Skip to main content

విశాఖ జిల్లా మత్స్యకార అధ్యక్షుడిగా వాసుపల్లి ధనరాజు* * *మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ కి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఘన సత్కారం* * *పదవి అంటే అలంకారం కాదు.. బాధ్యత* * *మత్స్యకారుల సమస్య పరిష్కారాలపై పోరాటం చేయాలి*! * *మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్*


దక్షిణ నియోజకవర్గ వైఎస్ఆర్సిపి సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ అందించిన సహకారానికి రుణపడి ఉంటామని, మత్స్యకారుల అభివృద్ధికి, సమస్య పరిష్కారానికి తన వంతు పోరాటం చేస్తానని విశాఖ జిల్లా మత్స్యకార అధ్యక్షుడు వాసుపల్లి ధనరాజు తెలిపారు. మాజీ ఎమ్మెల్యే కి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆశీలమెట్ట కార్యాలయంలో బుధవారం దనరాజు మత్స్యకారులతో కలిసి వాసుపల్లి గణేష్ కుమార్ కు  ఘన సత్కారం చేశారు*. బాణాసంచా కాల్చి వాసుపల్లికి ఘన స్వాగతం పలికారు. శాలువా కప్పి సత్కరించారు. మత్స్యకారులను గుర్తించి సముచిత స్థానం కల్పించిన జగన్మోహన్ రెడ్డికి, పార్టీ పెద్దలకు, దక్షిణ ప్రజల ఆపద్బాంధవుడు వాసుపల్లి గణేష్ కుమార్ కి రుణపడి ఉంటానని అన్నారు. *మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ మాట్లాడుతూ పదవి అంటే అలంకరణ కాదని, మన అధినేత జగన్మోహన్ రెడ్డి మాదిరిగా బాధ్యత ధైర్యం ఉండాలన్నారు. ముఖ్యంగా ప్రజలకు జవాబుదారితనం ఉండాలన్నారు. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు మత్స్యకారుల అణిచివేతకు కారకుడఅయ్యారన్నారు. అక్షరాస్యత లేని మా మత్స్యకారులను 40 ఏళ్లుగా మోసం చేయడమే కాకుండా, ఎన్నికల ముందు ఇచ్చిన మేనిఫెస్టోను కూడా చిత్తు కాగితంలా చూస్తాడని ఆరోపించారు. అంటరానితనాన్ని అరాచకానికి రూపుమాపాలంటే మళ్లీ జగన్మోహన్ రెడ్డి నాయకత్వం అధికారంలోకి రావాలని, ఆ దిశగా ప్రతి ఒక్కరు సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు*. ముఖ్యంగా మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాటం చేయాలన్నారు. అనంతరం వాసుపల్లి ధనరాజుకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్టేట్ జాయింట్ సెక్రటరీ లింగం శ్రీను, స్టేట్ బీసీ సెల్ సెక్రటరీ లండ రమణ,జిల్లా బీసీ సెల్ ప్రెసిడెంట్ సనపల రవీంద్ర భారత్,వార్డ్ ప్రెసిడెంట్ నీలపు సర్వేశ్వరరెడ్డి, గురజరాపు రవి,జిల్లా వాలంటీర్ విభాగం వైస్ ప్రెసిడెంట్ దూడ అప్పారావు,జిల్లా స్టూడెంట్ విభాగం వైస్ ప్రెసిడెంట్ గరికిన వెంకటేష్,జిల్లా బీసీ సెల్ కమిటీ దూడ తాతారావు, జిల్లా మత్స్యకార నాయకులు దూడ అచ్చుతా,గంటల డేడు, మెరుగు ఎల్లజీ,  సుగాలా నూకరాజు రాజు , వాసుపల్లి నరసింహులు,వార్డ్ మత్స్యకార నాయకులు అంబతి అప్పలరాజు , దాసరి నరసింగ్ రావు , దాసరి ఎల్లయ్య , సూరపతి నరసింగరావు , పిల్లి సత్తిబాబు ,చేపల నూకరాజు, చేపల రాజు,తదితరులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

*శ్రీ సత్యసాయి సేవా సంస్థలు – విశాఖపట్నం జిల్లా* *ప్రేమ సేవగా తలవంచిన వేళ — గిరి ప్రదక్షిణ భక్తుల అలసిన పాదాలకు ఉపశమనం కల్పించిన శ్రీ సత్యసాయి సేవాదళ్- గిరి ప్రదక్షిణ మార్గంలో వేలాది మంది భక్తులకు ప్రేమతో, నిస్వార్థంగా సేవలందించిన విశాఖ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థలు*

