక్షులు కే.ఎమ్.వి.ఎస్.టి.రామకృష్ణ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ
నాటి బ్రిటిష్ పాలకుల నుండి భారతదేశ స్వాతంత్రం సాధించడానికి కృషి చేసిన మహనీయులలో ఆర్యవైశ్యుల పాత్ర ఎన్నదగినదని అన్నారు.
ఈ సందర్భంగా ఆర్యవైశ్య యువజన సంఘం వారు పేద ఆర్యవైశ్య మహిళలకు 5 కుట్టుమిషన్లు వారి జీవనోపాధి మెరుగుపరచుకునేందుకు పంపిణీ జేశారు.
స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించడానికి ముందు ఆర్యవైశ్య యువజన సంఘం ప్రాంగణంలో గల అమరజీవి పొట్టి శ్రీరాములు శిలా విగ్రహానికి పుష్పమాలాంకృతులు చేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో విన్నకోట రామమూర్తి, వెదుళ్ళపల్లి శ్రీనివాస రావు, పూసర్ల సంజీవరావు, కందుల మధుబాబు, నున్న గోపాల్, పచ్చిగోళ్ళ నవీన్ గుప్త తదితరులు పాల్గొన్నారు.
*****


Comments
Post a Comment