నగర అభివృద్ధిలో నిర్వహణ అత్యంత కీలకం * జీవీఎంసీ కమిషనర్ కేతన్‌గార్గ్ * చరిత్రలో ఎప్పటికీ నిలిచి జ్ఞాపకాన్ని మిగిల్చేవి ఫోటోలు మాత్రమే * గొప్ప ఛాయాచిత ప్రదర్శనను అన్ని వర్గాల ప్రజలు వినియోగించుకోవాలి
. K.V.SHARMA EDITOR
విశాఖపట్నం,ఆగస్టు 19 : మహా విశాఖ నగర పాలక సంస్థ (జీవీఎంసీ) అభివృద్ధికి నిరంతరం కృషి చేయడం జరుగుతుందని, దాంతో పాటు నిర్వహణ కూడా అత్యంత కీలకమని అప్పుడే మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేయగలమని జీవీఎంసీ కమిషనర్ కేతన్‌గార్గ్ పేర్కొన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా డిజిటల్ యోగం వచ్చిందని .. అయితే మన జ్ఞాపకాలను ఎప్పటికీ బంధించేది మాత్రం ఒక్క ఫోటో మాత్రమేనని అభిప్రాయపడ్డారు.వైజాగ్ ఫోటో జర్నలిస్టుల అసోసియేషన్ ఆధ్వర్యంల
ఈ నెల 19, 20 తేదిల్లో బీచ్ రోడ్ లోని విశాఖ మ్యూజియం వేదికగా జరుగుతున్న ఫోటో ఎగ్జిబిషన్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన గావించి గత ఏడాది నుంచి నేటి వరకు వైజాగ్ ఫోటో జర్నలిస్టులు తీసిన అత్యంత గొప్ప ఛాయాచిత్రాలను నిశితంగా పరిశీలించి ఆనాటి జ్ఞాపకాలను...
అప్పటి ఘటనలను ఫోటోగ్రాఫర్లు బంధించిన దృశ్యాలను చూసి కాసేపు ఆశ్చర్యానికి గురయ్యారు. మరో మారు ఆ జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. ఫోటోగ్రఫీ అంటే వాస్తవ పరిస్థితిని కళ్ళకు చూపించే గొప్ప కల అని తెలియజేశారు. సహజమైన రీతిలో బుర్రకు పదును పెడుతూ. తమదైన నైపుణ్యాన్ని ఫోటోగ్రాఫర్ల ద్వారా వెలుగులోకి తీసుకొస్తాయని తెలియజేశారు. భవిష్యత్తులో కూడా ఈ ప్రదర్శన మరింత ముందుకి సాగాలని ఆకాంక్షించారు. నగరంలోని జీవీఎంసీ ప్రదర్శన డిస్ప్లే బోర్డుల ద్వారా మరో వారం పది రోజులపాటు ఇవి ప్రదర్శన జరిగేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.
కార్యక్రమానికి సభాధ్యక్షత వహించిన వైజాగ్ ఫోటో జర్నలిస్టుల అసోసియేషన్ అధ్యక్షులు వై .రామకృష్ణ మాట్లాడుతూ రెండు రోజుల ఫోటో ఎగ్జిబిషన్ కు సహకరించిన జీవీఎంసీ కమిషనర్ కేతన్‌గార్గ్ కు తమ సభ్యులందరి తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని తెలియజేశారు. విశాఖ మ్యూజియంలో విశాఖపట్నంలో జరిగే ముఖ్యమైన ఈవెంట్ల లో ఫోటోగ్రాఫర్లు తీసే చిత్రాలను విశాఖ మ్యూజియంలో ప్రదర్శించాలని తద్వారా నగర పర్యటనకు వచ్చే సందర్శకులు, విద్యార్థులకు నగర అభివృద్ధి , ముఖ్యమైన అంశాలు తెలియచేసే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. అనంతరం జీవీఎంసీ కమిషనర్ కేతన్‌గార్గ్ ను ఘనంగా సభ్యులందరూ కలిసి సత్కరించి సన్మానించారు. ఆంధ్రప్రదేశ్ ప్రెస్ ఫోటోగ్రఫీ పోటీల్లో జాతీయ అవార్డు
పొందిన కె ఆర్ దీపక్, కన్సోలేషన్ అవార్డులు పొందిన వై. రామకృష్ణ, పి ఎల్. మోహన్ రావు, ఆలపాటి శరత్ కుమార్, పిల్లా నగేష్, కే మురళీకృష్ణ, టి. గణేష్ కుమార్ లను జీవీఎంసీ కమిషనర్ చేతుల మీదుగా సత్కరించి జ్ఞాపకను అందజేశారు. ఈ కార్యక్రమంలో జాతీయ జర్నలిస్టుల కార్యదర్శి గంట్ల శీను బాబు, నగరానికి చెందిన మేధావులు, అధ్యాపకులు పాల్గొన్నారు.
పెద్ద సంఖ్యలో సందర్శించిన విద్యార్థులు సందర్శకులు ....తొలిరోజు ఫోటో ఎగ్జిబిషన్ వివిధ పాఠశాలలు కళాశాలకు చెందిన విద్యార్థిని విద్యార్థులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి సందర్శించారు. పలు వీరు విద్యార్థులు ఛాయాచిత్ర ప్రదర్శనను తిలకించి తమ అనుభూతులను పంచుకున్నారు.. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన సందర్శకులు సైతం అత్యద్భుతమైన ఫోటోలను చూస్తూ... సెల్ఫీలు దిగుతూ సందడి చేశారు.

Comments
Post a Comment