విశాఖ ఎకనామిక్ రీజన్ అభివృద్ధి పనులు పై సమీక్ష. *ప్రపంచ బ్యాంకు ప్రతినిధులతో జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ చర్చలు
విశాఖపట్నం ,:ఆగస్టు 20: విశాఖ ఎకనామిక్ రీజన్ అభివృద్ధి పనుల నేపథ్యంలో, మహా విశాఖపట్నం నగర పాలక సంస్థ పరిధిలో చేపట్టవలసిన అభివృద్ధి కార్యక్రమాలపై ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు జోన్స్, అభిజిత్ రాయ్, జ్యోతి నాయర్ గురువారం జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్‌ను జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలోని ఆయన చాంబర్లో కలిసి పలు అంశాలపై చర్చించారు.
ఈ సందర్భంగా జీవీఎంసీ పరిధిలో భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా చేపట్టనున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలు, మౌలిక వసతుల కల్పన, ప్రజలకు ప్రత్యక్షంగా ప్రయోజనం చేకూర్చే మెగా ప్రాజెక్టులపై కమిషనర్ ప్రతినిధి బృందంతో చర్చించారు.
నగరంలో పెరుగుతున్న జనాభా, పారిశ్రామిక మరియు ఆర్థిక కార్యకలాపాలకు అనుగుణంగా అవసరమైన మౌలిక వసతులను అభివృద్ధి చేయడంతో పాటు, ప్రజలకు మెరుగైన సేవలు అందించేలా దీర్ఘకాలిక ప్రణాళికలను రూపొందించాల్సిన అవసరాన్ని కమిషనర్ వివరించారు.
ఎకనామిక్ రీజన్ సిటీగా విశాఖపట్నం అభివృద్ధికి ప్రపంచ బ్యాంకు సహకారం, సాంకేతిక పరిజ్ఞానం మరియు నిధుల వినియోగానికి సంబంధించిన అంశాలపై కూడా ఇరుపక్షాలు పరస్పరం చర్చించుకున్నారు.
ఈ సమీక్షలో జీవీఎంసీ అదనపు కమిషనర్ ఫైనాన్స్ ఎస్ ఎస్ వర్మ, స్మార్ట్ సిటీ సీఈఓ ఆనంద్, విస్కో కన్సల్టెంట్ కె వి ఎన్ రవి తదితరులు పాల్గొన్నారు.
పౌర సంబంధాల అధికారి,జీవీఎంసీ

Comments
Post a Comment