శ్రీ శ్రీ శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానం సింహాచలం. సింహాచలంలో భక్తిశ్రద్ధలతో శ్రీ సుదర్శన హోమం నిర్వహణ.
సింహాచలం 10 ఆగస్టు 2026 :సింహాచలం కొండపై ఉన్న 'శ్రీ శ్రీ లక్ష్మీ కాంత నాయక్ దాస్డు ధర్మశాల' ఆవరణలో నేడు సుదర్శన హోమ కార్యక్రమం అత్యంత వైభవంగా, భక్తిశ్రద్ధలతో జరిగింది.
ఉదయం 8:00 గంటలకు ప్రారంభమైన ఈ విశేష పూజా కార్యక్రమంలో ఆలయ అర్చకులు వేద మంత్రోచ్ఛారణల నడుమ హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు.
అనంతరం మధ్యాహ్నం 11:30 నుండి 12:00 గంటల మధ్య పూర్ణాహుతి ఘనంగా జరిగింది. పూర్ణాహుతి అనంతరం విచ్చేసిన భక్తులకు మధ్యాహ్నం 12:30 గంటలకు తీర్థప్రసాదాలు (అన్నప్రసాదం) వితరణ చేశారు.
ఈ పవిత్ర కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణ అధికారి శ్రీ జల్లేపల్లి వెంకట్రావు, ఆలయ స్థానాచార్యులు టి పి రాజగోపాల్ ప్రధానార్చకులు శ్రీనివాస్ ఆచార్యులు, సీతారామాచార్యులు, ఇతరg ఆలయ అర్చకులు మరియు సిబ్బంది విశేషంగా పాల్గొన్నారు.
లోక కళ్యాణార్థం, సర్వజన సౌఖ్యాన్కి మరియు భక్తుల శ్రేయస్సును కాంక్షిస్తూ ఈ సుదర్శన హోమాన్ని నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ పూజా కార్యక్రమంలో దేవస్థానం ధర్మకర్త మండల సభ్యులు చలుమూరి భారతి, మధుపడ సన్యాసిరావు పలువురు భక్తులు పాల్గొని స్వామివారి దివ్య ఆశీస్సులు అందుకున్నారు.




Comments
Post a Comment