ఆంధ్రా యూనివర్సిటీ విద్యార్థులకు అసెంబ్లీ సందర్శనకు అవకాశం* *ప్రజాస్వామ్య వ్యవస్థపై అవగాహన పెంపొందించుకోవడానికి అసెంబ్లీ సందర్శన ఎంతో ఉపయోగకరం*– *ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్
ఆంధ్రా యూనివర్సిటీకి చెందిన ఎం.ఏ. పొలిటికల్ సైన్స్ విద్యార్థినీ విద్యార్థులు, పరిశోధక విద్యార్థులు దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ ఆధ్వర్యంలో అమరావతికి వెళ్లి ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలను ప్రత్యక్షంగా వీక్షించారు.
ఈ సందర్భంగా విద్యార్థులు గౌరవ శాసనసభ స్పీకర్ శ్రీ అయ్యన్నపాత్రుడు ని మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించారు. అనంతరం శాసనసభలో జరుగుతున్న సమావేశాల తీరును ప్రత్యక్షంగా వీక్షించి, చట్టసభ కార్యకలాపాలు, ప్రజా సమస్యలపై చర్చలు, ప్రజాస్వామ్య పాలనా విధానం తదితర అంశాలను స్వయంగా తెలుసుకున్నారు.
అనంతరం స్పీకర్ గారితో కలిసి విద్యార్థులు ఫొటోలు దిగుతూ తమ ఆనందాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థినీ విద్యార్థులు మాట్లాడుతూ.. పుస్తకాల ద్వారా తెలుసుకునే శాసనసభ వ్యవస్థను ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం లభించడం ఎంతో సంతోషంగా ఉందని, ఈ అనుభవం తమ విద్యాభ్యాసంతో పాటు భవిష్యత్ తరాలకు కూడా ఉపయోగపడుతుందని తెలిపారు.
ప్రజాస్వామ్య వ్యవస్థపై యువతకు అవగాహన పెంపొందించడం, రాజకీయ మరియు శాసన ప్రక్రియలను ప్రత్యక్షంగా పరిచయం చేయడం ద్వారా బాధ్యతాయుతమైన పౌరులను తీర్చిదిద్దవచ్చని ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గారు పేర్కొన్నారు. విద్యార్థులు కేవలం విద్యాసంస్థలకే పరిమితం కాకుండా ప్రజాస్వామ్య సంస్థల పనితీరును ప్రత్యక్షంగా తెలుసుకోవడం అభినందనీయమన్నారు.ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ ప్రేమానందం అధ్యాపకులు నాగరాజు గారు, సత్యనారాయణ గారు ఇతర అధ్యాపకులు, పరిశోధక విద్యార్థులు, ఎం.ఏ. పొలిటికల్ సైన్స్ విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు


Comments
Post a Comment