విశాఖపట్నం :29 జులై 2026: పవిత్రమైన గురుపూర్ణిమ సందర్భంగా సింహాచల క్షేత్ర ఆరాధ్యదైవం, కోట్లాది మంది భక్తుల ఇలవేల్పు శ్రీ శ్రీ శ్రీ వరాహ లక్ష్మీనృసింహ స్వామివారి గిరి ప్రదక్షిణలో పాల్గొన్న లక్షలాది మంది భక్తులకు విశాఖ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థలు విస్తృతమైన సేవా కార్యక్రమాలను ప్రేమతో, భక్తిశ్రద్ధలతో నిర్వహించాయి. విశాఖ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థల సింహాచలం సమితి, గోపాలపట్నం భజన మండలి ఆధ్వర్యంలో గిరి ప్రదక్షిణకు విచ్చేసిన భక్తులకు 28 జులై 2026 ఉదయం నుంచే సేవా కార్యక్రమాలు ప్రారంభమై, రాత్రంతా కొనసాగి 29 జులై 2026 ఉదయం 7 గంటల వరకు నిర్వహించబడ్డాయి. *అలసిన భక్తుల పాదాలకు ప్రేమతో ఉపశమనం — ప్రత్యేక సేవ* గిరి ప్రదక్షిణలో ఎంతో దూరం నడిచి అలసిపోయిన భక్తుల పాదాలకు ఉపశమనం కల్పించేందుకు శ్రీ సత్యసాయి సేవా సంస్థలు చేపట్టిన ప్రత్యేక పాద మర్దన సేవ అందరి హృదయాలను స్పృశించింది. భక్తుల అలసిన పాదాలకు ఉపశమనం కలిగించేందుకు నువ్వుల నూనెలో ప్రత్యేక వనమూలికలను మరిగించి తయారుచేసిన నూనెను శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ప్రత్యేకంగా సిద్ధం చేయించాయి. శ్రీ సత్యసాయి మహిళా మరియు పురుష సేవాదళ్ సభ్యులు స్వయంగా భక్...

శ్రీవాణి' 500వ సంచిక చారిత్రాత్మక వేడుకలకు విచ్చేసిన శ్రీ సత్య సాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ శ్రీ ఆర్. జె. రత్నాకర్ గారికి ఘన స్వాగతం

విజయవాడ:విశాఖ సందేశం వర్తవాహని: ఆగస్టు 7: నాలుగు దశాబ్దాలకు పైగా ఆధ్యాత్మిక, సాహిత్య సేవలను అందిస్తున్న ప్రముఖ మాసపత్రిక 'శ్రీవాణి' 500వ సంచిక ఆవిష్కరణ మహోత్సవంలో పాల్గొనడానికి విజయవాడకు విచ్చేసిన శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ శ్రీ ఆర్. జె. రత్నాకర్ గారికి విజయవాడ విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికారు. శ్రీ రత్నాకర్ గారికి శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఆర్. లక్ష్మణరావు, 'శ్రీవాణి' సంపాదకులు శ్రీ కొమరగిరి శ్యాంప్రసాద్, రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ చి.హెచ్.సురేంద్ర జిల్లా అధ్యక్షులు శ్రీ జి. విశ్వనాథం తదితర నిర్వాహకులు, సాయి భక్తులు పుష్పగుచ్ఛాలతో ఆత్మీయ స్వాగతం పలికారు. ఆగస్టు 8న విజయవాడ తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో జరగనున్న ఈ చారిత్రాత్మక 500వ సంచిక వేడుకలకు పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు.

భక్తి.. సాహిత్యం.. సేవ.. సమన్వయంగా ‘కవిం కవీనామ్‌’ — ఏలూరు జిల్లా భక్తుల పార్థి యాత్రలో హృదయాలను హత్తుకున్న ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు

ప్రశాంతి నిలయం:విశాఖ సందేశం వర్తవాహని:ఆగస్టు 9, 2026:ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు జిల్లా భక్తులు చేపట్టిన రెండు రోజుల పార్థి యాత్ర రెండవ రోజు, ఆగస్టు 9న, ప్రశాంతి నిలయంలో భక్తి, కృతజ్ఞత, సేవా భావాలతో నిండిన ఆధ్యాత్మిక వాతావరణంలో కొనసాగింది. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా పట్ల తమ అపారమైన ప్రేమ, భక్తి, కృతజ్ఞతలకు ప్రతీకగా భక్తులు శ్రీ సత్యసాయి అష్టోత్తర శతనామావళిని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. భగవాన్‌ పవిత్రమైన 108 నామాలను సామూహికంగా జపిస్తూ, స్వామివారి చిత్రపటానికి పవిత్ర అక్షతలను సమర్పించారు. ఈ కార్యక్రమం భక్తులను ఆధ్యాత్మిక భావనలో ముంచెత్తింది. రైతులకు అండగా ‘సేవ’*రెండవ రోజు ఉదయం గ్రామీణ కుటుంబాల సాధికారత లక్ష్యంగా చేపట్టిన ఒక అర్థవంతమైన సేవా కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఏలూరు జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థలలో సభ్యులైన 39 మంది ఆర్థికంగా వెనుకబడిన రైతులకు వ్యవసాయ కార్యకలాపాల్లో ఉపయోగపడే అధునాతన బ్యాటరీ ఆధారిత పవర్ స్ప్రేయర్లను భగవాన్ శ్రీ సత్యసాయి బాబా ప్రసాదంగా అందజేశారు. ఈ వ్యవసాయ పరికరాలను శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ శ్రీ ఆర్.జె. రత్నాకర్ అర్హులైన లబ్ధిదారులకు...