విశాఖపట్నం, ఆగస్టు 19 : ప్రపంచ ఫోటోగ్రాఫర్ల దినోత్సవ సందర్భంగా వాల్తేరు ఫోటోగ్రఫీ సొసైటీ ఆధ్వర్యంలో బుధ, గురువారాల్లో రెండు రోజులు పాటు ఆంధ్రాయూనివర్సిటీ హిందీ విభాగంలో మెగా ఫోటో ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు రెండు రోజులు పాటు ఫోటో ప్రదర్శన ఉంటుందని సొసైటీ కార్యదర్శి, సీనియర్ ఫోటో జర్నలిస్ట్ ఎం. వి.శ్రీనివాసరెడ్డి తెలిపారు ఫోటో ప్రదర్శన పద్మభూషణ్ యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ ప్రారంభించగా ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా ఆంధ్ర యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ కామర్స్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్. జాలాద
సీనియర్ రవి పాల్గొన్నారు ఈ సందర్భంగా సీనియర్ ఫోటో జర్నలిస్ట్ హిందూ ఫోటోగ్రాఫర్ కె ఆర్ దీపక్ ని సీనియర్ ఫోటో జర్నలిస్ట్ పళ్ళ రాజారావు మెమోరియల్ అవార్డు, సీనియర్ ఫోటోగ్రాఫర్ బండి వెంకటరమణారావు మెమోరియల్ అవార్డు ఫోటోగ్రాఫర్ ఎం.ఆర్. సత్యనారాయణ రెడ్డికి అందజేశారు జర్నలిస్టులు పి.శ్రీరామ్మూర్తి, జీవి. రమణారెడ్డి, పి. నారాయణ ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు లను ఆత్మీయ సత్కారం చేశారు. ఈ కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షులు పి. ఎన్. సేత్ సభ్యులు కే.ఎం.కే.రమేష్, డి.వి. రమణ, పల్లా శ్రీనివాస్, కనకరాజు, సన్యాసిరావు, బండి ప్రసాద్, సతీష్ కుమార్ పాల్గొన్నారు

Comments
Post a Comment